అన్వేషించండి
Megha Akash: కాబోయే భర్తతో కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి మేఘా ఆకాష్ - పెళ్లికి ప్రత్యేక ఆహ్వానం!
Megha Akash Wedding: మేఘా ఆకాష్ కాబోయే భర్తతో కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి వెళ్లింది. ఈ సందర్భంగా తలైవాను తన పెళ్లికి రావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానిచ్చింది.

Image Credit: meghaakash/Instagram
1/6

Megha Akash Went Rajinikanth Home With Finance Saai Vishnu: హీరోయిన్ మేఘా ఆకాష్ త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతుంది. రెండు రోజులు ప్రియుడితో సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకుని ఫ్యాన్స్‌కి షాకిచ్చింది.
2/6

ఇక అప్పుడే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టింది. అప్పుడే పెళ్లి ఆహ్వాన పత్రికలు కూడా పంచుతుంది. తాజాగా ఈ భామ కాబోయే భర్తతో కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను పెళ్లికి ఆహ్వానించింది.
3/6

ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. "వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ ఇంటికి వెళ్లి ఆయనను పెళ్లికి ఆహ్వానించాను" అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.
4/6

ఈ సందర్భంగా తలైవాతో కాబోయే భర్తతో కలిసి ఫోటోలు దిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా గురువారం మేఘా ఆకాష్ తన ప్రియుడు సాయి విష్ణును నిశ్చితారం చేసుకుంది.
5/6

సైలెంట్‌గా జరిగిన ఈ వేడుకకు కొద్దిమంది సన్నిహితులు, ఇరుకుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. సింపుల్‌గా జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు శనివారం ఈ భామ ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది.
6/6

ఇక మేఘా ఆకాష్ పెళ్లి చేసుకోబోతుందని తెలిసి అంతా షాక్ అయ్యారు. ఆమె నిశ్చితార్థం ఫోటోలు చూసి నెటిజన్లు సర్‌ప్రైజ్ అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఎంగేజ్‌మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published at : 25 Aug 2024 01:29 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఐపీఎల్
కరీంనగర్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion