Bihar Nitish Kumar : బీహార్‌లో మారుతున్న సమీకరణాలు - నితీష్ కుమార్ తీరు అనుమానాస్పదం - బీజేపీ జాగ్రత్త పుడుతోందా ?
Bihar : బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కొత్త రాజకీయాలు ప్రారంభమవుతున్నాయి. నితీష్ కుమార్ బీజేపీతో దూరం జరిగేలా వ్యవహరిస్తున్నారు. బీజేపీ కూడా జాగ్రత్త పడుతోంది.
JDU Rift With NDA Partner BJP : కేంద్రంలో ప్రస్తుతం బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఉంది. ఆ సంకీర్ణంలో టీడీపీతో పాటు జేడీయూ కూడా అత్యంత కీలక భాగస్వామ్య పార్టీలు. కూటమి విషయంలో టీడీపీ ఎక్కడా చిన్న మాట అనుమానాలకు తావివ్వకుండా వ్యవహరిస్తోంది. కానీ నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ మాత్రం గందరగోళ ప్రకటనలు చేస్తోంది. నితీష్ కుమార్ తరచూ లాలూ ప్రసాద్ యాదవ్ ను కలుస్తున్నారు. తేజస్వితో ముచ్చట్లు పెడుతున్నారు. తాజాగా జేడీయూ లీడర్ ఒకరు ఏకంగా నితీష్ కుమార్ ప్రధానమంత్రి అనే కామెంట్లు చేశారు. దీనిపై బీజేపీ నేతలు మండిపడ్డారు . ప్రధాని పదవి ఖాళీ లేదన్నారు.
బీహార్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలు
బీహార్‌లో నితీష్ కుమార్ సుదీర్ఘ కాలం సీఎంగా కొసాగుతున్నారు. ఆయనకు ప్రజల్లో ఉన్న క్లీన్ ఇమేజ్ కారణంగా ఆయన పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ లేకపోయిన ఇతర కూటమి పార్టీలు ఆయనకే సీఎం పీఠం ఇస్తున్నాయి. గతంలో ఓ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత తీసుకుని సీఎం పదవి రాజీనామా చేసి జితన్ రామ్ మాంఝీని సీఎంను చేశారు. తర్వాత ఎన్నికల్లో మళ్లీ గెలిచి సీఎం పదవిని చేపట్టారు. ఆయన ఎక్కువగా బీజేపీతో కలిసి ప్రయాణం చేశారు. కానీ ఆర్జేడీతో కూడా కలిసి పోటీ చేసి గెలిచారు.తన సీటుకు ఎప్పుడు ఎసరు వస్తుందని అనుకుంటే అప్పుడు నిర్మోహమాటంగా కూటమిని మార్చేస్తూంటారు నితీష్. అందుకే ఆయనను బీజేపీ ఎక్కువ గా నమ్మడం లేదు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో చమురు మంట - భారత్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయా?
వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మరోసారి గెలవడమే టార్గెట్
వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒంటరిగా జేడీయూ గెలిచే చాన్స్ లేదు. ఒకప్పుడు బీజేపీ మైనర్ పార్టీగా.. జేడీయూ మేజర్ పార్టీగా ఎన్నికలకు వెళ్లేవి. కానీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జేడీయూ భారీగా దెబ్బతిన్నది. అయినా సీఎం సీటు బీజేపీ ఆయనకే ఇచ్చింది. కానీ ఆయన రెండు సార్లు కూటములు మార్చారు. మరోసారి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీతో కలిసి పోటీ చేస్తారా లేదా అన్నదానిపై సస్పెన్స్ ప్రారంభమయింది. దీనికి కారణంగెలుపుపై అనుమానాలే. ప్రశాంత్ కిషోర్ కొత్ పార్టీ పెట్టుకున్నారు. లాలూ కుమారుడు తేజస్వియాదవ్ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.ఆయనకు ప్రతీ సారి అన్యాయం జరుగుతోందన్న అభిప్రాయం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో లాలూతో నితీష్ సాన్నిహిత్యం పెంచుకుంటున్నారు.
Also Read: రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
నితీష్‌కు తన ప్రయోజనాలే ముఖ్యం
నితీష్ కుమార్ ఓ సిద్దాంతానికి కట్టబడి ఉండే రాజకీయ నేత కాదు. తన రాజకీయ ప్రయోజనాలే తనకు ముఖ్యం.అందుకే ఆయన ఎప్పుడు ఎటు వైపు మొగ్గుతాలో చెప్పలేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో జేడీయూ కీలకమే కానీ.. నిర్ణయాత్మకం కాదు.ఆయన మద్దతు లేకపోతే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడబోదు అనుకుంటే ఆయన ఖచ్చితంగా వఇంకా పెద్ద డిమాండ్లు ఏవో చేసి ఉండేవారు. ఆయన మద్దతు లేకపోయినా ప్రభుత్వ మనుగడకు వచ్చిన సమస్య లేదు. అందుకే సైలెంట్ గా ఉంటున్నారు.కానీ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎటైనా మొగ్గవచ్చని...తన పార్టీ ద్వారా సంకేతాలు ఇస్తున్నారని అనుకోవచ్చు.