Today Top Headlines: శ్రీవారి హుండీలో బంగారం చోరీకి యత్నం - తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana:
1. శ్రీవారి హుండీలో బంగారం చోరీకి యత్నం
వైకుంఠ ద్వార దర్శనాలకు కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో అపచారం జరగకుండా అడ్డుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి పరకామణి బంగారం చోరీకి యత్నించిన అగ్రిగోస్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఉద్యోగి అడ్డంగా బుక్కయ్యాడు. బ్యాంకు ఉద్యోగి పెంచలయ్య దాదాపు వంద గ్రాముల పరకామణి బంగారం బిస్కెట్ ఎత్తుకెళ్తున్నాడు. విజిలెన్స్ సిబ్బంది తనిఖీలు నిర్వహించగా అతడి వద్ద గోల్డ్ బిస్కెట్ దొరకడం కలకలం రేపుతోంది. ఇంకా చదవండి.
2. రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పరిణామం
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాముల్లో బియ్యం తగ్గుదల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మచిలీపట్నంలోని గోదాముల్లో రేషన్ బియ్యం తగ్గుదల కేసులో మరో నలుగురు కొత్త నిందితుల్ని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అరెస్టైన నిందితుల్ని పోలీసులు విచారిస్తున్నారు. కానీ రెండో రోజు విచారణలో పేర్ని నాని, పేర్ని జయసుధల పీఏ మానస్ తేజ ఏ మాత్రం నోరు విప్పలేదు. బియ్యం మాయం కావడంలో ఎవరి పాత్ర లేదని, మొత్తం తానే చేశానని మాత్రమే చెబుతున్నాడు. ఇంకా చదవండి.
3. పల్లెకు సంక్రాంతి సందడి వచ్చేసింది
ఈ సారి భోగికి ముందు శని, ఆదివారాలు సెలవు కలిసి రావడంతో రెండు రోజులు ముందే సందడి ఆరంభమైంది. ప్రజలు రాకపోకలు ప్రారంభం కావడంతో సంక్రాంతిపండగ ఓ కలల వేడుకగా పల్లెనిలుస్తోంది. అందులో ప్రధానంగా విద్యార్థులకు సంక్రాంతి పండగ సెలవులివ్వడం, ఉద్యోగులకు రెండు రోజులు ముందుసెలవులు కలిసి రావడంతో మరింత సందడిగా మారింది. పట్టణాల్లో వస్త్ర దుకాణాలు, మార్కెట్ కలకలలాడుతున్నాయి. ఆన్లైన్ వ్యాపారాలు జోరం దుకున్నా వస్త దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. ఇంకా చదవండి.
4. తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. గత కొన్ని నెలలుగా కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం గ్రౌండ్ వర్క్ చేసింది. అదే విధంగా అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జనవరి 26 నుంచి తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇంకా చదవండి.
5. దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్
దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత అంశంపై దగ్గుబాటి ఫ్యామిలీకి భారీ షాక్ తగిలింది. దగ్గుబాటి ఫ్యామిలీలో సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. దగ్గుబాటి ఫ్యామిలీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిని విచారించాలని నాంపల్లి 17వ కోర్టు ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దక్కన్ కిచెన్ హోటల్ విషయంపై నందకుమార్, దగ్గుబాటి ఫ్యామిలీకి మధ్య వివాదం నెలకొంంది. తాను లీజుకు తీసుకున్న హోటల్ ను దగ్గుబాటి కుటుంబానికి చెందిన వారు కూల్చివేశారంటూ నందకుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఇంకా చదవండి.





















