అన్వేషించండి

Donald Trump Good News: ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో కీలక పరిణామం, ముంబై దాడుల సూత్రధారిని అప్పగించాలని ట్రంప్ నిర్ణయం

Mumbai Attacks | భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముంబై దాడుల సూత్రధారి తహవూర్ రాణాను భారత్‌కు అప్పగిస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

PM Modi USA Tour Updates | వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉండగా కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన ఉగ్రదాడుల సూత్రధారిని భారత్‌కు అప్పగించేందుకు అమెరికా ప్రభుత్వం అంగీకరించింది. ముంబై ఉగ్రదాడుల కేసులో దోషిగా తేలిన టెర్రరిస్ట్ తహవూర్‌ రాణా (Tahawwur Rana)ను భారత్‌ కు అప్పగించేందుకు డొనాల్డ్‌ ట్రంప్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో, అది కూడా ట్రంప్‌తో భేటీ సందర్భంగా ఈ ప్రకటన రావడం విశేషం. ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని నరేంద్ర మోదీ అమెరికాలో అడుగుపెట్టగా ఘన స్వాగతం లభించింది. 

ముంబై ఉగ్రదాడి నిందితుడు ప్రమాదకరం

పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు అయిన తహవూర్‌ రాణా 26/11 ముంబై ఉగ్ర దాడుల్లో కీలక సూత్రధారుల్లో ఒకడు. ముంబై దాడుల్లో నిందితుడిగా ఉన్న అత్యంత ప్రమాదకర వ్యక్తిని భారత్‌కు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. భారత్ ఎప్పటి నుంచో ఈ ప్రకటన కోసం ఎదురుచూస్తోంది. ముంబై దాడుల నేరస్తుడిని తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం ఫెడరల్ కోర్టును గతంలోనే ఆశ్రయించింది. కానీ గతంలో కోర్టు భారత్ అభ్యర్థనను తోసి పుచ్చింది. తాజాగా ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు రాగానే, ట్రంప్ భారత్‌కు అనుకూల నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనిపై భారత్‌లో హర్షం వ్యక్తమవుతోంది.

ఉగ్రవాది తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించాలన్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ముంబయి దాడుల మాస్టర్ మైండ్‌ను భారత్‌కు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నందుకు అమెరికా అధ్యక్షుడికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. టెర్రరిస్ట్ తహవూర్ రాణా ప్రస్తుతం అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ జైల్లో ఉన్నాడు. అతడ్ని తమకు అప్పగించాలని ప్రయత్నించగా.. గతంలో శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూఎస్‌ కోర్టు ఆఫ్‌ అప్పీల్‌లోనూ భారత్‌కు చుక్కెదురైంది. పలు ఫెడరల్ కోర్టుల్లోనూ భారత్‌కు ప్రతికూల తీర్పులే వచ్చాయి. 

మోదీ పర్యటనలో కీలక పరిణామం

భారత్ వేసే పిటిషన్లు కొట్టివేయాలని 2024 నవంబరు 13వ అమెరికా ఫెడరల్ కోర్టులో తహవూర్ రాణా రిట్‌ పిటిషన్‌ వేశాడు. కానీ అక్కడి సుప్రీంకోర్టు అతడి అభ్యర్థనను తిరస్కరించింది. దాంతో భారత్ ఆశలు చిగురించాయి. మరోవైపు ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంపె నెగ్గడం, తాజాగా మోదీ పర్యటన సందర్భంగా భారత్ కోరిక మేరిక ఉగ్రవాది అప్పగింతకు అంగీకరించారు. 

2008 నవంబర్‌ 26న పాక్ ఉగ్రవాడులు ముంబైలో ఏకే-47 తుపాకులతో పలుచోట్ల దాడులు జరిపారు. టాటా గ్రూప్ హోటల్లోనూ కాల్పులు జరిపి ఎంతో మంది అమాయకులను ఉగ్రవాదులు బలిగొన్నారు. ఆ దారుణ ఘటనలో సెక్యూరిటీ సిబ్బంది సహా 166 మంది చనిపోయారు.  ముంబై దాడుల మాస్టర్‌మైండ్‌ అయిన డేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీకి తహవూర్ రాణా సహకరించినట్లు సమాచారం. వీరికి అంతకు 15 ఏళ్ల కిందట పరిచయం. ముంబై ఉగ్రదాడులకు బ్లూప్రింట్‌ తయారీలో రాణా ప్లాన్ చేశాడని అభియోగాలున్నాయి. ముంబై దాడులు జరిగిన కొన్ని నెలలకు చికాగో అధికారులు టెర్రరిస్ట్ తహవూర్ రాణాను అదుపులోకి తీసుకున్నారు.

Also Read: : ఇండియా-యూఎస్‌ కలిపి పని చేయాలి - చైనాను ఎదుర్కొనే ప్లాన్‌ చెప్పిన ట్రంప్‌ 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs MI Match Highlights IPL 2025 | ముంబైపై 4 వికెట్ల తేడాతో చెన్నై జయభేరి | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | రాజస్థాన్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఘన విజయం | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | ఉప్పల్ లో తన రికార్డును తనే బ్రేక్ చేసిన సన్ రైజర్స్ | ABP DesamCSK vs MI IPL 2025 Match Preview | నేడు చెన్నైతో తలపడుతున్న ముంబై | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
SRH Vs RR Result Update:  స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. ఈ సీజ‌న్లో సొంత‌గ‌డ్డ‌పై గెలిచిన‌ తొలి జ‌ట్టు.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
David Warner: శ్రీవల్లి స్టెప్ వేసిన డేవిడ్ భాయ్... 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్‌లో వార్నర్ మెరుపుల్
శ్రీవల్లి స్టెప్ వేసిన డేవిడ్ భాయ్... 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్‌లో వార్నర్ మెరుపుల్
Rohit Sharma Duck Outs: రోహిత్ శర్మ ఖాతాలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
రోహిత్ శర్మ ఖాతాలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
CM Chandrababu: అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
Embed widget