అన్వేషించండి

Ind Vs Eng Series: వన్డే జట్టు నుంచి జడేజా ఔట్- అతని ప్లేస్ కోసం పోటీపడుతున్న ఇద్దరు ప్లేయర్లు

వచ్చే నెలలో జరిగే ఐసీసీ చాంపియన్ షిప్ కి ఎంపికయ్యే భారత జట్టుపై చాలా ఆసక్తి నెలకొంది. సీనియర్ జడేజా స్థానంలోకి రావాలని యంగ్ క్రికెటర్లు ఇద్దరు పోటీపడుతున్నారు. ఇంగ్లాండ్ సిరీస్ వారికి అగ్ని పరీక్షే. 

Ravindra Jadeja News: టీమిండియా వన్డే జట్టులో పోటీ మాములుగా లేదు. సీనియర్ ప్లేయర్లు తరచూ విఫలమవుతుండటంతో వారి ప్లేస్ లో సత్తా చాటేందుకు యువ ప్లేయర్లు తహతహలాడుతున్నారు. స్టార్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)లకు ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్, ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కెరీర్లో చివరిది కావచ్చని ఊహగానాలు చెలరేగుతున్నాయి.

మరో వెటరన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(R Jadeja)కు కూడా వన్డేల్లో గడ్డుకాలం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ కు తనను ఎంపిక చేయకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. వరుణ్ చక్రవర్తి లేదా అక్షర్ పటేల్ లలో ఎవరైనా ఒకరిని జట్టులోకి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. గణాంకాలను బట్టి, ఈ ఇద్దరిలో ఎవరైనా ఒకరు జడేజా వారసునిగా వన్డేల్లో బరిలోకి దిగే చాన్స్ ఉంది. 

ప్రపంచ కప్పే ఆఖరుది..
2023లో సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్ లో చివరి సారిగా భారత్ తరపున బరిలోకి దిగాడు. ఆ తర్వాత జడ్డూను మళ్లీ జట్టులోకి తీసుకోలేదు. గతేడాది భారత్ కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడింది. అది కూడా శ్రీలంకతో.. కోహ్లీ, రోహిత్ వంటి స్టార్లు బరిలోకి దిగారు. అయితే జడ్డూకు మాత్రం మొండి చేయి చూపించారు. ఈ క్రమంలో త్వరలో ఇంగ్లాండ్ తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ లో తను ఆడబోయేది అనుమానమే అని పలువురు వాదిస్తున్నారు. జట్టుకు యువ రక్తాన్నిఅందించే క్రమంలో వరుణ్ చక్రవర్తి లేదా అక్షర్ లలో ఎవరైనా ఒకరికి ఈ సిరీస్ లో ఓటేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇంగ్లాండ్ సిరీస్ లో రాణిస్తే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపికయ్యే అవకాశముందని తెలుస్తోంది.

లిమిటెడ్ ఓవర్ల క్రికెట్లో అదరగొడుతున్న చక్రవర్తి..
మూడేళ్ల తర్వాత గతేడాది టీమిండియాలలోకి అరంగేట్రం చేసినప్పటి నుంచి చక్రవర్తి అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 7 టీ20లు ఆడి, 17 వికెట్లు తీశాడు. అందులో అతని స్ట్రైక్ రేట్ కళ్లు చెదిరే రీతిలో కేవలం9.8గా నమోదైంది. టీమిండియా వన్డే జట్టులో చోటుపై కన్నేసిన వరుణ్.. దేశవాళీల్లో అదరగొడుతూ, సెలెక్టర్ల పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. డొమెస్టిక్ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగిన వరుణ్.. ఆరు మ్యాచ్ ల్లోనే 13.89 స్ట్రైక్ రేట్ తో 18 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రాజస్థాన్  పై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.

మరోవైపు అక్షర్ కు అంతర్జాతీయ అనుభవం బోలెడు ఉంది. ఇక తను ఆల్ రౌండర్ గా అటు బ్యాట్, ఇంటు బంతితో ఎఫెక్టివ్ గా ఉంటుండటంతో తను కూడా టీమిండియాలోకి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఇప్పటికే సంధి దశలో ఉన్న యువ టీమిండియా జట్టు.. అదరగొడుతోంది. అలాగే వన్డేల్లో దుమ్ము రేపాలని అభిమానులు కోరు కుంటున్నారు. 

Also Read: Ind Vs Eng T20 Series : టీ20 సిరీస్‌కు జట్టు ప్రకటన - వెటరన్ స్టార్ ఎంట్రీ, ఇద్దరు తెలుగు ప్లేయర్లకు చోటు

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Practice: లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget