CSK vs DC Match Highlights IPL 2025 | చెన్నైపై 25 పరుగుల తేడాతో ఢిల్లీ ఘన విజయం | ABP Desam
వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయింది. ఈ మ్యాచ్ అయినా గెలిచి చెన్నై సొంతగడ్డపై మళ్లీ జెండా ఎగురేస్తుంది అనకుంంటే ఈసారి కూడా అది జరగలేదు. చెన్నె చెపాక్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమిని చవి చూసింది CSK. మ్యాచ్ అంతా కంప్లీట్ గా ఢిల్లీ డామినేషనే కనిపించిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. క్లాసీ కేఎల్ రాహుల్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ మొదటి ఓవర్లోనే జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్ వికెట్ కోల్పోయినా భయపడలేదంటే రీజన్ ఓపెనింగ్ కి ఇచ్చిన కేఎల్ రాహుల్. 51 బాల్స్ లో 6 ఫోర్లు 3 సిక్సులతో 77 పరుగులు చేసి అవుటయ్యాడు రాహుల్. బ్యూటిఫుల్ షాట్స్ ఆడాడు అసలు. పోరెల్, అక్షర్, రజ్వీలను బ్యాలెన్స్ చేసుకుంటూ ఢిల్లీ స్కోరును నిలబెట్టాడు కేఎల్ రాహుల్.
2. తలో చేయేసి నిలబెట్టారు
రాహుల్ మినహాయించి ఢిల్లీ బ్యాటర్లంతా గొప్ప రన్స్ చేయకపోయినా ఫర్వాలేదనిపించారు. అంతా తలో చేయి వేసి టీమ్ స్కోరును కదిలించారు. పోరల్ 33, కెప్టెన్ అక్షర్ పటేల్ 21, సమీర్ రిజ్వి 20, ఆఖర్లో స్టబ్స్ 24 పరుగులతో మంచి క్యామియోస్ ఆడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ 183 పరుగులు చేసి 184 టార్గెట్ ఇచ్చింది చెన్నైకు.
3. విఫలమైన చెన్నై టాప్ ఆర్డర్
184 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై టాప్ ఆర్డర్ ఘోరంగా కుప్పకూలింది. రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతు రాజ్ గైక్వాడ్ , ఆఖరకు శివమ్ దూబే, జడేజా ఎవ్వరూ నిలదొక్కుకోలేకపోయారు. ఫలితంగా 10 ఓవర్లలో 74 పరుగులకే 5వికెట్లు కోల్పోయింది దాదాపు మ్యాచ్ అక్కడే ఆశలు వదిలేసుకుంది చెన్నై.
4. ఆశలు రేపిన విజయ్, ధోనీ
ఈ సీజన్ లో తొలిసారిగా ఇంకా పది ఓవర్లు ఉండగానే ధోనీ బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. క్రీజులో సెట్ బ్యాటర్ విజయ్ శంకర్ ఉన్నాడు. ఇద్దరూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ అడపాదడపా బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డును కదిపారు కానీ భారీ హిట్టింగ్ కి వెళ్లలేకపోయారు. దీంతో రిక్వైడ్ రన్ రేట్ అమాంతం పెరుగుతూ వెళ్లింది. విజయ్ శంకర్ 54 బాల్స్ లో 5 ఫోర్లు, ఓ సిక్సర్ తో 69 పరుగులు చేస్తే..ధోనీ 26 బాల్స్ ఆడి ఓ ఫోర్, ఓసిక్సర్ తో 30 పరుగులు చేశాడు. ఇద్దరూ నాటౌట్ గానే ఉన్నా టీ20 స్టైల్ లోనే ధనాధన్ ఆడలేకపోయారు. ఫలితంగా చెన్నై 25పరుగులతేడాతో ఢిల్లీకి విజయాన్ని అప్పగించింది.
5. తిరుగే లేని ఢిల్లీ
ఈ సీజన్ కి ముందు ఎవ్వరి అంచనాలు లేని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ సీజన్ లో ఇప్పటివరకూ తిరుగే లేకుండా ఆడుతోంది. ఈ సీజన్ లో ఇప్పటివరకూ మూడు మ్యాచులు ఆడిన ఢిల్లీ మూడుకు మూడు గెలుచుకుని తమకు తిరుగు లేదన్నట్లుగా జోరు చూపిస్తోంది. లక్నో, సన్ రైజర్స్, చెన్నై లాంటి స్ట్రాంగ్ టీమ్స్ ను ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్ ట్రోఫీ రేసులో వేగంగా పరిగెడుతోంది.





















