అన్వేషించండి

Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

BRS MLC Kavitha | రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయని, అందుకే మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు.

Revanth Reddys roots are in RSS | నిజామాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయని, అందువల్లే మైనారిటీలపై ఆయన వివక్ష చూపుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత సైతం మైనారిటీ ఎజెండాతో సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. 
సీఎం రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయని, మైనారిటీలు కాంగ్రెస్ కు ఓట్లు వేసినా వారిని పట్టి్ంచుకోవడం లేదని విమర్శించారు.  మైనారిటీల నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసిందన్నారు. 

బీఆర్ఎస్ హయాంలో మత కల్లోలాలు జరగలేదు
నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నప్పటికీ, సీఎంగా కేసీఆర్ హయాంలో తెలంగాణలో ఒక్క మతకల్లోలం కూడా జరగలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పలుచోట్ల మతకల్లోలాలు జరిగాయి. వీటిని నిరోధించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ?  గంగా జమునా తెహజీబ్ లా ఉన్న తెలంగాణలో ప్రజల మధ్య చిచ్చుపెడుతోంది కాంగ్రెస్. మైనారిటీలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే కాంగ్రెస్ విస్మరించింది. 

చెవేళ్ల డిక్లరేషన్ ఏమైంది..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించారు. మైనారిటీ డిక్లరేషన్ అమలు చేస్తామని ప్రకటించి, ఓట్లు పడ్డాక మైనార్టీలను కాంగ్రెస్ పక్కనపెట్టింది. ఏడాది పూర్తయినా మైనారిటీ డిక్లరేషన్ అమలు ఏమైంది ? మైనారిటీ డిక్లరేషన్ (Minority Declaration) ను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బడ్జెట్‌లో మైనారిటీలకు కేటాయించిన మొత్తంలో కనీసం 25 శాతం కూడా ఖర్చు చేయలేదు. 3 వేల కోట్లు కేటాయించినా కేవలం రూ.700 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అన్ని వర్గాల ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చింది. వారి పాలన ఏడాది పూర్తయినా కాంగ్రెస్ గ్యారంటీల అమలుకు ఏ గ్యారంటీ లేదు. బీఆర్ఎస్ హయాంలో కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కింద లక్షకు పైగా ఆర్థిక సాయం అందుతుండేది. కాంగ్రెస్ ను గెలిపిస్తే తులం బంగారం,  లక్ష రూపాయాలు ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేశారు. షాదీ ముబాకరక్ కింద పెళ్లి చేసుకుంటున్న ఆడబిడ్డల కుటుంబాలకు తులం బంగారం లేదు, లక్ష రూపాయలు ఇవ్వకుండా పెండింగ్ లో పెడుతున్నారు. నిజామాబాద్ లో తబ్లిఖీ జమాత్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అన్ని ఏర్పాట్లు చేయాలి. బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని’ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
Also Read: Indiramma Houses: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్- కొత్త రేషన్ కార్డులు జారీ, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై కీలక ప్రకటన

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 18 మంది మృతి
వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 18 మంది మృతి
Kumuram Bheem Asifabad Latest News: మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో SIR ప్రారంభం- ముందు తమది ఏ రాష్ట్రమో తేల్చాలని ప్రజల డిమాండ్ 
మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో SIR ప్రారంభం- ముందు తమది ఏ రాష్ట్రమో తేల్చాలని ప్రజల డిమాండ్ 
Telangana Mass Killing: కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Embed widget