అన్వేషించండి

PM Kisan Yojana: రైతులకు కేంద్రం శుభవార్త- రేపు పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల- ఈ పని చేయకుంటే నిరాశ తప్పదు!

PM Kisan Yojana : పీఎం కిసాన్ యోజన 18వ విడత విడుదల కానుంది. ఈ పరిస్థితిలో మీరు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయకపోతే పథకం ప్రయోజనాలు కోల్పోతారు.

PM Kisan Yojana : పీఎం కిసాన్ యోజన డబ్బులు కోసం ఎదురు చూస్తున్న రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. శనివారం ఉదయం రైతుల ఖాతాల్లో డబ్బులు వేయబోతోంది కేంద్రం. 9.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 20 వేల కోట్లకుపైగా నిధులను బదిలీ చేయబోతోంది.  మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులు విడుదల చేస్తారు. 

రైతుల ఖాతాల్లో రెండు వేలు జమ 

అర్హులైన రైతులందరికీ పిఎం కిసాన్ యోజన కింద సంవత్సరానికి రూ.6,000 సహాయం కేంద్రం అందిస్తోంది. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 17 విడతలుగా నిధులు అందిస్తూ వచ్చింది. 17వ విడత మొన్న జూన్‌లో రిలీజ్ అయింది. ఇప్పుడు 18 విడత నిధులు శనివారం(అక్టోబర్‌ 5న) విడుదల చేయనుంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతు ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది కేంద్రం. 2 హెక్టార్ల వరకు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులంతా ఈ పథకానికి అర్హులు. 

ఈ కేవైసీ తప్పనిసరిగా చేయాలి

పిఎం కిసాన్ యోజన సొమ్ము ఖాతాల్లో జమ చేయాలంటే మాత్రం కేవైసీ తప్పనిసరిగా చేసి ఉండాలి. లేకుండా డబ్బులు వేయడానికి వీలుపడదని అధికారులు చెబుతున్నారు. PM కిసాన్ యోజనకు అర్హులైన రైతులు మూడు విధాలుగా EKYC చేసుకోవచ్చు. OTP-ఆధారిత e-KYC, బయోమెట్రిక్-ఆధారిత e-KYC, నేరుగా బ్యాంకుకు వెళ్లి e-KYC చేసుకోవాల్సి ఉంటుంది. 

OTP ఆధారిత e-KYC: ఎలా ఎంచుకోవాలి
1. PM కిసాన్ యోజన వెబ్‌సైట్‌కి వెళ్లి, కిసాన్ కార్నర్ సెక్షన్‌పై క్లిక్ చేస్తే అందులో e-KYC విభాగం ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. 
2. అందులో ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ ఎంటర్ చేయాలి. వెంటనే మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది దాన్ని అందులో ఎంటర్ చేయాలి. 
3. OTPని ఫిల్ చేసిన వెంటనే e-KYC ప్రక్రియ పూర్తి అయినట్టు సమాచారం వస్తుంది. 

కొత్త ఈ పథకానికి అర్హులైన వాళ్లు ఈ ప్రక్రియను ఫాలో కావాల్సి ఉంటుంది. 

1. నమోదు ప్రక్రియ
ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి రైతులు ముందుగా తన పేరును నమోదు చేసుకోవాలి. అలా నమోదు చేసుకోకుంటే ప్రయోజనాలు కోల్పోతారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 

2. ఆధార్ నంబర్‌కు లింక్ చేయడం
రైతుల భూ రిజిస్ట్రేషన్‌తో ఆధార్ నంబర్‌ అనుసంధానమై ఉండాలి. అలా లేకపోతే మాత్రం దరఖాస్తు పెండింగ్‌లో ఉంటుంది. ప్రభుత్వం సాయన్ని అందుకోలేరు.

3. భూమి యాజమాన్య హక్కు పత్రాలు
వ్యవసాయ భూమి తనదే అని చెప్పే యాజమాన్య హక్కు పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. భూమి మీది అయినా అది పేరు మీద లేకుంటే మాత్రం పథకానికి అర్హులుకారు. 

4. మార్గదర్శకాలను అనుసరించడం
ఇతర వేరే కేంద్రం ఇచ్చే రైతు పథకాల సాయం తీసుకోని వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఏదైనా ఇతర పథకం నుంచి ఆర్థిక సహాయం పొందుతే మాత్రం PM కిసాన్ యోజనకు అర్హులు.

Also Read: బీహార్‌లో మారుతున్న సమీకరణాలు - నితీష్ కుమార్ తీరు అనుమానాస్పదం - బీజేపీ జాగ్రత్త పుడుతోందా ?

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Sukhbir Singh Badal News: నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
Digital India: డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చింది?
డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చింది?
Parliament Monsoon Session: లోక్‌సభ నిరవధికంగా వాయిదా!సమావేశాల చివరి రోజున అమిత్ షా రాక!
లోక్‌సభ నిరవధికంగా వాయిదా!సమావేశాల చివరి రోజున అమిత్ షా రాక!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget