అన్వేషించండి

PM Modi US Tour: ఇండియా-యూఎస్‌ కలిపి పని చేయాలి - చైనాను ఎదుర్కొనే ప్లాన్‌ చెప్పిన ట్రంప్‌

Modi-Trump Talks: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ఖచ్చితంగా సమావేశం అవుతానని, అన్ని విషయాలు మాట్లాడతానని వెల్లడించారు.

Trump On China During PM Modi US Visit: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా విషయంలో తన వ్యూహాన్ని స్పష్టం చేశారు. చైనాతో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నాననే తప్ప గొడవలు కాదని ఖరాఖండీగా చెప్పారు. భవిష్యత్‌లో అన్ని ప్రధాన దేశాలు కలిసి పని చేస్తాయనే ఆశాభావాన్ని ట్రంప్‌ వ్యక్తం చేశారు. ప్రతీకారం కోసం ఒకరిపై ఒకరు డబ్బు ఖర్చు చేసుకునే బదులు, ఆ డబ్బును మంచి పనులు & ప్రజా ప్రయోజనాల కోసం ఖర్చు చేయాలని కూడా ట్రంప్‌ సూచించారు. భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా, మోదీ కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రంప్‌ మాట్లాడారు. చైనాతో వాణిజ్యం ‍‌(US-China trade), సుంకాల యుద్ధం (Tariff War) గురించి అడిగిన ప్రశ్నలకు అమెరికా అధ్యక్షుడు బదులు ఇచ్చారు.

చైనాను ఎదుర్కోవడంలో భారత్‌-అమెరికా సంబంధాలను మీరు ఎలా చూస్తారని ANI డొనాల్డ్ ట్రంప్‌ను అడిగింది. దీనికి సమాధానంగా మాట్లాడిన ట్రంప్‌, "చైనాతో మా సంబంధాలు చాలా బాగుంటాయని నేను భావిస్తున్నాను. కోవిడ్-19కి ముందు, నాకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ (Chinese President Xi Jinping)తో చాలా మంచి సంబంధాలు ఉండేవి. ప్రపంచంలో చైనా చాలా ముఖ్యమైన దేశం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో జిన్‌పింగ్‌ మాకు సహాయం చేయగలరని నేను భావిస్తున్నాను. చైనా, భారతదేశం, రష్యా, అమెరికా కలిసి పని చేయగలవని నేను ఆశిస్తున్నాను. ఇది చాలా ముఖ్యం కూడా" అని చెప్పారు.

'ప్రతీకారం కోసం అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం ఎందుకు?' - ట్రంప్‌
మోదీ కలిసి నిర్వహించిన ఉమ్మడి మీడియా సమావేశంలో ఇంకా చాలా విషయాలపై డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడారు. "నా మొదటి పదవీకాలంలో అణ్వాయుధ నిరాయుధీకరణ ‍‌(Nuclear Disarmament) గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ‍‌(Russian President Putin)తో మాట్లాడాను. నా ప్రయత్నానికి సానుకూల స్పందన వచ్చింది. అదేవిధంగా, నేను ఈ విషయంపై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో కూడా మాట్లాడాను, ఆయన కూడా చాలా చక్కగా స్పందించారు. మేము (అమెరికా), దేశ రక్షణ కోసం 900 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నాము. చైనా కూడా 450 బిలియన్‌ డాలర్ల వరకు వెచ్చిస్తోంది. ఇంత డబ్బును ఒకరిపై మరొకరు ఖర్చు చేస్తున్నారు. ఈ డబ్బును మంచి ప్రయత్నాల కోసం ఎందుకు వినియోగించకూడదు?. భవిష్యత్తులో ఇలాంటి మంచి జరుగుతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను" అని వెల్లడించారు.

 ఇజ్రాయెల్ & హమాస్ మధ్య యుద్ధాన్ని ముగించడానికి నేను మాట్లాడతాను - ట్రంప్‌
"నేను (ట్రంప్‌) అధికారంలో ఉన్నప్పుడు, ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం లేదు &రష్యా - ఉక్రెయిన్ మధ్య కూడా యుద్ధం లేదు. నేను తిరిగి అధికారంలోకి వచ్చేసరికి ప్రపంచం మొత్తం రగిలిపోతోంది. నేను ముందు ఈ మంటను చల్లార్చాలి. ఆ తరువాత, నేను రష్యా & చైనాలతో కూర్చుని మాట్లాడతాను. పరస్పర సంఘర్షణను ముగించడానికి అవసరమైన విషయాల గురించి ఖచ్చితంగా చర్చిస్తాను" అని డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు.

మరో ఆసక్తికర కథనం: మోదీ-ట్రంప్ భేటీలో వివిధ రంగాల్లో జరిగిన ఒప్పందాలు ఇవే - చాలా పెద్ద విషయాలు ఉన్నాయ్‌! 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Trimukha Movie Release Date: సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Tata Sierra Dealership: టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
Embed widget