అన్వేషించండి

Mark Zuckerberg: చిక్కుల్లో మెటా సీఈవో - ఏఐ మోడల్‌కు కాపీరైట్ బుక్స్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చారని ఆరోపణలు

Mark Zuckerberg: కాపీరైటెడ్ అని తెలిసినా లిబ్‌జెన్ డేటాసెట్‌ని ఉపయోగించేందుకు మెటా సీఈవో మార్క్ జుకెన్ బర్గ్ ఆమోదించారని రచయితలు ఆరోపించారు.

Mark Zuckerberg: సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా ప్లాట్‌ఫారమ్స్ తన కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) వ్యవస్థలకు శిక్షణ ఇవ్వడానికి పైరేటెడ్ పుస్తకాలను ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటోంది. కొత్తగా బహిర్గతం అయిన కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టు పత్రాలలో, కాపీరైట్ చేసిన విషయం మెటాకు తెలిసే ఉపయోగించిందని రచయితల(Authors) బృందం ఆరోపించింది. మొదట 2023లో దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం, మెటా తన ల్యాంగ్వేజ్ మోడల్ లామాకు శిక్షణ ఇచ్చేందుకు తమ పుస్తకాలను దుర్వినియోగం చేసిందని వాదించింది.  

ఏఐ సిస్టమ్స్ ను డెవలప్ చేయడానికి తమ సమ్మతి లేకుండా రచయితలు, ఆర్టిస్ట్ లు, ఇతర క్రియేటర్స్ నుంచి కాపీరైట్ చేసిన మెటీరియల్‌లను టెక్ కంపెనీలు ఉపయోగిస్తున్నాయని ఆరోపించింది. ఇది చట్టరిత్యా నేరమని వాదించింది. కానీ మెటా, ఇతర ప్రతివాదులు ఈ క్లెయిమ్‌లను వ్యతిరేకిస్తూ, అటువంటి మెటీరియల్‌లను ఉపయోగించడం న్యాయమైన ఉపయోగం (Fair Use) సూత్రం కిందకు వస్తుందని నొక్కి చెప్పారు. 

Also Read: Gold-Silver Prices Today 12 Jan: ఈ రోజు గోల్డ్‌, సిల్వర్‌ నగల రేట్లు ఇవీ - మీ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయంటే!

ఇటీవల వెలుగులోకి వచ్చిన కోర్టు ఫైలింగ్‌లలో, మెటా ఏఐ (AI) శిక్షణ డేటాసెట్ లిబ్ జెన్ (LibGen)ని ఉపయోగించిందని రచయితలు చెప్పారు. ఇందులో మిలియన్ల కొద్దీ పైరేటెడ్ వర్క్‌లు ఉన్నాయని రాయిటర్స్ తెలిపింది. పీర్-టు-పీర్ టొరెంట్‌ల ద్వారా మెటా డేటాసెట్‌ను డిస్ట్రిబ్యూట్ చేసిందని వారు ఆరోపించారు. ఈ విషయంపై మెటా ఏఐ కార్యనిర్వాహక బృందం నుంచి హెచ్చరికలు ఉన్నప్పటికీ జుకర్ బర్గ్ లిబ్ జెన్ వినియోగానికి ఆమోదించారని కోర్టు పత్రాలు వెల్లడించాయి. ఈ ఎగ్జిక్యూటివ్‌లు లిబ్‌జెన్‌ను పైరేటెడ్ అని మాకు తెలిసిన డేటాసెట్ గా పేర్కొంటూ ఆందోళనలను వ్యక్తం చేశారు. దీన్ని సాక్ష్యంగా చేసుకుని ఫిర్యాదును దాఖలు చేయడానికి రచయితలు కోర్టును అనుమతి కోరారు. ఇది కాపీరైట్ జరిగిందనే వాదనలను మరింత బలపరుస్తుందని వారు చెబుతున్నారు.

ఏఐ సిస్టమ్స్ ను డెవలప్ చేయడానికి అనుమతి లేకుండా కాపీరైట్ చేసిన పనులను టెక్ కంపెనీలు ఉపయోగిస్తుంటాయి. అటువంటి సందర్భాలలో ప్రతివాదులు తరచుగా కాపీరైట్ చేసిన మెటీరియల్‌ని ఉపయోగించడం మంచి కోసమే ఉపయోగిస్తున్నామనే ట్యాగ్ ని జోడిస్తూ ఉంటారు. అయితే ఏఐ కంపెనీలు తమ సిస్టమ్‌లకు శిక్షణ ఇవ్వడంలో కాపీరైట్ చేసిన ఈ మెటీరియల్‌ను ఎలా ఉపయోగిస్తాయి అన్న వాదన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయంలో మార్కా జుకర్ బర్గ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబుతున్నారన్న దానిపైనే అందరి దృష్టి ఉంది.

Also Read: 90hr in a Work Week Debate: క్వాంటిటీ ఆఫ్ వర్క్ కాదు - వర్క్‌లో క్వాలిటీ ఉండాలి, అధిక పని గంటలపై ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HCU Students: కంచ గచ్చిబౌలి భూవివాదంలో హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత!
HCU Students: కంచ గచ్చిబౌలి భూవివాదంలో హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత!
YS Sharmila: పులిబిడ్డ పులిబిడ్డే - జగన్‌కో మరోసారి షర్మిల స్ట్రాంగ్ కౌంటర్
పులిబిడ్డ పులిబిడ్డే - జగన్‌కో మరోసారి షర్మిల స్ట్రాంగ్ కౌంటర్
Andhra Health:  టెన్షన్ ఆడవారికి - షుగర్ మగవాళ్లకి - ఏపీలో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సంచలన రిపోర్టు
టెన్షన్ ఆడవారికి - షుగర్ మగవాళ్లకి - ఏపీలో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సంచలన రిపోర్టు
LPG Cylinder Price: దేశవ్యాప్తంగా గ్యాస్‌ వినియోగదారులకు షాక్ - సిలిండర్‌పై రూ. 50 పెంపు 
దేశవ్యాప్తంగా గ్యాస్‌ వినియోగదారులకు షాక్ - సిలిండర్‌పై రూ. 50 పెంపు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tilakvarma removed Mumbai Indians Name | ముంబై ఇండియన్స్ పేరును తొలగించిన తిలక్ వర్మ | ABP DesamJasprit Bumrah Re Entry | బుమ్రాను గాల్లోకి ఎత్తి మరీ ప్రకటించిన పొలార్డ్ | ABP DesamMI vs RCB Match preview IPL 2025 | పదేళ్ల గడిచిపోయాయి..ఇప్పటికైనా దక్కేనా.? | ABP DesamSiraj Bowling in IPL 2025 | ఐపీఎల్ లో వంద వికెట్ల క్లబ్ లోకి దూసుకొచ్చిన హైదరాబాదీ సిరాజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HCU Students: కంచ గచ్చిబౌలి భూవివాదంలో హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత!
HCU Students: కంచ గచ్చిబౌలి భూవివాదంలో హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత!
YS Sharmila: పులిబిడ్డ పులిబిడ్డే - జగన్‌కో మరోసారి షర్మిల స్ట్రాంగ్ కౌంటర్
పులిబిడ్డ పులిబిడ్డే - జగన్‌కో మరోసారి షర్మిల స్ట్రాంగ్ కౌంటర్
Andhra Health:  టెన్షన్ ఆడవారికి - షుగర్ మగవాళ్లకి - ఏపీలో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సంచలన రిపోర్టు
టెన్షన్ ఆడవారికి - షుగర్ మగవాళ్లకి - ఏపీలో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సంచలన రిపోర్టు
LPG Cylinder Price: దేశవ్యాప్తంగా గ్యాస్‌ వినియోగదారులకు షాక్ - సిలిండర్‌పై రూ. 50 పెంపు 
దేశవ్యాప్తంగా గ్యాస్‌ వినియోగదారులకు షాక్ - సిలిండర్‌పై రూ. 50 పెంపు 
Petrol Diesel Price: ఎక్సైజ్ సుంకం భారం ప్రజలపై కాదు కంపెనీలపైనే- పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ
ఎక్సైజ్ సుంకం భారం ప్రజలపై కాదు కంపెనీలపైనే- పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ
AI Engineers: ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ హబ్‌గా తెలంగాణ, రాష్ట్రంలో 2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లు - మంత్రి శ్రీధర్ బాబు
 ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ హబ్‌గా తెలంగాణ, రాష్ట్రంలో 2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లు - మంత్రి శ్రీధర్ బాబు
Viral Video: సారీ గాయ్స్, మీకు హెల్ప్ చేయలేకపోతున్నాను.. నారా లోకేష్ ఫన్నీ రియాక్షన్ ట్రెండింగ్
సారీ గాయ్స్, మీకు హెల్ప్ చేయలేకపోతున్నాను.. నారా లోకేష్ ఫన్నీ రియాక్షన్ ట్రెండింగ్
Trump Tariffs Effect: ట్రంప్ టారిఫ్‌ బాంబ్‌ పేలేది భారతీయ కుటుంబాల్లో, ప్రతి ఫ్యామిలీకి వేలల్లో నష్టం!
ట్రంప్ టారిఫ్‌ బాంబ్‌ పేలేది భారతీయ కుటుంబాల్లో, ప్రతి ఫ్యామిలీకి వేలల్లో నష్టం!
Embed widget