అన్వేషించండి
Advertisement
Morning Top News: కేటీఆర్‌కు ఉచ్చుబిగిస్తున్న కాంగ్రెస్ , పేర్ని నానికి కష్టాలు తప్పేలా లేవు వంటి టాప్ న్యూస్
Top 10 Headlines Today: పేర్ని జయసుధ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు , తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు వంటి మార్నింగ్ టాప్ న్యూస్
Morning Top News:
పొంగులేటి, కోమటిరెడ్డికి ప్రత్యేక ఎజెండా..!
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. బీఆర్ఎస్ నేతలు.. అధికార పక్షంపై ముప్పేట దాడి చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పదవి కోసం పరుగులు పెడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇరువులు చిట్ చాట్‌ల పేరుతో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అమరావతి, ఎన్టీఆర్ ఘాటలపై వీరి వ్యాఖ్యలు సంచలనం రేపాయి. వీరి ఎజెండా ఏమిటన్నదానిపై చర్చ ప్రారంభమయింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్తే ఆయన వీపులు పగలడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎక్కడకు వెళ్లినా కనీసం 500, 600 మంది సెక్యూరిటీని వెంట బెట్టుకుని వెళ్లాలని, లేకపోతే కచ్చితంగా సీఎం వీపులు పగలగొడతారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించి, ప్రజా సమస్యలతో పాటు తమపై చేసిన ఆరోపణలపై చర్చించాలని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కేటీఆర్‌కు ఉచ్చు బిగుస్తున్న కాంగ్రెస్
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్‌పై విచారణ జరిపేందుకు గవర్నర్ ఇదివరకే అనుమతి ఇచ్చారు. గవర్నర్ అనుమతి పత్రాన్ని సీఎస్ శాంతికుమారికి పంపించారు. ఆ లేఖను ఏసీబీ అధికారులకు అందజేయాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి లేఖను తెలంగాణ సిఎస్ శాంతి కుమారి ఏసీబీ అధికారులకు అందించారు. దీంతో ఏ క్షణమైనా కేటీఆర్‌ను విచారించి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
తాడేపల్లిలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్
గుంటూరు జిల్లా తాడేపల్లిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. 5 నిమిషాల వ్యవధిలోనే వేర్వేరు చోట్ల మహిళల మెడలో నుంచి గొలుసులు లాక్కెళ్లారు. వెంటనే గమనించిన స్థానికులు వారిని పట్టుకునేందుకు వెంబడించారు. అయినా ఫలితం లేకపోయింది. వరుస ఘటనలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ మంగళవారం వాడివేడిగా సాగింది. ఈ క్రమంలోనే పలు బిల్లులకు శాసన సభ ఆమోదం తెలిపింది. యూనివర్సిటీ సవరణ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. అలానే స్పోర్ట్స్ పాలసీ బిల్లును కూడా అసెంబ్లీ ఆమోదించింది. యంగ్ ఇండియా డిజిటల్ ఎడ్యుకేషన్ బిల్లు, గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ సవరణ బిల్లులకు కూడా తెలంగాణ శాసన సభ ఆమోదం తెలిపింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట.. సీపీ కీలక కామెంట్స్
హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్‌ను నగర కమిషనర్ CV ఆనంద్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. థియేటర్ లైసెన్సు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై థియేటర్ యాజమాన్యాన్ని వివరణ కోరారు. బాలుడి బ్రెయిన్ డ్యామేజ్ జరిగిందని తెలిపారు.
తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకూ నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యతో కలిసి అన్నమయ్య భవన్‌లో సమీక్ష నిర్వహించారు. అన్ని విభాగాల అధిపతులతో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
గజగజ వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. ఇంట్లో ఉన్నా సరే ముసుగు తీయాలంటే జడుసుకుంటున్నారు. దీనికి తోడు జలుబు జ్వారాలు జనాలను మరింతగా ఇబ్బంది పెడుతున్నాయి. ఉదయం పది గంటలకి కూడా కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు కనిపించడం లేదు. వృద్ధులు, చిన్న పిల్లలు, గుండె జబ్బులు ఉన్న వారి పరిస్థితి దారుణంగా ఉంది. పొలం పనులకు వెళ్లే వాళ్లు పొగమంచు, చలికి రోగాల బారిన పడుతున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
పేర్ని జయసుధ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. పేర్ని నాని కుటుంబసభ్యులపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. గోదాముల్లో రేషన్ బియ్యం తగ్గడంపై కేసు నమోదైంది. ఈ నెల 13న రూ. కోటి, 16న రూ.70 లక్షల డీడీలను పేర్ని నాని అందజేశారు. మరోవైపు నాని భార్య జయసుధ పేరుతో గోదాములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అసలు గోదాములో ఎంత బియ్యం తగ్గిందనే దానిపై లోతైన విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కులాంతర వివాహం.. గెంటేసిన తల్లిదండ్రులు
వారిరువురూ ప్రేమించుకున్నారు. పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. అయితే, వారి కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి అంగీకరించలేదు. యువతి తాళి తెంచేసి ఇంటి నుంచి బయటకు గెంటేశారు. దీంతో సదరు యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించిన ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య
క్యాన్సర్ రోగంతో అల్లాడిపోతున్న ప్రపంచానికి రష్య గుడ్ న్యూస్ చెప్పింది. దీని నివారణకు వ్యాక్సిన్ కనుగొన్నట్టు పేర్కొంది. ముందుగా ఆ దేశ ప్రజలకు ఉచితంగా ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది. ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. జనవరి 2025 నుంచి రష్యన్ పౌరులకు ఇవ్వబోతున్నట్టు తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion