Pak Vs Nz Flood Lights Failure: మ్యాచ్ జరుగుతుండగా పవర్ కట్.. చిమ్మ చీకట్లో స్టేడియం.. బిత్తర పోయిన ఆటగాళ్లు, ప్రేక్షకులు
మ్యాచ్ ఉత్కంఠదశలో ఉంది.ప్రేక్షకులంతా ఏం జరుగుతుందని ఎదురు చూస్తున్నారు. బౌలర్ రనప్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, బంతి విసిరే ఆఖరి క్షణంలో స్టేడియం అంతా ఒక్కసారిగా చిమ్మచీకటిగా మారిపోయింది.

NZ Clean Sweap Pak: న్యూజిలాండ్,పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ లో విచిత్రం చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఫ్లడ్ లైట్ల వైఫల్యంతో స్టేడియం అంతా చిమ్మ చీకటిగా మారిపోయింది. దీంతో మ్యాచ్ కు కాసేపు విరామం ప్రకటించారు. అనంతరం కొద్దిసేపటికి, మ్యాచ్ ను కొనసాగించారు. ఇక ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను కుదించారు. న్యూజిలాడ్ 42 ఓవర్లలో ఎనిమిది వికెట్లక 264 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనలో పాక్.. 40 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఫస్ట్ మ్యాచ్ లో 73 పరుగులతో, రెండో మ్యాచ్ లో 84 రన్స్ తో పాక్ పరాజయం పాలైంది. ఇక టీ20 సిరీస్ ను కూడా 4-1తో కివీస్ కు సమర్పించుకుంది. ఐపీఎల్ కారణంగా ప్రధాన ఆటగాళ్లు ఆడకపోయినా, పాక్ అటు టీ20, ఇటు వన్డేల్లోనూ ఓటమి పాలయ్యారు. తాజా ఓటములతో పాక్ ఎంత దుస్థితలో ఉందో అర్థం అవుతోంది. చిన్న చితకా జట్లతో ఓడిపోవడం పరిపాటిగా మారిపోయింది. ఇక కివీస్ లోని బౌన్సీ, స్వింగ్ పరిస్థితులకు పాక్ బౌలర్లు దాసోహం అయ్యారు.
🚨 Unusual blackout at Bay Oval during New Zealand vs Pakistan match!
— Yash Bhimta (@BhimtaYash) April 5, 2025
Just as Jacob Duffy was about to bowl to Tayyab Tahir, the stadium lights went out, causing a brief halt in play. 😱
Fans and commentators were left in surprise and amusement!
Luckily, the lights came back, and… pic.twitter.com/vhwipSM9NP
నెటిజన్ల ట్రోల్..
ఇక న్యూజిలాండ్ లాంటి దేశంలో ఇలా జరగడంపై నెటిజన్లు షాకయ్యారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయా..? అని ప్రశ్నిస్తున్నారు. ఇక మ్యాచ్ గురించి వర్ణిస్తూ.. ఒక్కసారిగా కరెంట్ పోవడం షాకింగ్ గా ఉందని వ్యాఖ్యానించారు. ఇన్నింగ్స్ 38వ ఓవర్లలో 218-8తో పాక్ నిలిచినప్పుడు ఈ సంఘటన జరిగింది. జాకబ్ డఫీ రనప్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, బంతి వేసే చివరి నిమిషంలో ఇలా జరిగింది. ఒక వేళ బంతి వేసి ఉన్నట్లయితే బ్యాటర్ కు చిమ్మ చీకటి వల్ల ప్రమాదం జరిగుండేది కదా అని వ్యాఖ్యానిస్తున్నారు. తయ్యబ్ తాహిర్ లక్కీ అవడం వల్లనే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని పేర్కొంటున్నారు.
వరుస ఓటములు..
ఇటీవల కాలంలో పాక్ వరుసగా విఫలం అవుతోంది. ముఖ్యంగా ఈ ఏడాదిని తీసుకుంటే సొంతగడ్డపై జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో ఓడిపోయింది. ఇక 29 ఏళ్ల తర్వాత నిర్వహించిన ఐసీసీ టోర్నీ.. చాంపియన్స్ ట్రోఫీలో కనీసం సెమీస్ కు కూడా చేరలేదు. లీగ్ దశలోనే, ఒక్క విజయం కూడా లేకుండా ఓడిపోయింది. ఇక కివీస్ పర్యటనలో ఎనిమిది మ్యాచ్ లు ఆడితే , కేవలం ఒక్క టీ20 మ్యాచ్ లోనే విజయం సాధించింది.




















