Hisaab Barabar Trailer: 'హిసాబ్ బరాబర్' ట్రైలర్ రిలీజ్- మాధవన్ 2000 కోట్ల క్రైమ్ థ్రిల్లర్ మూవీని ఏ ఓటీటీలో చూడొచ్చు ?
Hisaab Barabar Trailer : ఆర్ మాధవన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'హిసాబ్ బరాబర్'. ఈ మూవీని జనవరి ఎండింగ్ లో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

Madhavan Starrer Hisaab Barabar Trailer | విలక్షణ నటుడు మాధవన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'హిసాబ్ బరాబర్'. నీల్ నితిన్, కీర్తి కుల్హారి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. అశ్విన్ ధీర్ దర్శకత్వంలో జియో స్టూడియో, ఎస్పి సినీకార్ప్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. 2000 కోట్లకు పైగా భారీ కుంభకోణం నేపథ్యంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ 'హిసాబ్ బరాబర్' మూవీకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
'హిసాబ్ బరాబర్' ట్రైలర్ ఎలా ఉందంటే?
ఓ బ్యాంక్ చేసే చిన్న పొరపాటు కారణంగా ఓ సామాన్యుడి జీవితం ఎలా తలకిందులైంది? అతను ఎలా స్పందించాడు? న్యాయం కోసం ఏం చేశాడు? అనే అంశాల ఆధారంగా 'హిసాబ్ బరాబర్' మూవీని రూపొందించారు. అయితే ఈ సినిమాలో ఆర్థిక మోసం, అవినీతి, న్యాయపోరాటం వంటి అంశాలు ఉండడంతో ఆసక్తి నెలకొంది. ఇక ట్రైలర్ ని చూస్తే రైల్వే డిపార్ట్మెంట్లో పని చేసే చిరు ఉద్యోగి రాధే మోహన్ శర్మ పాత్రలో మాధవన్ నటిస్తున్నారు. ఆయన ఓసారి తన బ్యాంకు అకౌంట్ లో చిన్న తేడాను గుర్తించి, బ్యాంక్ అధికారులకు కంప్లైంట్ చేస్తాడు. ఆ తర్వాత దీని గురించి ఆరా తీయగా, అదొక అతిపెద్ద ఆర్థికపరమైన మోసమని తెలుసుకుంటాడు. దాని గురించి ఇంకా ఇన్వెస్టిగేట్ చేసి ఇందులో భారీ మోసం, అవినీతి కుంభకోణం ఉన్నాయని టికెట్ కలెక్టర్ శర్మ గమనిస్తాడు.
ఈ క్రమంలోనే ఆయన తన బ్యాంక్ హెడ్ మిక్కీ మెహతా అనే వ్యక్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది. రాధే మోహన్ ఒక సామాన్యుడు, అతనేమో బ్యాంక్ హెడ్. ఇలా వీరిద్దరి మధ్య జరిగే జరిగే పోరాటం ఆసక్తికరంగా ఉండబోతోంది. ఈ సమస్యను శర్మ ఎలా ఎదుర్కొన్నాడు? దాన్నుంచి ఎలా బయట పడ్డాడు? అనేది సినిమాలో చూడాల్సిందే.
System hilne wala hai, scammers darne wale hai! Ab ek aam aadmi karega #HisaabBarabar.#HisaabBarabar premieres 24th January, only on #ZEE5.#HisaabBarabarOnZEE5 pic.twitter.com/y1rR6C7NbF
— ZEE5 (@ZEE5India) January 10, 2025
ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
అశ్విన్ ధీర్ తెరకెక్కించిన ఈ గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని డైరెక్ట్ గా జీ5 ఓటీటీలో చూడొచ్చు. జనవరి 24 నుంచి తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ ప్రీమియర్ కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ను మేకర్స్ రిలీజ్ చేయగా, తాజాగా 'హిసాబ్ బరాబర్' మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసి, మరింత ఆసక్తిని పెంచేశారు మేకర్స్. ట్రైలర్ లో ఉన్న హిలేరియస్ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.
హిందీలో బిజీగా మాధవన్
ఇక మాధవన్ విషయానికి వస్తే... ఇటీవల కాలంలో ఆయన వరుసగా హిందీ సినిమాలు చేస్తూ తన సొంత భాష తమిళంలో కంటే హిందీలోనే ఎక్కువ బిజీగా ఉన్నారు. గత ఏడాది 'సైతాన్' అనే హర్రర్ మూవీతో ప్రేక్షకులను భయపెట్టిన ఆయన, ఇప్పుడు 'హిసాబ్ బరాబర్' మూవీతో పాటు మరో సినిమా చేస్తున్నారు. మాధవన్ నటిస్తున్న 'ధురంధర్' అనే మరో కొత్త మూవీ షూటింగ్ దశలో ఉంది.
Read Also : Viral Videos: డాకు మహారాజ్ కోసం పొట్టేలు బలి, మాన్షన్ హౌస్ మందుతో బాలయ్య కటౌట్‌కు అభిషేకం





















