అన్వేషించండి
Brahmamudi February 21st Episode Highlights:- పక్కాగా స్కెచ్ వేసి రాజ్ ని ఇరికించేసిన అనామిక.. దోషిని పట్టుకునేందుకు రంగంలోకి కావ్య - బ్రహ్మముడి ఫిబ్రవరి 21 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Serial February 20th Episode: 100 కోట్ల సమస్య నుంచి దుగ్గిరాల కుటుంబాన్ని బయటపడేశారు అక్కా చెల్లెళ్లు కావ్య-అప్పు... ఇంకా అనామిక కుట్రలు చేస్తూనే ఉంది..ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Brahmamudi February 21st Episode (JioHotstar/ Star Maa)
1/10

సెక్యూరిటీ కాల్ చేసి ఎవరో ఫ్యాక్టరీ తగలబెట్టేస్తున్నారని తెలియగానే పరుగు పరుగున వెళతాడు రాజ్. అక్కడకు వెళ్లేసరికి వాళ్లు పారిపోతారు. సెక్యూరిటీకి జాగ్రత్తలు చెప్పేసి ఇంటికెళ్లిపోతాడు రాజ్.
2/10

ఇల్లంతా పాటలు డాన్సులు చూస్తుంటే వళ్లుమండిపోతోంది..ఎన్ని ప్లాన్స్ వేసినా బెడిసికొట్టాయ్ అంటూ రగిలిపోతుంటుంది రుద్రాణి. అనామికకు కాల్ చేసి ఫైర్ అవుతుంది. ఆవేశం వద్దు..రేపు ఉదయం వాళ్ల సంగతి ఏమవుతుందో చూడండి అని కూల్ గా చెబుతుంది
3/10

ఇప్పటివరకూ ఓ లెక్క ఇకపై మరోలెక్క..ఈసారి దుగ్గిరాలవారింట్లో కురుక్షేత్రం కాదు లంకాదహనం జరుగుతుందని భరో అవుతుంది. అదేంటో చెప్పు అని రుద్రాణి అంటే..లైవ్ లో చూద్దురుగాని లెండి అని కాల్ కట్ చేస్తుంది అనామిక
4/10

అంతా హాల్లో కూర్చుని మాట్లాడుకుంటే..రాజ్ మాత్రం ఫ్యాక్టరీ తగలబట్టేందుకు ఎవరు వచ్చారనే ఆలోచనలో ఉంటాడు. ఇంతలో కావ్య వచ్చి ఏం జరిగిందని అడిగితే..నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా అని అరుస్తాడు.
5/10

కావ్యపై ఎందుకు అరుస్తున్నావ్ అంటూ అపర్ణ అడుగుతుంది. రుద్రాణి కూడా ఏంటి రాజ్ ఉదయం నుంచి ఇలానే ఉన్నావ్ అంటుంది. అత్తా నువ్వు సంబంధం లేని విషయాల్లో అనవసరంగా దూరొద్దంటాడు
6/10

సామంత్ కనిపించడం లేదు రాజ్ పై అనుమానం ఉందని అనామిక కంప్లైంట్ ఇచ్చిందని అరెస్ట్ వారెంట్ తో వస్తుంది అప్పు. ఇల్లు సోదాచేయండని ఆర్డర్ వేస్తుంది అప్పు. ఈ ఇల్లు ఎవరిదో తెలియదా అని ధాన్యం ఫైర్ అవుతుంది.
7/10

సామంత్ తప్పిపోతే నాకేంటి సంబంధం అని రాజ్ అంటే..నంద విషయంలో సామంత్ ని కొట్టావ్, చంపేస్తానని వార్నింగ్ ఇచ్చావు అది నువ్వే చేసి ఉంటావని నాకు అనుమానం అంటుంది. పోలీసులు ఇల్లంతా సోదా చేశాక కార్లోంచి శవం బయటపడుతుంది.
8/10

దుగ్గిరాల కుటుంబం గొప్పది అంటారు...మీ వారసుడు ఓ ప్రాణం తీసేశాడంటూ అనామిక రచ్చ రచ్చ చేస్తుంది. మీడియా వాళ్లముందు గోలగోల చేస్తుంటుంది. అనామిక కావాలనే ఇదంతా చేసిందని కావ్య అంటుంది
9/10

అప్పు రాజ్‌ను అరెస్ట్ చేయబోతుంటే ఇంట్లో అంతా అడ్డుపడతారు..సుభాష్ మాత్రం అప్పు డ్యూటీ తనని చేయనీయండి అంటాడు.
10/10

బ్రహ్మముడి ఫిబ్రవరి 22 ఎపిసోడ్ లో... నేరుగా నాపై కేసు పెట్టి పోలీసులను తీసుకొచ్చింది..శవం కనిపించగానే మీడియావాళ్లు వచ్చారు..ఇదంతా ప్రీ ప్లాన్ కాకపోతే మరేంటి అంటాడు రాజ్. నిజం ఏంటో బయటకు వస్తుందని కావ్య అంటే..త్వరలోనే రాజ్ హంతుకుడు అని కోర్టు తీర్పునిస్తుంది అంటుంది అనామిక
Published at : 21 Feb 2025 08:35 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion