అన్వేషించండి

Top Headlines Today: కాళేశ్వరంపై కాగ్ సంచలనం; సీట్ల సర్దుబాటులో బీజేపీ ఎటూ తేల్చనీయడంలేదా? - నేటి టాప్ న్యూస్

నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

కాళేశ్వరంపై కాగ్ సంచలనం - రిపోర్టులో కీలక విషయాలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్‌ రిపోర్ట్‌ను అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను కాగ్‌ తప్పుబట్టింది. పీసీఎస్‌ఎస్‌ ప్రాజెక్టు అంచనా వ్యయం 38 వేల 500 కోట్లు. అయితే.. రీ-ఇంజనీరింగ్ సమయంలో కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులు రెండింటికీ కలిపి 85 వేల 651.81 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. రీ-ఇంజనీరింగ్‌ కారణంగా ఉమ్మడి ప్రాజెక్టు వ్యయం 122 శాతం మేర పెరిగిందని కాగ్‌ తెలిపింది. లక్ష్యంగా పెట్టుకున్న ఆయకట్టు 52.22 శాతం మేర మాత్రమే పెరిగిందని వెల్లడించింది. ఇంకా చదవండి

సీట్ల సర్దుబాటు సాగతీత ఎంత కాలం - బీజేపీ ఎటూ తేల్చనీయడంలేదా ?

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం,  జనసేన పార్టీల మధ్య పొత్తులు ఖరారయ్యాయి. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు. స్వయంగా పవన్, చంద్రబాబు ఇద్దరే సర్వేలు, ఇతర నివేదికల్ని  మందు పెట్టుకుని  సీట్ల సర్దుబాటు కసరత్తు చేసుకున్నారు. ఇక మంచి రోజు చూసుకుని ప్రకటించడమే తరువాయి అనుకున్నారు కానీ.. అది మాత్రం ముందుకు సాగడం లేదు. మధ్యలో చంద్రబాబు బీజేపీతో చర్చలకు ఢిల్లీకి వెళ్లడం..వెంటనే జగన్ కూడా వెళ్లి ప్రధాని మోదీతో కలిసి వచ్చారు.  ఆ తర్వాత మరే డెలవప్‌మెంట్  లేకుండా పోయింది. పవన్ కల్యాణ్ తన గోదావరి జిల్లాల పర్యటనల్ని కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇంతకీ తెర వెనుక ఏం జరుగుతుందన్నదానిపై మాత్రం స్పష్టత లేకుండా పోయింది. ఇంకా చదవండి

ఇన్నాళ్లు గుడ్డిగుర్రాల పళ్లు తోమారా- వైసీపీ నేతలపై షర్మిల తీవ్ర విమర్శలు

ఉమ్మడి రాజధాని పేరుతో వైసిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై  వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడలో గురువారం ఉదయం మాట్లాడిన పిసిసి అధ్యక్షురాలు షర్మిల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే ఏమనాలని ప్రశ్నించారు. వైసీపీ నేతలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమినట్లా..? అని షర్మిల ప్రశ్నించారు. ఇంకా చదవండి

కాంగ్రెస్ కార్నర్ చేస్తన్న అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్

మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే కాంగ్రెస్‌ను ధీటుగా ఎదుర్కొన్నామని వచ్చే సమావేశాల నుంచి టైగర్ వస్తుందని కాంగ్రెస్ పరిస్థితి తేలిపోతుందని కేటీఆర్ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షల సందర్భంగా దాదాపుగా ప్రతీ రోజూ ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలను చూసిన వారంతా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడం ఖాయమనుకున్నారు. కానీ కేసీఆర్ రావడం లేదు. ఒక రోజు వచ్చేస్తున్నారని మీడియాకు సమాచారం ఇచ్చారు. కానీ రాలేదు. మధ్యలో  నల్లగొండ సభకు హాజరు కావడంతో అనారోగ్యం కారణాన్నీ చెప్పే పరిస్థితి లేదు. ఇంకా చదవండి

HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ బినామీలను విచారించిన ఏసీబీ

హెచ్ఎండీఏ (Hmda)మాజీ డైరెక్టర్  శివ బాలకృష్ణ (Siva Balakrishna) కేసులో ఏసీబీ అధికారులు తవ్వే కొద్ది అక్రమాలు బయటపడుతున్నాయి. వందల కోట్ల ఆస్తులు అక్రమంగా సంపాదించినట్లు ఏసీబీ (Acb)గుర్తించింది. ఎనిమిది రోజుల కస్టడీలోకి తీసుకొని విచారించడంతో...సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సత్యనారాయణ (Satyanarayana), భరత్‌ (Bharath)ఇద్దరూ శివ బాలకృష్ణకు బినామీలుగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో బినామీలను ఏసీబీ అధికారులు విచారించారు. వారి పేర్లతోనే విలువైన భూములు, స్థలాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇంకా చదవండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget