అన్వేషించండి

MLAs Disqualification : కోర్టుల ద్వారా ఎమ్మెల్యేలపై అనర్హత సాధ్యమేనా ? కేటీఆర్ హెచ్చరికల్ని ఫిరాయింపు ఎమ్మెల్యేలు పట్టించుకుంటారా ?

KTR : సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా అనర్హతా వేటు వేయిస్తామని కేటీఆర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హెచ్చరికలు చేస్తున్నారు. అది సాధ్యమేనా లేకపోతే కేటీఆర్ బెదిరింపుల కోసమే అలా అంటున్నారా ?

Telangana Politics :    భారత రాష్ట్ర సమితి నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా అనర్హతా వేటు వేయిస్తామని కేటీఆర్ అదే పనిగా చెబుతున్నారు.  మూడు రోజులుగా ఢిల్లీలోనే క్యాంపు వేసిన కేటీఆర్  ఫిరాయింపులపై హైకోర్టు తొందరగా నిర్ణయం తీసుకోకపోతే తాము సుప్రింకోర్టులో కేసు వేస్తామన్నారు.  తొందరలోనే పది నియోజకవర్గాల్లోను ఉపఎన్నికలు జరుగుతాయని కేటీఆర్ బాగా నమ్మకంతో చెప్పారు. ఫిరాయింపులపై మణిపూర్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను పదేపదే కేటీఆర్ ప్రస్తావిస్తున్నారు. ఫిరాయింపులపై అనర్హత వేటు పడటం ఖాయమని న్యాయనిపుణులు కూడా చెప్పారని కేటీఆర్  అంటున్నారు. 

సాంకేతికంగా పార్టీ మారిన పది మందీపై అనర్హతకు అర్హత 

పార్టీ మారకుండా .. ఆ ఆలోచనల్లో ఉన్న వారిని ఆపేందుకు ఈ బెదిరింపు మార్గాన్ని కేటీఆర్ ఎంచుకున్నారని భావిస్తున్నారు.  కేటీఆర్ కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు. స్పీకర్ ను కలుస్తున్నారు. గవర్నర్ కూ ఫిర్యాదు చేస్తున్నారు. మాములుగా అయితే  ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం  ప్రజాప్రతినిధిగా ఎన్నికల పార్టీకి రాజీనామా చేసినా  ఇతర పార్టీ సభ్యత‌్వం తీసుకున్నా  అనర్హులవుతారు.  ఈ  చట్టం ప్రకారం ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు అనర్హతా వేటుకు గురయ్యే అర్హత సాధించినట్లే. కానీ అదే చట్టంలో అనర్హతా వేటు ఎవరు వేయాలో నిర్దేశించారు. ఎవరు అంటే స్పీకర్.  స్పీకర్ నిర్ణయమే ఫైనల్.   పార్టీ ఫిరాయింపుల విషయంలో గతంలో బీఆర్ఎస్ స్పీకర్లూ ఏం చేశారో ఇప్పటి స్పీకర్ అదే సంప్రదాయాన్ని పాటిస్తారు. అంటే నిర్ణయం తీసుకోరు. తప్పనిసరి అయితే.. పదవి కాలం ముంగిసే ముందు నిర్ణయం తీసుకుంటారు. 

జగన్‌పై అసంతృప్తి - ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి దారెటు ?

కోర్టులు ఫిరాయింపులపై అనర్హతా వేటు వేసిన సందర్బాలు లేవు !

తప్పుడు అఫిడవిట్ సమర్పించారని.. మరో విధమైన ఉల్లంఘనకు పాల్పడ్డారని ఎవరైనా ఎమ్మెల్యేపై కోర్టులు అనర్హతా వేటు వేసిన తీర్పులు ఉన్నాయి కానీ ఇలా పార్టీ ఫిరాయింపుల కింద అనర్హతా వేటు వేసిన తీర్పులు గతంలో లేవు.  సుప్రీంకోర్టు అయినా  ఫలానా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ ను ఆదేశించలేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇతర పార్టీల్లో నుండి బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన 47 మందిలో ఏ ఒక్కరిపైన కూడా అనర్హత వేటు పడలేదు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ కూడా స్పీకర్, మండలి ఛైర్మన్లకు పిర్యాదులు చేసినా ఉపయోగం కనబడలేదు.   కోర్టుల్లో కేసులు కూడా వేశాయి. పిటీషన్లు కోర్టులో అడ్మిట్ అయ్యాయి కానీ తీర్పులు రాలేదు.  తెలంగాణలో మాత్రమే కాదు ఏపీ, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కూడా పెద్దఎత్తున ఫిరాయింపులు జరిగాయి. అయితే ఎవరి మీదా అనర్హత వేటుపడింది లేదు. నిజానికి కోర్టులే ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవు. మహా అయితే ఫిరాయింపులకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై తొందరగా నిర్ణయం తీసుకోమని స్పీకర్, ఛైర్మన్లకు సూచనలు ఇస్తాయి కానీ.. ఫలానా చర్య తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయవు. 

మరి కొంత మంది పార్టీ మారకుండా జాగ్రత్తలా ?
 
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు   వ్యతిరేకంగా కోర్టు తీర్పిచ్చినా దాన్ని స్పీకర్ అమలు చేయాలనిరూలేం లేదు. కోర్టు తీర్పుపై అప్పీలు చేసుకునే అవకాశం ఫిరాయింపు ఎంఎల్ఏలకు ఎలాగూ ఉంటుంది.  ఎలా చూసినా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారమే ఫైనల్. ఆయన తన పార్టీ నిర్ణయం.. గత సంప్రదాయాల ప్రకారమే వ్యవహరించే అవకాశం ఉంది. అంటే అనుకుంటే తప్ప... ఎవరిపైనా అనర్హతా వేటు పడే అవకాశం లేదనేది ఎక్కువ మంది అభిప్రాయం. అయినా కేసీఆర్ తన అస్త్రాల్ని మాత్రం వదలడం లేదు.  పార్టీలో నుండి మరింతమంది ఎంఎల్ఏలు జారిపోకుండా కేటీఆర్  ప్రకటనలు చేస్తున్నారని ఎక్కున మంది నమ్ముతున్నారు. 

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ - మరి బీజేపీ జాడ ఎక్కడ ?

ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పు వస్తేనే ?

ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తెచ్చారు కానీ టైమ్ ఫ్రేమ్ లేకుండా స్పీకర్‌దే నిర్ణయమని చెప్పడం ద్వారా.. మొత్తం చట్టం ఉద్దేశం నిర్వీర్యమైపోయింది. అంతే కాదు అధికార పార్టీలకు అస్త్రంగా మారింది. అధికార పార్టీ నంచి ఎవరైనా విపక్షంలో  చేరితే క్షణం ఆగకుండా అనర్హతా వేట వేటు వేయవచ్చు కానీ.. విపక్షం నుంచి అధికార పార్టీలోకి మారితే మాత్రం.. సేఫ్ గా ఉంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలన్నీ ఈ చటంలోని లూప్ హోల్‌ని గరిష్టంగా వాడుకుంటున్నాయి.. ప్రతిపక్షంలోకి వెళ్లిన తర్వాత తామే బాధితులమవుతూంటే గగ్గోలు పెడుతున్నాయి. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
Best Gun Combinations in BGMI: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
Best Gun Combinations in BGMI: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Thaman: నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
Andhra Pradesh News: 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
AP Assembly: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
Embed widget