అన్వేషించండి

ICC Punishment: సిరాజ్ కి షాకిచ్చిన ఐసీసీ, శిక్ష ఖరారు- ట్రావిస్ హెడ్ కు మందలింపు

Mohammed Siraj:  ఇటీవల అడిలైడ్ లో జరిగిన రెండోటెస్టులో వాదనకు దిగిన సిరాజ్, హెడ్ లను ఐసీసీ మందలించింది. అయితే ఇరువురు ఒకరకమైన తప్పిదం చేసినా, సిరాజ్ కు ఎక్కువ శిక్ష విధించడంపై భారత ఫ్యాన్స్ ఫీలయ్యారు.

Travis Head: భారత పేసర్ మహ్మద్ సిరాజ్ కి ఐసీసీ షాకిచ్చింది. రెండోటెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ తో వాదనకు దిగడంతోపాటు మ్యాచ్ లో అనుచితంగా ప్రవర్తించిందనుకుగాను జరిమానా విధించిది. సోమవారం క్రమశిక్షణ సంఘం ఎదుట జరిగిన వాదనల అనంతరం ఐసీసీ ప్రవర్తన నియామవళిలోని 2.5 ఆర్టికల్ ని సిరాజ్ అతిక్రమించాడని ఐసీసీ తేల్చింది. అందుకగాను అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది. ఈ ఆర్టికల్ ప్రకారం ఫౌల్ ల్యాంగేజీ, చేష్టలు, సంజ్నలతో దురుసుగా ప్రవర్తించి, ప్రత్యర్థిని రెచ్చగొట్టడం తప్పుగా నిర్దారిస్తుంది. మరోవైపు ఇదే టెస్టులో హెడ్ కూడా ప్రవర్తన నియామవళిని అతిక్రమించినట్లు ఐసీసీ తేల్చింది. అతను ఆర్టికల్ 2.13ని బ్రేక్ చేసినట్లు వెల్లడించింది. 

బతికిపోయిన హెడ్..
మరోవైపు రెండోటెస్టుకు సంబంధించి క్లిప్పింగ్ లో సిరాజ్ తో హెడ్ వాదనకు దిగినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. అయినా కూడా ఆర్టికల్ 2.5ని హెడ్ కు వర్తించడంలో ఐసీసీ శీతకన్ను వేసింది. దీంతో అతనికి కేవలం ఒక డీమెరింట్ పాయింట్ మాత్రమే శిక్ష విధించింది. గత రెండు సంవత్సరాల్లో ఇది మొదటి తప్పుగా భావించిన ఐసీసీ ఈ శిక్షతో సరిపెట్టింది. మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగల్లే ఎదుట ఇరువురు ప్లేయర్లు తమ తప్పును అంగీకరించడంతో ఐసీసీ శిక్షను ఖరారు చేసింది.  మరోవైపు ఇరువురు ఒకరకమైన తప్పు చేసినప్పటికీ, సిరాజ్ ఎక్కువ శిక్ష వేసి, హెడ్ ను మందలించి వదిలేయడం సరికాదని పలువురు భారత ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. 

ఇరువురి వాదన ఎలా ఉందంటే..
జరిగిన సంఘటనపై హెడ్, సిరాజ్ ఎవరికీ వారు తాము చేసిన పనులను సమర్థించుకున్నారు. నిజానికి జరిగిన వివాదంపై మ్యాచ్ అనంతరం హెడ్ విచారం వ్యక్తం చేశాడు. బాగా బౌలింగ్ చేశావని సిరాజ్ ను అభినందిస్తే దానికి బదులుగా అతను పరుషంగా స్పందించినట్లు పేర్కొన్నాడు. ఏదేమైనా ఇలా జరుగుతుందని తను అనుకోలేదని, ఇకపై ఇలాంటి ఘటనలు జరుగకుండా చూసుకుంటానని వెల్లడించాడు. అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ లో హెడ్ చెప్పిన విషయాలపై సిరాజ్ విబేధించాడు. తనను బాగా బౌలింగ్ చేసినట్లు ప్రశంసించలేదని, హెడ్ అబద్ధం చెబుతున్నాడని వెల్లడించాడు.

నిజానికి ఘటనకు సంబంధించిన క్లిప్పింగ్స్ గమనించినట్లయితే హెడ్ తనతో కావాలనే వాదనకు దిగాడని, దానికి తాను ధీటుగా స్పందించినట్లు పేర్కొన్నాడు. మంచి బంతికి సిక్సర్ కొడితే ఏ బౌలర్ కైనా నిరాశ అనిపిస్తుందని, అదే మంచి బాల్ కి వికెట్ పడితే సంబరాలు చేసుకోవడం కామన్ అని, తను చేసిన పనిని సిరాజ్ సమర్థించుకున్నాడు. మరోవైపు ఈ వివాదం రెండో టెస్టు మూడో రోజే ముగిసి పోయింది. మూడో రోజు బ్యాటింగ్ కు దిగిన సిరాజ్ వద్దకు వెళ్లి, హెడ్ ఏదో మాట్లాడాడు. దానికి సానుకూలంగా సిరాజ్ కూడా ఆన్సరిచ్చాడు. అలాగే మ్యాచ్ ముగిశాక ఇద్దరూ ఆలింగనం చేసుకోవడంతో ఇద్దరి మధ్య వివాదం ముగిసినట్లేనని అభిమానులు ఆనంద పడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన క్లిప్పింగ్స్ లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మొత్తానికి ఐసీసీ జోక్యంతో ఈ వివాదం ముగిసిపోయిందని పేర్కొంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Economic Growth: ‘ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్’, వృద్ధి రేటులో ఏపీ రికార్డు - తమిళనాడు తర్వాత స్థానం ఏపీదే
‘ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్’, వృద్ధి రేటులో ఏపీ రికార్డు - తమిళనాడు తర్వాత స్థానం ఏపీదే
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్, తొలి విడత సాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్, తొలి విడత సాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
YS Sharmila: ఏపీలో నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు, కూటమి ప్రభుత్వంపై షర్మిల మండిపాటు
YS Sharmila: ఏపీలో నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు, కూటమి ప్రభుత్వంపై షర్మిల మండిపాటు
Peddi First Shot Reactions: ప్రభాస్ బౌలింగ్‌లో చరణ్ సిక్సర్... క్యాచ్ పట్టిన బాలయ్య, పవన్, ఎన్టీఆర్... 'పెద్ది' మీమ్స్ అదుర్స్ అంతే
ప్రభాస్ బౌలింగ్‌లో చరణ్ సిక్సర్... క్యాచ్ పట్టిన బాలయ్య, పవన్, ఎన్టీఆర్... 'పెద్ది' మీమ్స్ అదుర్స్ అంతే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs GT Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ ను సొంత గడ్డపై ఓడించిన గుజరాత్ టైటాన్స్ | ABP DesamPeddi First Shot Reaction | రంగ స్థలాన్ని మించేలా Ram Charan పెద్ది గ్లింప్స్SRH vs GT Match Preview IPL 2025 | నేడు ఉప్పల్ లో గుజరాత్ తో సన్ రైజర్స్ ఢీ | ABP DesamKL Rahul Batting IPL 2025 | పదిహేనేళ్ల తర్వాత చెన్నైలో గెలిచిన ఢిల్లీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Economic Growth: ‘ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్’, వృద్ధి రేటులో ఏపీ రికార్డు - తమిళనాడు తర్వాత స్థానం ఏపీదే
‘ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్’, వృద్ధి రేటులో ఏపీ రికార్డు - తమిళనాడు తర్వాత స్థానం ఏపీదే
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్, తొలి విడత సాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్, తొలి విడత సాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
YS Sharmila: ఏపీలో నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు, కూటమి ప్రభుత్వంపై షర్మిల మండిపాటు
YS Sharmila: ఏపీలో నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు, కూటమి ప్రభుత్వంపై షర్మిల మండిపాటు
Peddi First Shot Reactions: ప్రభాస్ బౌలింగ్‌లో చరణ్ సిక్సర్... క్యాచ్ పట్టిన బాలయ్య, పవన్, ఎన్టీఆర్... 'పెద్ది' మీమ్స్ అదుర్స్ అంతే
ప్రభాస్ బౌలింగ్‌లో చరణ్ సిక్సర్... క్యాచ్ పట్టిన బాలయ్య, పవన్, ఎన్టీఆర్... 'పెద్ది' మీమ్స్ అదుర్స్ అంతే
AP Weather Updates: ఏపీ ప్రజలకు చల్లని వార్త, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం- 3 రోజులపాటు వర్షాలు
ఏపీ ప్రజలకు చల్లని వార్త, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం- 3 రోజులపాటు వర్షాలు
MS Dhoni Retirement: రిటైర్మెంట్‌పై స్పందించిన ధోనీ, ఈ ఐపీఎల్ తరువాత ఆడతాడా ? మహీ మనసులో ఏముందంటే
రిటైర్మెంట్‌పై స్పందించిన ధోనీ, ఈ ఐపీఎల్ తరువాత ఆడతాడా ? మహీ మనసులో ఏముందంటే
Vijay Deverakonda: బీచ్‌లో దేవరకొండ... రష్మిక బర్త్‌డే కోసమే కదా... క్లూ ఇచ్చాడా? దొరికేశాడా?
బీచ్‌లో దేవరకొండ... రష్మిక బర్త్‌డే కోసమే కదా... క్లూ ఇచ్చాడా? దొరికేశాడా?
CM Chandrababu: అమెరికా టారిఫ్‌లతో నష్టపోతున్నాం, అండగా నిలవాలంటూ కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
అమెరికా టారిఫ్‌లతో నష్టపోతున్నాం, అండగా నిలవాలంటూ కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
Embed widget