Weather Today: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Todays Weather:బంగ్లాదేశ్‌కు సమీపంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం లేదు. అయితే నార్మల్‌గా అక్టోబర్‌లో కురిసే వర్షాలతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Weather Report: నైరుతి బంగ్లాదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎగువ ఉపరితల ఆవర్తనం కారణంగా ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌పై ఉంటుంది. ఇది నైరుతివైపు వంగి పయనిస్తోందని వాతావరణ శాఖ పేర్కొంది.
బంగ్లాదేశ్‌కు సమీపంలో ఏర్పడిన అల్పపీడనం నైరుతి వైపు పయనిస్తూ ఉంది. దీని ప్రభావం ఏపీ తెలంగాణల్లో పెద్దగా లేకపోయినా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది. వారం రోజులకు సంబంధించిన వాతావరణ వివరాలు వెల్లడించిన ఐఎండీ కీలకాంశాలు చెప్పుకొచ్చింది.
తెలంగాణలో వాతావరణం (Today Weather In Telangana )
తెలంగాణలో ఇవాల్టి నుంచి నాలుగు రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది వాతావరణ శాఖ. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతానికి ఉన్న వివరాలు గమనిస్తే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉంది.
ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలు:- నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
ఆరు ఏడు తేదీల్లో ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అవి- రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ జిల్లా ఆ పరిధిలో ఉన్నాయి.
ఏడు 8 తేదీల్లో వర్షాలు కురిసే జిల్లాలు:- జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయి.
ఎనిమిది, తొమ్మిది తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలు:- కొమ్రమ్‌భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు స్పష్టంగా ఉన్నట్టు పేర్కొంది.
హైదరాబాద్‌లో వాతావరణం పరిశీలిస్తే(Today Weather In Hyderabad)
హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో వర్షాలు పడొచ్చు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గరిష్ణంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు. నిన్న నమోదు అయిన గరిష్ణ ఉష్ణోగ్రత, 32.8 కనిష్ట ఉష్ణోగ్రత 23.3 డిగ్రీలు.
ఈ ఏడాది ఇప్పటి వరకు కురిసిన వర్షపాతాలు ఒక్కసారి చూసుకుంటే... మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట్‌లో పడాల్సిన వర్షపాతం కంటే చాలా ఎక్కువ పడినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. కొత్తగూడెం, మహబూబాబాద్, హైదరాబాద్, భూపాలపల్లి, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమ్రం భీమ్, మల్కాజ్‌గిరి, హన్మకొండ, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యపేట, వనపర్తిలో కాస్త ఎక్కువ వర్ష పాతం నమోదైంది. ఆదిలాబాద్, జనగాం, మంచిర్యాల, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, భువగిరిలో సాధారణ వర్షపాతం నమోదు అయింది. తెలంగాణలో ఎక్కడ కూడా తక్కువ రిజిస్టర్ కాలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం(Today Weather In Andhra Pradesh)
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం పలు ప్రాంతాల్లో మేఘావృతమై ఉంటుంది. చాలా ప్రాంతాల్లో వర్షపు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. దాదాపు అన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అన్ని జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడతాయని పేర్కొంది.
దేశవ్యాప్తంగా వెదర్ ఒక్కసారి పరిశీలిస్తే... ఏడో తేదీన తమిళనాడు, కేరళ, అరుణాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. 8వ తేదీ అస్సో, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, కేరల, తమిల్‌నాడు, కర్ణాటలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి.
Also Read: రైతులకు కేంద్రం శుభవార్త- పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల- ఈ పని చేయకుంటే నిరాశ తప్పదు!