అన్వేషించండి

Nara Lokesh: పవన్ కళ్యాణ్ శాఖలో జోక్యం చేసుకున్న నారా లోకేష్ - క్షమాపణ చెప్పడంతో హాట్ టాపిక్

ఆధ్యాత్మిక కేంద్రం కాశీనాయన సత్రం అంశంపై నారా లోకేష్ స్పందించారు. అయితే ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సంబంధించిన శాఖ కావడంతో హాట్ టాపిక్ అవుతోంది.

నారా లోకేష్ క్షమాపణ చెప్పారు. నల్లమల లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం కాశీనాయన సత్రాన్ని అటవీ అధికారులు కూల్చేశారు. నిరంతర అన్నదానం జరిగే కట్టడాలు కూడా ఇందులో ఉన్నాయి. టైగర్ జోన్  ఏర్పాటు, అటవీ శాఖ నిబంధనల వల్ల ఫారెస్ట్ అధికారులు నల్లమల అటవీ ప్రాంతంలోని కాశీనాయన ఆశ్రమాన్ని కూల్చేశారు. దీనిపైనే నారా లోకేష్ క్షమాపణ చెబుతూ ప్రజల మనోభావాల్ని విజ్ఞప్తులను అధికారులు దృష్టిలో పెట్టుకుని ఉంటే బాగుండేదని.. ఈ ఘటన కు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అలాగే కూల్చేసిన కట్టడాలని  తిరిగి తాను నిర్మిస్తానని భక్తులకు హామీకు ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ శాఖలో లోకేష్ చొరవ 
 నారా లోకేష్ ప్రకటన భక్తులకు ఊరట కలిగించిన మాట వాస్తవమే కానీ ఆ శాఖ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి చెందింది కావడం విశేషం. అటవీ శాఖ బాధ్యతలు ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్నారు. కాశీనాయన కట్టడాలని కూల్చేయొద్దు అంటూ  పవన్ కళ్యాణ్ కి ఇప్పటికే చాలా వినతులు అందాయి. కానీ ఆయన నుండి స్పందన రాలేదు. ఇప్పుడు విద్యా, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఎంటర్ కావడం తో భక్తులకు ఊరట కలిగింది. కానీ ఇలా జనసేనకు చెందిన మంత్రిత్వ శాఖలో నారా లోకేష్ ఎంట్రీ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. గతంలో హోంశాఖ బాధ్యతలు టిడిపి సరిగా నిర్వహించడం లేదంటూ  హోం మంత్రి అనితను  పవన్ కళ్యాణ్ బహిరంగంగానే విమర్శించిన ఘటన  ఇంకా ఎవరూ మరువలేదు.

తాను గనుక హోంశాఖ తీసుకుంటే పరిస్థితి వేరేలా ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ అప్పట్లో ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు. కానీ ఇలా వేరే మంత్రిత్వ శాఖ  గురించి బహిరంగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడడం పై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఇప్పుడు ఆయనకు సంబంధించిన శాఖలో నారా లోకేష్ ఎంట్రీ ఇవ్వడంపై  అది కూడా  జనసేన ప్లీనరీకి ఒక్కరోజు ముందు ఈ పరిణామం జరగడంతో ఏపీ రాజకీయాలు కొత్త చర్చ మొదలైంది.  కానీ ఇంత ముఖ్యమైన విషయంలో  పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు అనేది  కాశీనాయన భక్తులకు అర్థం కావడం లేదు.

ఎవరీ కాశీనాయన- ప్రత్యేకత ఏంటి 

 ఉమ్మడి నెల్లూరు జిల్లా  బెడుసుపల్లిలో  1895లో పుట్టిన కాశీ రెడ్డి బాల్యంలోనే ఆధ్యాత్మిక చింతనలో పడ్డారు. దేశంలోని అనేక  తీర్థాలు పుణ్యక్షేత్రాలు సందర్శించి  కాశి నాయనగా మారారు. ఆయన పేరు మీద  రాష్ట్రంలో అనేక ఆశ్రమాలు వెలసాయి. కడప జిల్లాలోని బద్వేలు సమీపంలో  ఉన్న ఆశ్రమం అతి ముఖ్యమైనది. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు తాను బతికి ఉండగానే కాశి నాయన 104 ఏళ్ల వయస్సు లో 1999లో దేహం చాలించారు. ఆయన పేరు మీద అప్పటి ప్రభుత్వం ఒక మండలాన్ని కూడా ఏర్పాటు చేసింది. రాయలసీమ ప్రాంతంలో కాశీనాయనకు ఎంతో మంది భక్తులు ఉన్నారు. ఇప్పుడు అటవీ నిబంధనల పేరుతో  ఆయన ఆశ్రమాన్ని అన్నదాన సత్రాన్ని  అటవీ అధికారులు కూల్చేయడం పై ఆందోళన మొదలైంది. ప్రస్తుతం లోకేష్ ఎంట్రీ ఇవ్వడంతో  ఆ ఆందోళన సద్దుమణిగినా అది పవన్ కళ్యాణ్ కు చెందిన శాఖ కావడంతో జనసేన దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్‌ పర్యటన-సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌
నేడు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్‌ పర్యటన-సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌
Amaravati Mega Metropolitan Region: అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
Deepam 2 Scheme: ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల
ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.139.53 కోట్లు విడుదల
Thalliki Vandanam Cybercrime: తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది అకౌంట్లలో నగదు మాయం, ట్విస్ట్ ఏంటంటే
తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది అకౌంట్లలో నగదు మాయం, ట్విస్ట్ ఏంటంటే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget