అన్వేషించండి

SBI PO Prelims Result 2024: ఎస్‌బీఐ పీవో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

SBI: ఎస్‍బీఐ పీవో ప్రిలిమ్స్-2024 ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.

SBI PO Prelims Result: ఎస్‍బీఐ పీవో ప్రిలిమ్స్-2024 (Prelims) పరీక్ష ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) ఏప్రిల్‌ 5న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్/రోల్ నెంబర్, పుట్టినతేది వివరాలు నమోదుచేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మే మొదటివారంలో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. పీవో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చి 8, 16, 24 తేదీల్లో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ఫలితాలను తాజాగా ఎస్‌బీఐ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 600 ప్రొబేషనరీ ఆఫీసర్ల పోస్టులను ఎస్‌బీఐ భర్తీ చేయనుంది. అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. 

ఎస్‌బీఐ పీవో ప్రిలిమ్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 600 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబరు 27న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. వీటిలో ఎస్సీ- 87, ఎస్టీ- 57, ఓబీసీ-158, ఈడబ్ల్యూఎస్‌- 58, యూఆర్‌- 240 పోస్టులు కేటాయించారు. అభ్యర్థుల నుంచి డిసెంబరు 27 నుంచి జనవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తాజాగా ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఎస్‌బీఐ విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.48,480 - రూ.85,920 మధ్య జీతభత్యాలు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. 

ప్రిలిమినరీ పరీక్ష విధానం..
మొత్తం 100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. మూడు విభాగాల నుంచి మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతిప్రశ్నకు ఒకమార్కు. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు-30 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-35 ప్రశ్నలు-35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పుడు సమాధానానికి ¼ వంతు మార్కులు కోత విధిస్తారు.

SBI PO Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 27.12.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరితేది: 16.01.2025.

➥ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2025, ఫిబ్రవరి 3 లేదా 4 వారం నుంచి.

➥ స్టేజ్‌ 1- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష: 08.03.2025, 15.03.2025

➥ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన: ఏప్రిల్‌ 2025లో

➥ మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2025, ఏప్రిల్‌ 2వ వారం నుంచి.

➥ స్టేజ్‌ 2- ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్‌: ఏప్రిల్/మే 2025.

➥ మెయిన్ ఎగ్జామ్ పరీక్ష ఫలితాల విడుదల: మే/జూన్ 2025.

➥ ఫేజ్-3 కాల్ లెటర్ డౌన్‌లోడ్: మే/జూన్ 2025.

➥ ఫేజ్ 3- సైకోమెట్రిక్ పరీక్ష: మే/జూన్ 2025.

➥ ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌ తేదీలు: మే/జూన్ 2025.

➥ తుది ఫలితాల వెల్లడి: మే/జూన్ 2025.

➥ ప్రీఎగ్జామినేషన్ ట్రైనింగ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: జనవరి/ఫిబ్రవరి 2025. 

➥  ప్రీఎగ్జామినేషన్ ట్రైనింగ్ నిర్వహణ: 2025, ఫిబ్రవరి 2025.

Notification

Website

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్! త్వరలో భారీగా పెరగనున్న జీతాలు.. అంచనాలివే
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్! త్వరలో భారీగా పెరగనున్న జీతాలు.. అంచనాలివే
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Andhra Pradesh Job Calendar 2026: ఆంధ్రప్రదేశ్‌లో పదివేల పోస్టులతో జాబ్‌ క్యాలెండర్ విడుదల - ఏటా ఉగాదికి ఉద్యోగాల జాతర!
ఆంధ్రప్రదేశ్‌లో పదివేల పోస్టులతో జాబ్‌ క్యాలెండర్ విడుదల - ఏటా ఉగాదికి ఉద్యోగాల జాతర!
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP PNG Subsidy: ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
US Iran War: ఇరాన్‌పై దాడులకు అమెరికా మరో 10 రోజులు బ్రేక్.. డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ ఏంటీ?
ఇరాన్‌పై దాడులకు అమెరికా మరో 10 రోజులు బ్రేక్.. డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ ఏంటీ?
Amaravati Politics: అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
Hyderabad Traffic Diversions: నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!
నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!
Kaattan Series OTT : కొండపై తెగి పడిన తల ఎవరిది? - ఓటీటీలో విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ చూసెయ్యండి
కొండపై తెగి పడిన తల ఎవరిది? - ఓటీటీలో విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ చూసెయ్యండి
Maharashtra Minister Video: ట్రాన్స్‌‌జెండర్‌తో మహరాష్ట్ర మంత్రి వీడియో వైరల్.. రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్! మార్ఫింగ్ అని వివరణ
ట్రాన్స్‌‌జెండర్‌తో మహరాష్ట్ర మంత్రి వీడియో వైరల్.. రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్! మార్ఫింగ్ అని వివరణ
Watermelon Storage Tips : పుచ్చకాయను కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చా? అలా తింటే మంచిదేనా?
పుచ్చకాయను కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చా? అలా తింటే మంచిదేనా?
Tadipatri Crime News: బీర్ బాటిల్‌తో పోలీసులపై నిందితుడు దాడి- కాల్పులు జరిపి అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు
బీర్ బాటిల్‌తో పోలీసులపై నిందితుడు దాడి- కాల్పులు జరిపి అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు
Embed widget