UPSC Mains Result 2024: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
UPSC: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్-2024 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో అభ్యర్థుల హాల్‌టికెట్ నెంబర్లు, పేర్లతో ఫలితాలను అందుబాటులో ఉంచింది.
Union Public Service Commission Results: సివిల్ సర్వీసెస్ మెయిన్-2024 పరీక్ష ఫలితాలను (UPSC Main Results) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబరు 9న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. కేటగిరిల వారిగా ఫలితాలను విడుదల చేసి, ఎంపికైన వారి హాల్‌టికెట్ నెంబర్లను ప్రకటించింది. అదేవిధంగా అభ్యర్థుల పేర్లతో మరో జాబితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించి మెయిన్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను చూసుకోవచ్చు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారిని ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్, ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ తేదీలను యూపీఎస్సీ త్వరలోనే వెల్లడించనుంది.
మెయిన్ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్)కు షార్ట్ లిస్ట్ చేస్తారు. వీరికి ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని యూపీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తర్వాతి దశలో ఇంటర్వ్యూ(పర్సనాలిటీ టెస్ట్)కు హాజరుకావాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో డీటైల్డ్ అప్లికేషన్ ఫాం-2 అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు డిసెంబర్ 13లోగా దీన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తిచేసిన అభ్యర్థులకే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రతిభ, మెయిన్స్, ప్రిలిమ్స్ మార్కులను బట్టి ఆలిండియా సర్వీసులకి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అభ్యర్థులకు ఫలితాలపై ఏమైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు తమను సంప్రదించవచ్చునని యూపీఎస్సీ ప్రకటనలో తెలిపింది. సమాచారం కోసంగానీ, లేదా స్పష్టత కోసం అన్ని వర్కింగ్ డేస్‌లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 011 23385271, 011 23098543, 011 23381125 ల్యాండ్ లైన్ నెంబర్లలో లేదా ఫ్యాక్స్: 011-23387310, 011-23384472 లేదా ఫెసిలిటేషన్ కౌంటర్‌ను లేదా csm-upsc@nic.in ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని యూపీఎస్సీ సూచించింది.
UPSC Civil Services Main Results-2024 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..?
🔰 ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్: https://www.upsc.gov.in ఓపెన్ చెయ్యాలి.
🔰 హోమ్‌పేజ్‌లో కనిపించే 'Written Result - Civil Services (Main) Examination, 2024' ఆప్షన్‌పై క్లిక్ చెయ్యాలి.
🔰 క్లిక్ చేయగానే సివిల్స్ మెయిన్స్ - 2024 ఫలితాలకు సంబంధించిన పీడీఎఫ్ కనిపిస్తుంది.
🔰 సివిల్స్ మెయిన్స్ ఫలితాలకు సంబంధించిన పీడీఎఫ్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
🔰 మీ పేరును చెక్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ నంబర్/ రోల్ నంబర్‌తో చెక్ చేసుకోవాలి.
Civil Services (Main) Examination, 2024
Civil Services (Main) Examination, 2024 Written Result (with name)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 20 నుంచి 29 మధ్య సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 గం. నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. అంతకుముందు సివిల్ సర్వీసెస్–2024 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 16న ఉదయం పేపర్-1 (జనరల్ స్డడీస్) పరీక్షను యూపీఎస్సీ నిర్వహించింది. ఈ పేపర్–1 ప్రశ్నపత్రంలో 100 ప్రశ్నలు 200 మార్కులకు నిర్వహించారు. అలాగే మధ్యాహ్నం పేపర్–2(అప్టిట్యూడ్ టెస్ట్–సీశాట్)ను 80 ప్రశ్నలతో 200 మార్కులకు నిర్వహించారు. జులై 1న ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. జూన్ 16న ఈ రెండు పరీక్షలు దేశ వ్యాప్తంగా 80 నగరాల్లో నిర్వహించగా.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 79,043 మంది దరఖాస్తు చేసుకుంటే, వారిలో 42,560 (53.84 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా ప్రిలిమ్స్ పరీక్షకు 13.4 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఈ ఏడాదికి గాను మొత్తం 1056 పోస్టులను భర్తీచేయనున్నారు. వీటిల్లో 40 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు. మిగిలిన ఖాళీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తింజేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.