Bonda Recipe : బ్యాచ్‌లర్ స్టైల్ బోండాల రెసిపీ.. పల్లీ చట్నీ ఎలా చేశారో చూసేయండి
Indian Breakfast Recipes : బోండాలు అంటే ఇష్టమా? అయితే మీరు ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు. బ్యాచ్‌లర్ రూమ్‌లో ఉండి కూడా టేస్టీగా చేసుకోగలిగే రెసిపీ ఇక్కడుంది.
Tasty Bonda Recipe : అప్పుడప్పుడు అనుకోకుండా చేసిన వంటలే మంచి రుచిని ఇస్తాయి. కొన్నిసార్లు మనమేనా ఇది చేసింది అని కూడా అనిపించవచ్చు. అలా అనుకునే కొత్తగా ఏదైనా చేద్దామని ఓ రూమ్‌లోని బ్యాచ్లర్స్ బోండాలు తయారు చేశారు. దానికి తోడుగా పల్లీ చట్నీ కూడా చేసుకున్నారు. కట్ చేస్తే.. ప్రొఫెషనల్ చెఫ్ కూడా పనికిరాడు అనే రేంజ్లో వంటని చేశారు. ఎంత మంచిగా వంట చేసేవారికైనా బోండాలు చేసేప్పుడు అవి పగిలిపోవడం, పిండి కుదరకపోవడం జరుగుతాయి. కానీ వారు చేసిన బోండాలు చూస్తే.. ఓడియమ్మ ఏమి చేశారు అనకుండా ఉండలేరు. ఇంతకీ వారు బోండాలు ఎలా చేశారు.. చట్నీ ఇలా కూడా చేస్తారా అనిపించే రెసిపీ ఇక్కడుంది. చూసేయండి.
కావాల్సిన పదార్థాలు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
వామ్ము - కొంచెం
పెరుగు - మూడూ టేబుల్ స్పూన్లు
సాల్ట్ - రుచికి తగినంత
మైదా పిండి
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం
ముందుగా ఓ గిన్నె తీసుకోవాలి. దానిలో నూనె, వామ్ము, పెరుగు, సాల్ట్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు మైదా పిండి వేసుకుని.. పిండిని బోండాలు వేసేందుకు వీలుగా కలుపుకోవాలి. పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి.. కాగనివ్వాలి. నూనె వేడి అయిన తర్వాత పిండిని మరోసారి కలిపి.. బోండాలుగా వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకుంటే సరిపోతుంది.
పల్లీ చట్నీ కోసం..
పచ్చిమిర్చి, పల్లీలను పాన్‌లో ఫ్రై చేసుకోవాలి. దానిలో ఓ 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. వీటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ మిక్సీలేని బ్యాచ్లర్స్ ఏమి చేశారంటే.. పల్లీల మిశ్రమాన్ని గిన్నెలో వేసి.. దానిని బ్లెండర్తో మిక్స్ చేశారు. నీళ్లు పోస్తూ.. బ్లెండర్తో దానిని చట్నీగా మార్చుకున్నారు. ఇప్పుడు స్టౌవ్‌పై మరో గిన్నె పెట్టి దానిలో నూనె వేసి జీలకర్ర, ఎండుమిర్చిని వేయించుకుని.. దానినే తాళింపుగా చట్నీలోకి వేసేశారు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి ఇచ్చిన క్యాప్షన్ చూస్తే కచ్చితంగా నవ్వు వస్తాది. Kind disclaimer :- DONT TRY THIS AT HOME 😅 అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంతేనా కింద కామెంట్స్ చూస్తే కూడా నవ్వు ఆగదు. ingredients quantity please అంటూ ఓ వ్యక్తి అడగ్గా.. alantivi em maaku thelidhu andi anni random ga vesam, antha baa osthai ani meme anukole 😅 అంటూ రిప్లై ఇచ్చారు. మరో వ్యక్తి Bro meeru chef aa ? అని అడగ్గా.. అవును బ్రో avunu bro bachelor room lo అంటూ రిప్లై ఇచ్చారు.
View this post on Instagram
బ్లెండర్ గురించి ఏమి చెప్పారంటే..
Whats that hand blender its very interesting , can you tell me the product name అంటూ ఓ వ్యక్తి బ్లెండర్ గురించి అడగ్గా.. I don’t no bro pakka room valladhi vadukunna అంటూ రిప్లై ఇచ్చారు.
Also Read : సంక్రాంతి 2025 స్పెషల్ బూందీ లడ్డూ రెసిపీ.. ఇలా చేస్తే రెండు వారాలైనా ఫ్రెష్‌గా ఉంటాయి