అన్వేషించండి

New Pamban Bridge: సముద్ర అలలపై ఇంజినీరింగ్ అద్భుతం - 'పంబన్' వంతెన అందాలు చూద్దామా!, వైరల్ దృశ్యాలు

Viral News: దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది. తమిళనాడు రామేశ్వరంలోని న్యూ పంబన్ బ్రిడ్జి దృశ్యాలు వావ్ అనిపిస్తున్నాయి.

Railway Minister Ashwini Vaishnav Shares Picture Of New Pamban Bridge: తమిళనాడు రామేశ్వరంలోని (Rameswaram) తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ న్యూ పంబన్ బ్రిడ్జి (New Pamban Bridge) దృశ్యాలు వావ్ అనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav) వీటిని షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. 105 ఏళ్ల నాటి వారధి స్థానంలో దీన్ని నిర్మించగా.. త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావిస్తూ రైల్వే మంత్రి పలు ఫోటోలు షేర్ చేశారు. ఈ వంతెన ఓ ఇంజినీరింగ్ అద్భుతమని కొనియాడారు.
New Pamban Bridge: సముద్ర అలలపై ఇంజినీరింగ్ అద్భుతం - 'పంబన్' వంతెన అందాలు చూద్దామా!, వైరల్ దృశ్యాలు
New Pamban Bridge: సముద్ర అలలపై ఇంజినీరింగ్ అద్భుతం - 'పంబన్' వంతెన అందాలు చూద్దామా!, వైరల్ దృశ్యాలు

'1914లో నిర్మించిన పాత పంబన్ రైలు వంతెన 105 ఏళ్ల పాటు రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించింది. తుప్పు పట్టిన కారణంగా ఆ వంతెన సేవలు నిలిచిపోయాయి. దానికి సమీపంలోనే కొత్త పంబన్ వంతెనను ప్రభుత్వం నిర్మించింది.' అంటూ అశ్వినీ వైష్ణవ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అధునాతన సాంకేతికతను కొత్త వంతెన నిర్మాణంలో ఉపయోగించినట్లు చెప్పారు. త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తుందని అన్నారు.

పాత వంతెన విశేషాలివే..

  • రామనాథపురం జిల్లాలో మండపం, రామేశ్వరం ద్వీపం (పంబన్ ద్వీపం) మధ్య 1914లో పంబన్ వంతెనను సముద్రంలో నిర్మించారు. అప్పట్లో దీని నిర్మాణం రూ.20 లక్షలతో పూర్తైంది. 2.06 కి.మీ పొడవైన వంతెనను 2006 - 07లో మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్‌కు మార్చారు.
  • ఈ బ్రిడ్జి మధ్య నుంచి పడవలు, షిప్స్ వెళ్లాలంటే.. 16 మంది కార్మికులు పనిచేస్తేనే వంతెన తెరుచుకుంటుంది. ఇప్పుడు అలా కాకుండా ఏకంగా ట్రాక్ ఉన్న వంతెనను పూర్తిగా పైకి లిఫ్ట్ చేసేలా అధునాతన సాంకేతికతను జోడించారు. 2019, మార్చిలో ఈ కొత్త పంబన్ బ్రిడ్జికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేశారు.
  • సముద్రంలో ఓడలు వంతెన దగ్గరకు వస్తే ఆటోమేటిక్‌గా బ్రిడ్జి పైకి లేస్తుంది. ఇలా సముద్రంపై నిర్మితమైన తొలి వర్టికల్ రైల్వే బ్రిడ్జి ఇదే. 2070 మీటర్ల పొడవైన ఈ రైల్వే బ్రిడ్జిపై రైలు పరుగులు తీస్తుంది.
    New Pamban Bridge: సముద్ర అలలపై ఇంజినీరింగ్ అద్భుతం - 'పంబన్' వంతెన అందాలు చూద్దామా!, వైరల్ దృశ్యాలు
  • వంతెన కింద నుంచి ఓడలు సాఫీగా వెళ్లిపోతాయి. సముద్రంపై జీవించే మత్స్యకారులకు ఇబ్బందులు లేకుండా... సరుకు రవాణాకు అడ్డంకి కాకుండా అటు రైలు ప్రయాణాలు సాఫీగా సాగేలా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారు.
  • ఇప్పటికే సేఫ్టీ రన్స్ అన్నీ పూర్తయ్యాయి. కేంద్ర అనుమతితో త్వరలోనే దీనిపై రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఫలితంగా దేశంలోనే సముద్రంపై నిర్మించిన తొలి వర్టికల్ రైల్వే వంతెనగా పాంబన్ వర్టికల్ రైల్వే బ్రిడ్జి చరిత్రపుటల్లోకి ఎక్కనుంది.

Also Read: Pune News In Telugu: పూణెలో దారుణం- క్రికెట్‌ గ్రౌండ్‌లో ఆడుతూ 35 ఏళ్ల క్రికెటర్ మృతి

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
Neeru Dhanda Clinches Shooting Gold: వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
Embed widget