Sankranti Healthy Snacks : సంక్రాంతి 2025 స్పెషల్ హెల్తీ స్నాక్స్.. ఈ పండక్కీ టేస్టీగా చేసుకోండిలా
Makar Sankranti 2025 Healthy Snacks : సంక్రాంతి సయమంలో వివిధ కారణాలతో పిండివంటలు తినని వారు హెల్తీ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఇవి మంచి రుచిని అందించడంతో పాటు.. హెల్త్‌కి మేలు చేస్తాయి.
Makar Sankranti 2025 Recipes : సంక్రాంతి అంటే పిండివంటలు. వాటి ఘుమఘుమలు. కానీ కొందరు వివిధ కారణాలతో పిండివంటలకు దూరంగా ఉంటారు. డైట్లంటూ, హెల్తీ ఫుడ్ అంటూ ఫాలో అయ్యేవారు పూర్తిగా ఫెస్టివ్ వైబ్‌కి దూరంగా ఉండాలనుకుంటారు. కానీ కొన్ని స్నాక్స్‌ని హెల్తీగా కూడా చేసుకుని సంక్రాంతి ఫీల్‌ని పొందొచ్చు. ఇంతకీ ఏ స్నాక్స్‌ని హెల్తీగా వండుకోవచ్చో.. చిన్న చిన్న టిప్స్‌తో టేస్టీ, హెల్తీ రెసిపీలు చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం.
పాయసం
కావాల్సిన పదార్థాలు
- సేమ్యాలు
- బాదం మిల్క్
- ఖర్జూరాలు
- బెల్లం
- డ్రై ఫ్రూట్స్
సంక్రాంతి సమయంలో పాయసం కచ్చితంగా ఉండాలి. అయితే మీరు హెల్తీగా దీనిని చేసుకోవాలనుకుంటే ఈ హెల్తీ రెసిపీని ఫాలో అవ్వొచ్చు. సాధారణంగా పాయసం కోసం సేమ్యాను నెయ్యిలో వేయిస్తారు. కానీ హెల్తీగా తినాలనుకున్నప్పుడు వీట్ సేమ్యాను తీసుకుని నార్మల్‌గా ఫ్రై చేసుకోవాలి. రెగ్యూలర్ పాలకు బదులుగా బాదం మిల్క్‌ని ఉపయోగిస్తే మంచిది. బాదం మిల్క్‌ని ఉడికించుకుని దానిలో వేయించుకున్న సేమ్యాలు వేసుకోవాలి. దానితో పాటు రెండు ఖర్జూరాలు క్రష్ చేసి వేయాలి. కొంచెం బెల్లం వేసుకుని ఉడికించుకుంటే చాలు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌తో దానిని గార్నిష్ చేసుకోవాలి. అంటే టేస్టీ, హెల్తీ పాయసం రెడీ.
నువ్వుల లడ్డూ
కావాల్సిన పదార్థాలు
- నువ్వులు
- పాలు
- కుంకుమ పువ్వు
- బెల్లం
నువ్వుల లడ్డూ కూడా క్రంచీగా, మంచి రుచిని ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి ప్రయోజనాలు అందిస్తుంది. దీనిని ఎలా చేయాలంటే నువ్వులను పాన్‌లో తీసుకుని కాస్త నూనె వేసి ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేడిపాలల్లో కుంకుమ వేసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో బెల్లం వేసి కరిగించుకోవాలి. పాకం వచ్చిన తర్వాత నువ్వులు వేసి, పాలల్లో నానబెట్టిన కుంకుమ వేసి బాగా కలపాలి. స్టౌవ్ ఆపేసి.. వాటిని బాల్స్‌గా చుట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ నువ్వుల లడ్డూలు రెడీ.
Also Read : మకర సంక్రాంతి 2025 తేది.. ఈ పండుగ చరిత్ర, ప్రాముఖ్యతలు ఇవే
పల్లీ చిక్కి
కావాల్సిన పదార్థాలు
- వేరుశనగలు
- బెల్లం
- యాలకుల పొడి
పల్లీలను ఫ్రై చేసుకోవాలి. వాటిపై తొక్కను తీసేయాలి. ఇప్పుడు పాన్‌లో బెల్లం వేసి.. తీగపాకం వచ్చేవరకు కొద్దిగా నీళ్లు వేసి ఉడికించుకోవాలి. ఈ సిరప్‌లో పల్లీలు వేసుకోవాలి. దానిలో యాలకులపొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మిశ్రమాన్ని బాగా కలిపి.. బటర్ రాసిన ప్లేట్‌పై వేసి.. ఫ్లాట్‌గా ఒత్తుకోవాలి. మీకు నచ్చినషేప్లో గాట్లు పెట్టి.. చల్లారనివ్వాలి. అంతే టేస్టీ, క్రంచీ, హెల్తీ పల్లీ చిక్కి రెడీ.
ఈ తరహా చిన్న చిన్న స్నాక్స్ మీ క్రేవింగ్స్‌ని కంట్రోల్ చేసి.. ఫెస్టివల్ వైబ్‌ని మిస్ కాకుండా హెల్ప్ చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా ఈ టేస్టీ హెల్తీ స్నాక్స్‌ని సంక్రాంతి పండుగ సమయంలో ట్రై చేసేయండి.
Also Read : సంక్రాంతి 2025 స్పెషల్ బూందీ లడ్డూ రెసిపీ.. ఇలా చేస్తే రెండు వారాలైనా ఫ్రెష్‌గా ఉంటాయి