అన్వేషించండి

Pamban Rail Bridge:ఫెయిత్ అండ్ ప్రోగ్రెస్‌ బ్రిడ్జ్‌; రామనవమి నాడు పీఎం ప్రారంభించే పంబన్ రైలు వంతెన ప్రత్యేకతేంటీ?

Pamban Rail Bridge:ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ పంబన్ వంతెన ప్రారంభించనన్నారు. ఈ బ్రిడ్జ్‌ ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలవబోతోంది.

Pamban Rail Bridge: భారత దేశ రైల్వే నెట్‌వర్క్‌లో ఇంకో మైలు రాయి. ఏప్రిల్ 6, 2025న దేశం రామనవమి జరుపుకుంటున్న టైంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామేశ్వరంలో పంబన్ రైలు వంతెన ప్రారంభించనున్నారు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి వర్టికల్‌ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన. చాలా ఏళ్ల నుంచి ఇదో కలల ప్రాజెక్టుగా మారిపోయింది. ఇన్నాళ్లు ఇప్పుడు అందుబాటులోకి వస్తుండటంతో ప్రజలక ఆనందానికి అవదుల్లేవు. 

ఉత్తరాన ఆయోధ్య రాముడి ఆలయం ఉంటే దక్షిణాన రాముడు కట్టించిన వంతెన ఉంది. అలాంటి శ్రీరాముడు నడయాడిన ప్రాంతం నిర్మింతమైన వంతెన ప్రారంభం మర్చిపోలేని ఘట్టం. రామేశ్వరం తమిళనాడులోని తీరప్రాంత పట్టణం. ఇది పురాణాలతో ముడిపడి ఉన్న పవిత్ర ప్రదేశం.  

కొత్త బ్రిడ్జి ఎందుకు నిర్మించారు

పంబన్ రైలు వంతెన ప్రధాన భూభాగంలోని మండపం రైల్వేస్టేషన్‌ నుంచి రామేశ్వరం ద్వీపం వరకు 2.08 కిలోమీటర్లు విస్తరించి ఉంది. బ్రిటీష్ కాలంలో 1914లో ఇక్కడ ఓ బ్రిడ్జ్‌ నిర్మించారు. వందేళ్ల పాటు సేవలు అందించిన పాతి వంతెన అది శిథిలావస్థకు చేరుకుంది. అందుకే దాన్ని 2022 డిసెంబర్‌లో క్లోజ్ చేశారు. అద్భుతమైన డిజైన్‌తో పాత వంతెన కంటే వెయి రెట్లు మన్నిక కలిగిన అత్యాధునిక టెక్నాలజీతో సరికొత్త వంతెన నిర్మాణం చేపట్టారు. 

2019లో శంకుస్థాపన చేసిన మోదీ

రామనాథ్ స్వామి ఆలయాన్ని సందర్శించే యాత్రికుల కోసం స్థానికుల కోసం వంతెనే చాలా కీలకం. రామేశ్వరాన్ని భారత్‌తో అనుసంధానించేది కూడా ఇదే వంతెన. అందుకే పాత వంతెనకు రిపేర్లు చేసినా ప్రయోజనం లేదని గ్రహించిన ప్రభుత్వం కొత్త బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది. 2019లో కొత్త వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. 

నేటి కాలంలో ఇంజినీరింగ్ అద్భుతం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగానే 2019లో పునాదిరాయి పడింది. ఇప్పుడు ఆయన చేతుల మీదుగానే ప్రారంభోత్సవం కూడా జరగుతుంది. 550 కోట్ల రూపాయల అంచనాలతో ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని రైల్‌ వికాస్ నిగమ్‌ లిమిటెడ్‌ ప్రారిభించింది. తుపానుల తాకిడి, కరోనా అలజడి ఇలా చాలా సమస్యలు ఈ వంతెనకు అడ్డుపడ్డాయి. ప్రజల ఆకాంక్ష, ఇంజినీర్ల పట్టుదల, ప్రభుత్వ సంకల్పంతో మానవ అద్భుతం ఆవిష్కృతమైంది. 

ఇందులో 99 స్పాన్లు ఉన్నాయి. 72.5 మీటర్ల నిటారుగా ఉంటే లిఫ్ట్‌ స్పాన్ మరో అద్భుతం. ఇక్కడ ఉండే లిఫ్టులను 17 మీటర్ల ఎత్తు వరకు పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది. దీన్ని చూసిన వాళ్లు ఇంజినీర్ల ప్రతిభను కొనియాడకుండా ఉండలేరు. సాధారణంగా రోడ్డులకు అడ్డగా రైల్వే ట్రాక్‌లు నిర్మించి ప్రత్యేకంగా గేట్లు పెట్టినట్టుగానే ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు. సముద్రానికి అడ్డంగా వంతెన రైల్వే ట్రాక్ వేశారు. అయితే ఈ రైల్వే ట్రాక్ కారణంగా ఓడలు వెళ్లి వచ్చేందుకు ఇబ్బంది ఉందని ప్రత్యేకంగా లిఫ్ట్‌లు పెట్టారు. 

ఓడలు వచ్చినప్పుడు రైల్వే ట్రాక్‌ ఓడ ఎత్తు వరకు పైకి లేస్తుంది. పాత బ్రిడ్జ్ ని మనుషులే లేపేవాళ్లు. దీనికి చాలా సమయం పట్టేది. అయితే ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా ఉండేలా హైడ్రాలిక్ యంత్రాలతో ఈ రైల్వే ట్రాక్‌ను పైకి లేపుతారు. ఇది దాదాపు 17 మీటర్ల ఎత్తు వరకు లేపవచ్చు. అది కూడా ఐదు నిమిషాల్లో ప్రక్రియ పూర్తి కానుంది. దీని వల్ల రైళ్ల ప్రయాణానికి కూడా అంతరాయం లేకుండా నిర్మాణాలు చేపట్టారు.  

తుప్పు పట్టకుండా ఏర్పాట్లు

సాధారణంగా సముద్ర ప్రాంతంలో కట్టడాలు త్వరగా తుప్పు పట్టేస్తాయి. అలాంటి సమస్య లేకుండా ఉండేందుకు ఈ బ్రిడ్జ్‌కు పాలీసిలోక్సేన్ పూత పూశారు. సముద్ర వాతావరణాన్ని తట్టుకునే శక్తి దీనికి ఉంటుంది.    

పురాతనాలతో సంబంధం

చార్‌ధామ్ తీర్థయాత్ర ప్రదేశాల్లో రామనాథస్వామి ఆలయం ఒకటిగా ఉంది. అలాంటి ప్రదేశానికి దారి చూపే రైలు వంతెన శ్రీరామనవమి రోజున ప్రారంభించడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతంతో శ్రీరాముడికి కూడా చాలా అవినాభావ సంబంధం ఉందని చెబుతారు. ఇక్కడ ఉన్న ధనుష్కోడి ప్రాంతంలోనే సీతను రక్షించడానికి లంక వెళ్లేందుకు రామసేతు నిర్మించాడని పురాణాలు చెబుతాయి.  

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం రామేశ్వరం చేరుకొని మధ్యాహ్నం వంతెన ప్రారంభిస్తారు. రామేశ్వరం తాంబరం రైల్ సర్వీస, కోస్ట్ గార్డ్ షిప్‌ను ప్రారంభిస్తారు. అనంతరం రామనాథస్వామి ఆలయానికి చేరుకొని అక్కడ ప్రార్థనలు చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: లైంగిక వేధింపుల కేసు.. మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఊరట
లైంగిక వేధింపుల కేసు.. మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఊరట
BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget