Muthayya OTT Release: రెండున్నరేళ్ల తర్వాత ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ మూవీ 'ముత్తయ్య' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Muthayya OTT Platform: దాదాపు రెండున్నరేళ్ల తర్వాత అవార్డ్ విన్నింగ్ మూవీ 'ముత్తయ్య' ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ కానుంది.

Muthayya OTT Release On ETV Win: పెద్ద కలలు కనేందుకు వయసుతో సంబంధం లేదని.. ఓ 70 ఏళ్ల వృద్ధుడు తన కలను ఎలా సాకారం చేసుకున్నాడో తెలిపే మూవీ 'ముత్తయ్య' (Muthayya). సినిమాల్లో నటించాలని కలగనే 70 ఏళ్లు వృద్ధుడి కథను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిందీ సినిమా. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఆ ఓటీటీలో స్ట్రీమింగ్
2022లో విడుదలైన 'ముత్తయ్య' మూవీ అప్పటి నుంచీ ఓటీటీలోకి రాలేదు. ఇప్పుడు తాజాగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఈటీవీ విన్' (ETV Win) తెలిపింది. 'కలలకు వయసు లేదు. నటుడు కావాలనే ఓ 70 ఏళ్ల వృద్ధుడు తన కలను ఛేదించే కథను చూడండి.' అంటూ ఓ పోస్టర్‌ను సైతం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
Dreams have no age! Witness the inspiring journey of a 70-year-old chasing his passion for acting.
— ETV Win (@etvwin) April 4, 2025
🎬 Stay tuned!@BhaskharMaurya @HylifeE @FictionaryEnt @thisisvamsik @vrindaprasad @crhemanth #DivakarMani #KarthikRodriguez
#MuthayyaOnETVWin #ETVWin pic.twitter.com/DhHisQjQsq
బలగం, బాపు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కె.సుధాకర్ రెడ్డి ఈ సినిమాలో ప్రధాన పాత్రలో. అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని దర్శకుడు భాస్కర్ మౌర్య రూపొందించగా.. హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్పి బ్యానర్లపై వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దివాకర్ మణి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్, సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు.
వరించిన అవార్డులు ఇవే!
కామెడీ డ్రామాగా తెరకెక్కిన ముత్తయ్య సినిమా లండన్‌లోని యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ ప్రీమియర్‌గా ప్రదర్శితమైంది. 28వ కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ లాంగ్వేజెస్ కేటగిరీలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, దుబాయ్‌లోని మెటా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ తొలి దర్శకుడు, ఇండిక్ చిత్రోత్సవాల్లో ఉత్తమ చిత్రం అవార్డులు దక్కించుకుంది. అలాగే.. సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మాంట్రియల్ (కెనడా), హ్యాబిటాట్ ఫిల్మ్ ఫెస్టివల్ (న్యూ ఢిల్లీ) ఇండియా, ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ అల్బెర్టా (కెనడా), థర్డ్ యాక్షన్ ఫిల్మ్ ఫెస్టివల్ (కెనడా), సినిమా కింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (బంగ్లాదేశ్), ఇస్చియా గ్లోబల్ ఫెస్టివల్ (ఇటలీ) లలో కూడా ప్రదర్శించబడింది.
ఈటీవీ విన్ ద్వారా ముత్తయ్య చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉందని దర్శకుడు భాస్కర్ మౌర్య అన్నారు. 'ఈ మూవీకి పలు అవార్డ్స్ దక్కాయి. ప్రేక్షకులు ముత్తయ్య సినిమాను ఆదరిస్తారని నమ్మకం ఉంది. కె.సుధాకర్ రెడ్డి, కొత్త నటుడు అరుణ్ రాజ్ అద్భుతంగా నటించారు.' అని తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

