News
News
X

Chanakya Niti: చాణక్యుడు, కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు... ఈ మూడు పేర్లు తెలుసా.. అందుకే కన్ఫూజనా..!

ఒక వ్యక్తి...మూడు పేర్లు. ఏ పేరుకాపేరే ప్రత్యేకం. అందుకే వేర్వేరు వ్యక్తులేమో అనే చర్చ నడిచింది కొన్నాళ్లు. ఇప్పటికీ కొంతమందిలో ఆ సందేహం మిగిలేఉంది. ఆ సందేహాలకు సమాధానమే ఈ కథనం

FOLLOW US: 
Share:

క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దం, మూడో శతాబ్దం మధ్యకాలంలో జీవించిన గొప్ప మేధావి, రాజనీతిజ్ఞుడు కౌటిల్యుడు. ఈ పేరు చెప్పేసరికి ప్రపంచంలో  అతి ప్రాచీన గ్రంధాల్లో ప్రత్యేకంగా  చెప్పుకోదగిన అర్థశాస్త్రం గుర్తొస్తుంది. అపారమైన రాజనీతిజ్ఞత వందల సంవత్సరాలు నిరంతరాయంగా పాలించిన నందవంశాన్ని నిర్మూలించి…మగధ సింహాసనంపై చంద్రగుప్తుడిని కూర్చోబెట్టిన అపర మేధావి. నందవంశ నిర్మూలను…మౌర్య వంశ స్థాపనకు మూల కారకుడు కౌటిల్యుడే. ప్రపంచ ప్రసిద్ధి గ్రీకు తత్వవేత్తలు ప్లేటో, అరిస్టాటిల్ సరసన కూర్చోబెట్టాల్సిన మేధావి కౌటిల్యుడు. జగజ్జేత అలెగ్జాండర్ కి అరిస్టాటిల్ గురువైతే…చాణక్యుడు చంద్రగుప్తుడికి గురువు.  భారతదేశాన్ని కబళించేందుకు ఉద్యమించి , కొన్ని ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుని ఇంకా ముందుకి రావాలని చూస్తున్న అలెగ్జాండర్ దూకుడికి కళ్లెం వేసి… అప్పట్లో విదేశీ పరిపాలన నుంచి భారతదేశానికి విముక్తి కల్పించిన చిరస్మరణీయులు చాణక్య చంద్రగుప్తులు.
Also Read:  పుష్కరాల సమయంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలని ఎందుకంటారు...
అయితే కౌటిల్యుడి, చాణక్యుడు, విష్ణుగుప్తుడు. ఈ మూడు పేర్ల విషయంలో గందరగోళానికి గురయ్యేవారెందరో. ముఖ్యంగా చాణక్యుడు-కౌటిల్యుడు వేరు వేరు వ్యక్తులనే భావన చాలామందిలో ఉంది.  కౌటిల్య అనేది కుటుంబనామం…అంటే ఇంటిపేరు, తండ్రి చణకుడు కాబట్టి  చాణక్యుడిగా ప్రాచుర్యం పొందాడు.  తల్లిదండ్రులు పెట్టిన పేరుమాత్రం విష్ణుగుప్తుడు. అర్థశాస్త్ర గ్రంధ రచయితగా కౌటిల్యుడు ప్రసిద్ధుడు, చాణక్యుడిగా సుపరిచితుడు,అర్థశాస్త్రంలో విష్ణుగుప్తుడు ఈ గ్రంధ రచయిత అని అక్కడక్కడా పేర్కొన్నారు. చాణక్యుడి తర్వాతి కాలంలో యజ్ఞవల్క మహర్షి మొదలు..ఆచార్య వాత్స్యాయనుడు, అశ్వఘోషుడు ఇలా ఎందరో మేధావులు తమ గ్రంధాల్లో ఓ సందర్భంలో చాణక్యుడని…మరో సందర్భంలో కౌటిల్యుడని ఉదహరించడంతో… కౌటిల్యుడు-చాణక్యుడు అనేవారు ఒక్కరా-వేర్వేరా? అనే తర్కం మొదలైంది.  కాలగమనంలో ఈ వివాదం ముగిసిపోయి కౌటిల్యుడు, చాణక్యుడు, విష్ణగుప్తుడు ఈ మూడు పేర్లు ఒక్కరివే అనే భావం స్థిరపడిపోయింది.
Also Read: అద్దం పగిలితే అరిష్టమా.. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఎందుకు ఉంచకూడదు.. ఏం జరుగుతుంది..
 కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం…ప్రపంచ భాషల్లో మొదటిసారిగా ప్రామాణికమైన రీతిలో భారతదేశం నుంచి వెలవడిన శాస్త్రంగా మేధావులు అంగీకరించారు.  వాస్తవానికి అర్థశాస్త్రం కౌటిల్యుడు రాయడానికి ముందుకూడా భారతదేశం నుంచి అర్థశాస్త్రానికి సంబంధించిన గ్రంధాలు వెలువడ్డాయి. మొత్తం 14 అర్థశాస్త్రాల్లో కౌటిల్యుడి గ్రంధానికి ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి మరే గ్రంధానికి లేదు. ఇందులో ఆర్థిక సంబంధమైన విషయాలు మాత్రమే కాదు…పరిపాలనా సంబంధమైన విషయాలకు కూడా విశేషమైన ప్రాధాన్యత ఇచ్చారు. కౌటిల్యుడి అర్థశాస్త్రం సైన్స్ అండ్ ఎకనమిక్స్ మాత్రమే కాదు… సైన్స్ అండ్ పాలిటిక్స్ ను గురించి చెప్పే గ్రంధం కూడా. చెడ్డమార్గం అనుసరించి అయినా లక్ష్యం చేరుకో అని చెప్పలేదు..ఎందుకంటే కౌటిల్యుడికి నైతికత చాలాముఖ్యం.
Also Read: ఆదిశంకరాచార్యులను అమ్మవారు ఎందుకు కబళించాలని అనుకున్నారు? పాచికలాటలో గెలిచిందెవరు?
Also Read: ఈ దిక్కున తలపెట్టి నిద్రిస్తే ఐశ్వర్యం, ఆ దిక్కున తలపెడితే అకాల మృత్యువు- వాస్తు ఏం చెబుతోంది-సైన్స్ ఏమంటోంది..
Also Read: భక్తి తొమ్మిది రకాలు.. ఇందులో మీరు అనుసరిస్తున్న విధానం ఏంటి..
Also Read: రాళ్లు మాట్లాడతాయా… విగ్రహాలకు పూజలెందుకు అనేవారి ఇదే సమాధానమా..!
Also Read: కార్తీక దీపాలు నదులు, చెరువుల్లోనే ఎందుకు వదులుతారు...
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌

Published at : 27 Nov 2021 06:12 PM (IST) Tags: Chanakya Kautilya Vishnu Gupta Arthasastra Neetishashtra Chanakya Niti

సంబంధిత కథనాలు

Sri Rama Navami 2023: ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం అని ఎందుకంటారు!

Sri Rama Navami 2023: ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం అని ఎందుకంటారు!

Sri Rama Navami 2023: శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి, నిత్యం చదువుకుంటే ఇంకా మంచిది

Sri Rama Navami 2023: శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి, నిత్యం చదువుకుంటే ఇంకా మంచిది

Astrology News: మీ రాశి ప్రకారం వివాహానికి, శుభకార్యాలకు మీకు కలిసొచ్చే తేదీలు, రంగులు

Astrology News: మీ రాశి ప్రకారం వివాహానికి, శుభకార్యాలకు మీకు కలిసొచ్చే తేదీలు, రంగులు

మార్చి 28 రాశిఫలాలు - ఈ రోజు ఈ రాశులవారి ఆదాయం, ఆనందం పెరుగుతుంది

మార్చి 28 రాశిఫలాలు - ఈ రోజు ఈ రాశులవారి ఆదాయం, ఆనందం పెరుగుతుంది

పెళ్లికాని యువతులు సింధూరం పెట్టుకుంటే ఆ కోరికలు పెరుగుతాయా? వివాహితులే ఎందుకు పెట్టుకోవాలి?

పెళ్లికాని యువతులు సింధూరం పెట్టుకుంటే ఆ కోరికలు పెరుగుతాయా? వివాహితులే ఎందుకు పెట్టుకోవాలి?

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!