అన్వేషించండి
Satyabhama Serial February 21st Episode Highlights:సత్యతో సంజయ్..కళ్లారా చూసిన క్రిష్ ఏం చేయబోతున్నాడు - సత్యభామ ఫిబ్రవరి 21 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Serial February 21st Episode : సంజయ్ తన కొడుకే అని భైరవికి నిజం తెలిసిపోయింది. మరోవైపు మహదేవయ్య కుట్రలు సాగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....

Satyabhama Serial February 21st Episode Highlights
1/10

తల్లిమాటలు తలుచుకుని క్రిష్ బాధపడుతుంటే సత్య ఓదార్చుతుంది. నువ్వు బాధపడుతుంటే ఇంకా బాధపెడతారు..నువ్వు మంచిపనులు చేస్తున్నావు కదా ఎందుకు ఆలోచిస్తున్నావ్ అంటుంది. మా కొడుకువి కాదు అని మీ అమ్మ మరోసారి అంటే అవును కాదు అనేసెయ్.. ఇంకోసారి అలా అనరు అని చెబుతుంది
2/10

బాధగా అక్కడనుంచి వెళ్లిపోతున్న క్రిష్ వెంటపడుతుంది. ముద్దుపెడుతుంది..హగ్ చేసుకుంటుంది...బాధగా ఉన్న క్రిష్ మూడ్ మార్చేందుకు ప్రయత్నిస్తుంది. ఇదంతా చూసి సంజయ్ రగిలిపోతుంటాడు
3/10

ఉదయం నిద్రలేచి చూసేసరికి మైత్రి పక్కనుంటాడు హర్ష. మన ఫస్ట్ నైట్ జరిగిపోయింది అంటుంది మైత్రి. కావాలనే అలా చేశానంటూ కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చానని చెబుతుంది. ఫారెన్‌కి వెళ్తా అన్నావ్ కదా అంటే..నిన్ను వదిలి నేను ఎక్కడికీ వెళ్లనంటుంది.
4/10

నువ్వు మంచిదానివి అనుకున్నా అని హర్ష షాక్ అవుతాడు. దాన్ని వదిలేసి వచ్చెయ్ అంటే నందినినే ఎప్పటికీ నా భార్య అంటాడు. నందినికి ఈ విషయం చెబితే నీ సంగతి అంతే.. మనం పెళ్లి చేసుకుని కాపురం చేద్దాం అంటుంది. ఏం చేస్తావో చేస్కో అనేసి కోపంగా వెళ్లిపోతాడు హర్ష
5/10

సంజయ్ ..క్రిష్ ని దెబ్బతీసే ప్లాన్ లో భాగంగా తన ఫ్రెండ్‌కి కాల్ చేసి నర్సింహని చంపించింది రుద్ర అనే విషయం క్రిష్ ఫ్రెండ్ కి చెప్పమంటాడు. అలా ఫ్రెండ్ ద్వారా క్రిష్ కి నిజం చేరవేస్తాడు సంజయ్
6/10

ఎంతపని చేశావ్ అంటూ రుద్రని చితక్కొడతాడు క్రిష్. నువ్వు చేయని పని నేను చేశానంటాడు. భైరవి అడ్డుకుని క్రిష్ ని లాగిపెట్టి కొడుతుంది. మీ బాపు అయితే మెడపట్టి గెంటేసేవాడు అంటుంది. తప్పుచేసింది వాడు అని క్రిష్ అంటే...నువ్వు చేసిన తప్పు సరిదిద్దాడు అంటుంది భైరవి
7/10

ఎవడో బాపుపై చేయివేస్తే నువ్వు వెనక్కు వచ్చావ్..దెబ్బకి దెబ్బ కొట్టపోతే నా పెనిమిటి ఇజ్జత్ పోయినట్టే కదా అంటుంది భైరవి. నర్సింహంని చంపి నా పెద్దకొడుకు నా పరువు నిలబెట్టాడు..నీ ప్రతాపం ఇంట్లో వాళ్లపై చూపిస్తావా అని రివర్సవుతుంది
8/10

అత్తయ్యా అలా చీదరించుకుని మాట్లాడడం పద్ధతి కాదంటుంది సత్య. మీ పెద్ద కొడుకు చేసింది మంచే అయితే ముందే చెప్పొచ్చు కదా.. నిజం బయటపడేవరకూ ఎందుకు ఆగినట్టు...అంటే క్రిష్ ని ఇరికిద్దామనే ఆలోచనే కదా అని నిలదీస్తుంది.
9/10

ఇంట్లో అందరకీ చిన్నా గాడి మీద నమ్మకం పోయింది..తీసుకుపో వాడిని రూమ్ లోకి..గ్లాసుడు పాలు తాగించి పడుకోబట్టు అంటుంది భైరవి. తల్లి మాటలకు క్రిష్ మరింత కుప్పకూలిపోతాడు. సత్యను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు
10/10

సత్యభామ ఫిబ్రవరి 22 ఎపిసోడ్ లో..బాధలో ఉన్న క్రిష్ ని బాగా తాగించి సత్యని ఇబ్బందిపెట్టాలని ప్లాన్ చేస్తాడు సంజయ్.. సత్య తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తుండగా రూమ్ లోకి ఎంట్రీ ఇస్తాడు క్రిష్...
Published at : 21 Feb 2025 09:04 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion