అన్వేషించండి

Tirumala News: తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!

TTD: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి దర్శన ఏర్పాట్లపై ఈవో అధికారులతో సమీక్షించారు. టికెట్ల జారీకి సంబంధించిన తేదీలు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించారు.

TTD Arrangements For Vaikunta Ekadashi Event: తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ (TTD) చర్యలు చేపట్టింది. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకూ నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన (Vaikunta Dwara Darshan) ఏర్పాట్లపై తితిదే ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యతో కలిసి మంగళవారం అన్నమయ్య భవన్‌లో సమీక్ష నిర్వహించారు. అన్ని విభాగాల అధిపతులతో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

టీటీడీ నిర్ణయాలివే..

  • వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఈ నెల 23న ఉదయం 11 గంటలకు 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
  • ఈ నెల 24న ఉదయం 11 గంటలకు 10 రోజుల ఎస్ఈడీ టోకెన్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
  • జనవరి 10 నుంచి 19 వరకూ 10 రోజులకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలోని ఒక కేంద్రంలో సర్వదర్శనం టోకెన్లు కేటాయిస్తారు.
  • తిరుపతిలోని ఎం.ఆర్.పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్లు కేటాయిస్తారు.
  • టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సీఈకి ఆదేశం. టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి ఇస్తారు. టోకెన్లు లేని భక్తులను దర్శన క్యూలైన్లలోకి అనుమతించరు.
  • వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 04:45 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం కాగా.. అధిక రద్దీ కారణంగా ఆ రోజున ఆలయంలో వేదాశీర్వచనం రద్దు చేశారు.
  • ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకూ స్వర్ణరథం, ఉదయం 5:30 నుంచి 6:30 వరకూ శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతాయి. గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదు.
  • టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో తిరుమలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచన.
  • వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని కేటరింగ్ అధికారులకు ఆదేశం. టీ, కాఫీ, పాలు, ఉప్మా, చక్కెర పొంగలి, పొంగలి పంపిణీ చేయాలని నిర్ణయం.
  • ప్రతి రోజూ అందుబాటులో 3.50 లక్షల లడ్డూలు.. అదనంగా 3.50 లక్షల లడ్డూల బఫర్ స్టాక్ ఉంచుకోవాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు.

ఆ టికెట్ల విడుదల తేదీలివే..

  • మార్చి 2025కు సంబంధించి సుప్రభాతం, తోమాల, అష్టదళపాద పద్మారాధన సేవల ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వీటిలోనే లక్కీ డిప్ కోటా కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
  • ఈ నెల 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవా టికెట్లను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంచుతారు.
  • ఈ నెల 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ కోటా, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటా విడుదల ఉంటుంది.
  • ఈ నెల 24న ఉదయం 10 గంటలకు 2025, మార్చి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్ ఉంటుంది.
  • ఈ నెల 27న మార్చి నెల శ్రీవారి సేవా కోటా విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in లో ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Also Read: Kakinada Port Ship Seized: రేషన్ బియ్యం అన్‌లోడ్ చేశాకే, షిప్ రిలీజ్ చేయడంపై నిర్ణయం- కాకినాడ కలెక్టర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 RR VS CSK Result Update: రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RR vs CSK Match Highlights IPL 2025 | చెన్నై పై 6 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం | ABP DesamDC vs SRH Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ | ABP DesamRR vs CSK Match Preview IPL 2025 | నేడు గువహాటిలో చెన్నసూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ | ABP DesamDC vs SRH Match Preview IPL 2025 | ఏ టీమ్ తెలుగు వాళ్లది..ఆటతో తేల్చేస్తారా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 RR VS CSK Result Update: రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
IPL 2025 SRH VS DC Result Update: స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
Sikandar Review - సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
Andhra Pradesh: గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Puri Jagannadh Vijay Sethupathi: పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
Embed widget