Makar Sankranti 2025 : సంక్రాంతి అంటే సూర్యుడు రాశి మారడమే కాదు ఇంకా చాలా విశేషాలున్నాయ్!
Makar Sankranti 2025: సూర్యుడు రాశిమారుతాడు అదే సంక్రాంతి..మకరంలోకి ప్రవేశిస్తే మకర సంక్రాంతి అంటారని అందరకీ తెలిసిన విషయమే. వాస్తవానికి సూర్యసంచారం గురించే కాదు..సంక్రాంతి వెనుక కథలెన్నో..

Stories Behind The Makar Sankranti: సంక్రాంతి వెనుక కథలెన్నో ఉన్నాయని మీకు తెలుసా. సూర్య సంచారమే కాదు.. గంగమ్మ నేలకు దిగిన రోజు కూడా ఇదే. సగరుడు అనే మహారాజుకి అరవైవేల మంది సంతానం. వీళ్లంతా ఓసారి కపిలమహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించి ఆయన తపస్సుని భగ్నం చేశారు. ఆగ్రహించిన కపిలమహర్షి వాళ్లని బూడిద చేసేశారు. ఆ బూడిద కుప్పలపై గంగమ్మ ప్రవహిస్తే మోక్షం సిద్ధిస్తుందని తెలుసుని ఆ వంశంలో పుట్టినవారంతా గంగను ప్రార్థించారు. కానీ వరూ నేలపైకి తీసుకురాలేదు కానీ..భగీరధుడికి సాధ్యమైంది. గంగానది సంక్రాంతి పండుగ రోజే నేలపైకి వచ్చిందని చెబుతారు.
Also Read: భోగి రోజు భగవంతుడిని పెళ్లి చేసుకున్న భక్తురాలు.. ఈ ప్రేమకథ చాలా ప్రత్యేకం!
సంక్రాంతి అంటే గంగిరెద్దుల సందడి కనిపిస్తుంటుంది. ఈ సంప్రదాయం ఎలా మొదలైందో తెలియాలంటే మీకు గజాసురిడి కథ తెలియాలి. ఈకథ మీరు వినాయకచవితి రోజు కథల్లో భాగంగా వింటారు. గజాసురుడికి ఇచ్చిన వరం ప్రకారం శివుడు తన ఉదరంలో ఉండిపోతాడు. భర్తకోసం వెతికిన పార్వతీదేవి విష్ణువును సహాయం చేయమని అడుగుతుంది. శివుడు గజాసురిడి ఉదరంలో ఉన్నాడని తెలుసుకుంటాడు విష్ణువు. తన పరివారంతో కలసి బయలుదేరుతాడు. గంగిరెద్దుగా నంది..గంగిరెద్దును ఆడించేవాడుగా విష్ణువు..ఇలా దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కో ఆయుధం తీసుకుని వెళ్లి ఆ రాక్షసుడి ఇంటిముందు గంగిరెద్దును ఆడించారు. మెచ్చిన గజాసురుడు ఏవరంకావాలో కోరుకోమంటే..ఉదరంలో ఉన్న శివుడిని ఇమ్మని అడిగారంతా. అలా శివయ్యను కైలాశానికి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగా గంగిరెద్దును ఆడించారు. అలా ఈ సంప్రదాయం మొదలైంది. ఇంటే గంగిరెద్దు పేరుతో ఇంటిముందుకి వచ్చేది విష్ణువే అని ఆంతర్యం...
Also Read: శనిప్రభావం తగ్గాలంటే సంక్రాంతికి ఇవి తప్పనిసరిగా చేయండి!
ఇక హరిదాసుల విషయానికొస్తే..శ్రీకృష్ణుడే భూమికి చిహ్నమైన పాత్రని తలపై పెట్టుకుని ఇంటింటికి వస్తాడని అంటారు. ఆ పాత్రను నేలపై పెట్టరు...ఆ పాత్ర తలపై ఉన్నంతసేపు మాట్లాడరు..ఎక్కడా నిలవకుండా నడుస్తూనే ఉంటారు. బిక్ష పూర్తైనతర్వాతే ఆ పాత్రను కిందకు దించుతారు.
ఇక కనుమ రోజు గోపూజ చేయడంవెనుకా ఓ కథ ప్రచారంలో ఉంది. ఓ సారి పరమేశ్వరుడు నందిని పిలిచి..భూలోకానికి వెళ్లి ఓ వార్త చెప్పి రమ్మన్నాడు. వారం మొత్తం తలకు స్నానం చేయాలి..నెలకి ఓసారి ఆహారం తీసుకోమన్నాడు. కానీ ఆ మాటను నంది రివర్స్ లో చెప్పాడు. దీంతో అంత ఆహారం అంటే ఎలా సాధ్యం...నువ్వెళ్లి పండించు అని భువికి పంపించాడు శివుడు. అలా అందరి ఆకలి తీరుస్తోన్న పశువులను పూజిస్తారు కనుమరోజు. కనుమ రోజు పశువులకు పూజ చేయడం ఏంటే స్వయంగా నందీశ్వరుడిని పూజించినట్టే...
Also Read: భోగిపళ్లకి దిష్టికి ఏంటి సంబంధం ..భోగిపళ్లు అంటే ఏమేం ఉంటాయి!
సంక్రాంత్రిని పతంగుల పండుగ అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైన ఈ సందర్భంగా దేవతలకు పగటి సమయం కదా ఇది.. వారంతా ఆకాశంలో విహరించే సమయంలో వారికి ఆహ్వానం పలుకుతూ గాలిపటాలు ఎగురేస్తారు..
ఇంకా గొబ్బెమ్మలు, భోగిపళ్లు, బొమ్మల కొలువు..ఇలా సంక్రాంతికి పాటించే ప్రతి ఆచారం వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది...






















