Game Changer: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... ఇక నుంచి ఆ లోటు కూడా లేదు... హ్యాపీగా 'గేమ్ చేంజర్'కు వెళ్లొచ్చు!
Nana Haryana - Good News to Game Changer Fans: ‘గేమ్ చేంజర్’ ప్రొమోషన్స్ టైమ్‌లో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడేలా చేసిన సాంగ్ ఒకటి సినిమాలో లేదనే విషయం తెలిసిందే. ఆ విషయంలో గుడ్ న్యూస్....

సంక్రాంతి స్పెషల్‌గా సంక్రాంతి బరిలో మొదట థియేటర్లలోకి దిగిన ‘గేమ్ చేంజర్’ చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ కావాలని నెగిటివ్ ప్రచారం చేస్తున్నా.. ఆ ప్రభావం సినిమాపై ఏ మాత్రం పడలేదు అనడానికి కలెక్షన్లే సాక్ష్యం. అయితే సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం కాస్త నిరాశను వ్యక్తపరిచే అంశం ఏమిటంటే.. ఇందులో శ్రేయ ఘోషాల్, కార్తీక్ పాడిన ‘నానా హైరానా’ సాంగ్ లేకపోవడం. అయితే ఇప్పుడా లోటును కూడా మూవీ యూనిట్ తీర్చేసింది.
‘గేమ్ చేంజర్’ విడుదలకు ముందు సినిమాపై భారీ అంచనాలను పెంచేసిన ప్రమోషనల్ కంటెంట్‌లో ‘నానా హైరానా’ సాంగ్ ఒకటి. క్లాసికల్ సింగర్స్ శ్రేయ ఘోషాల్, కార్తీక్ ఈ పాటను పాడటంతో పాటు.. థమన్ మ్యూజిక్, శంకర్ స్టైల్ గ్రాండ్ విజువల్స్, న్యూజిలాండ్‌లో సరికొత్త ప్రదేశాలలో చిత్రీకరణ, న్యూ కెమెరా ఫార్మెట్.. అన్నీ కూడా ఈ పాటను ఇన్‌స్టెంట్ చార్ట్ బస్టర్‌లో పెట్టేశాయి. వీటితో పాటు రామ్ చరణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలెట్ అనేలా ఈ పాట హింట్ ఇచ్చేసింది. కానీ, థియేటర్స్‌లో ఈ పాట కోసం వేచి చూస్తున్నవారంతా, ఎంత వరకు ఈ పాట రాకపోవడంతో, లేకపోవడంతో డిజప్పాయింట్ అవుతున్నారు.
దీనిపై వెంటనే రియాక్ట్ అయిన మేకర్స్.. కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల ఈ పాట లేకుండానే సినిమా విడుదల చేయాల్సి వచ్చిందని, జనవరి 14న పాటను యాడ్ చేస్తామని తెలిపారు. కానీ, అంతకంటే ముందే పాటను యాడ్ చేసి ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పారు. జనవరి 12 నుండి ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘నానా హైరానా’ సాంగ్‌ని యాడ్ చేయడం జరిగిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆల్రెడీ థియేటర్లలో ప్రదర్శితమవుతున్న ఈ సినిమాలో ఈ పాట యాడ్ అయినట్లుగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా దర్శనమిస్తున్నాయి. తెలుగు, తమిళ, హిందీ మూడు భాషల్లోనూ ఈ పాటను యాడ్ చేశారు.
#GameChanger #NaanaaHyraanaa song added pic.twitter.com/nv1LCmoOMJ
— Vamsi (@VamsiChunchu_) January 11, 2025
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 186 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. రెండో రోజు కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్స్‌ని రాబట్టినట్లుగా తెలుస్తోంది. మూడో రోజు (జనవరి 12)న బాలయ్య ‘డాకు మహారాజ్’ విడుదలవుతుండటంతో.. ఆ ప్రభావం ‘గేమ్ చేంజర్’ కలెక్షన్స్‌పై పడే అవకాశం అయితే లేకపోలేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

