అన్వేషించండి
Namratha Birthday Celebrations: నమ్రత బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో తారల సందడి - స్పెషల్ అట్రాక్షన్‌గా నారా కోడలు, అల్లు స్నేహారెడ్డి
Namrata Shirodkar : నమ్రత బర్త్‌డే పార్టీలో పలువురు సినీ తారలు సందడి చేశారు. ఈ సెలబ్రేషన్స్‌లో బాలయ్య కూతురు, నారా కోడలు బ్రహ్మణి కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలో ఆమె స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

నమ్రత శిరోద్కర్(Image Credit: namratashirodkar/Instagram)
1/10

Namratha Birthday Photos: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి, మాజీ నటి నమ్రతా శిరోద్కర్ బర్త్‌డే సెలబ్రేషన్స్ మంగళవారం గ్రాండ్ గా జరిగాయి. జనవరి 22న నమ్రత పుట్టిన రోజు.
2/10

నిన్నటితో ఆమె 53వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఆమె బర్త్‌డే సందర్భంగా సినీ సెలబ్రెటీలు, ప్రముఖులు నమ్రతకు బర్త్‌డే విషెస్ తెలిపారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా సన్నిహితులకు, సినీ ప్రముఖులు మంగళవారం సాయంత్రం గ్రాండ్ పార్టీ నిర్వహించారు.
3/10

ఈ సెలబ్రెషన్స్‌లో ఘట్టమనేని ఆడపడుచులు అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి పాల్గొని సందడి చేశారు. ఇందులో నందమూరి బాలకష్ణ కూతురు, నారా వారి కోడలు బ్రహ్మణి కూడా పాల్గొని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
4/10

బర్త్‌డే ఫొటోల్లో నమ్రత ఫుల్ ట్రెండీ లుక్‌లో ఆకట్టుకున్నారు. బ్లాక్ కలర్ మ్యాక్స్ టాప్‌లో నమ్రత మరింత యంగ్ కనిపించారు. కూతురు సితార, కొడుకు గౌతమ్ సమక్షంలో నమ్రత కేక్ కట్ చేశారు.
5/10

ఇందుకు సంబంధించిన ఫొటోలను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సెలబ్రేషన్స్‌లో తారల సందడి చూస్తుంటే నెటిజన్లకు కనుల పండగాల ఉంది. ప్రస్తుతం నమ్రత బర్త్‌డే ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
6/10

ఈ ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో నమ్రతకు ఫ్యాన్స్, నెటిజన్ల నుంచి బర్త్‌డే విషెస్ వెల్లువెత్తున్నాయి. ఇక ఈ వేడుకకు మహేష్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళితో సినిమా సందర్భంగా మహేష్ జర్మనీకి వెకేషన్‌లో ఉన్నాడు.
7/10

ఇటీవల జర్మనీ వెళ్లిన మహేష్ భార్యకు సోషల్ మీడియాలో స్పెషల్ విషెస్ తెలిపాడు. నమ్రత తన లైఫ్‌లో ఎంతటి కీ రోల్ పోషిస్తుందో చెబుతూ ఆమెపై ప్రేమ కురిపించిన తీరు ఆకట్టుకుంది.
8/10

"హ్యాపీ బర్త్‌డే ఎన్‌ఎస్‌జీ(నమ్రత శిరోద్కర్ ఘట్టమనేని).. మరోక సంవత్సరంలో అడుగుపెడుతున్న నీ జీవితంలో మరింత ప్రేమ, ఆనందం నిండాలని కోరుకుంటున్నా. అలాగే నా జీవితాన్ని ప్రతి రోజును అద్భుతం తీర్చిదిద్దుతున్నందుకు థ్యాంక్యూ. లవ్ యూ" అంటూ హార్ట్ సింబల్ జత చేశాడు మహేష్.
9/10

కాగా నమ్రత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'వంశీ' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఆమె 'అంజీ' సినమాలో మెగాస్టార్ సరసన అలరించారు. మహేష్‌తో పెళ్లి అనంతరం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె ఇంటి వ్యవహరాలతో పాటు మహేష్ బిజినెస్ వ్యవహరాలను చూసుకుంటున్నారు.
10/10

అంతేకాదు సామాజీక కార్యక్రమాలలోనూ చురుకుగా ఉంటున్నారు. భర్త మహేష్‌తో కలిసి ఎంతోమంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు. సినిమాలోనూ భర్తగా అండగ ఉంటూ, పిల్లలను చూసుకుంటూ గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Published at : 24 Jan 2024 10:33 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
ఇండియా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion