బీజేపీని వదలని ఉదయనిధి స్టాలిన్, ఈసారి హిందీ భాషను ఉద్దేశిస్తూ ట్వీట్
Udhayanidhi Stalin: హిందీ దినోత్సవం సందర్భంగా అమిత్‌షా చేసిన ట్వీట్‌పై ఉదయనిధి స్టాలిన్ మండి పడ్డారు.
Udhayanidhi Stalin:
అమిత్‌షాపై అసహనం..
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదమయ్యాయో తెలిసిందే. ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. అప్పటి నుంచి ఉదయనిధిని టార్గెట్ చేస్తూ బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. అయితే...హిందీ దినోత్సవం సందర్భంగా కేంద్రహోం మంత్రి అమిత్‌షా చేసిన ట్వీట్‌పైనా ఉదయనిధి తీవ్రంగా స్పందించడం మరో వివాదానికి తెర తీసింది. దేశంలోని అన్ని భాషల్ని ఏకం చేసేది హిందీ అని, స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి ఇప్పటి వరకూ దేశ అభివృద్ధిలో హిందీ పాత్ర కీలకం అని ట్వీట్ చేశారు అమిత్ షా. అధికార భాష అయిన హిందీతో పాటు అన్ని భాషల్నీ కాపాడుకునేందుకు ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.
‘हिंदी दिवस’ के अवसर पर सभी को शुभकामनाएँ देता हूँ।
— Amit Shah (@AmitShah) September 14, 2023
दुनिया के सबसे बड़े लोकतंत्र भारत की भाषाओं की विविधता को एकता के सूत्र में पिरोने का नाम 'हिंदी' है। स्वतंत्रता आन्दोलन से लेकर आजतक देश को एकसूत्र में बाँधने में हिंदी की महत्त्वपूर्ण भूमिका रही है। आइए, ‘हिंदी दिवस’ के अवसर…
దీనిపైనే ఉదయనిధి స్టాలిన్ మండి పడ్డారు. ట్విటర్‌లో తమిళంలో సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. అన్ని భాషల్ని హిందీ ఎలా కలుపుతుందని, బలవంతంగా ఆ భాషను రుద్దడం ఆపేయాలని తేల్చి చెప్పారు. హిందీ మాత్రమే గొప్పదనే భావజాలం నుంచి బీజేపీ బయటపడాలని అన్నారు. హిందీ చదివితేనే అభివృద్ధి చెందొచ్చు అనే అర్థం వచ్చేలా మాట్లాడడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు.
"హిందీ దేశ ప్రజల్ని ఏకం చేస్తుందని, స్థానిక భాషల్ని బలోపేతం చేస్తుందని అమిత్‌షా చెప్పడమేంటి..? ఎప్పటిలాగే ఆయన మరోసారి హిందీపైన తనకున్న ప్రేమని చాటుకున్నారు. హిందీ చదివితే కానీ గొప్పవాళ్లం కాలేవన్న అర్థంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటి..? తమిళనాడులో తమిళం మాట్లాడతారు, కేరళలో మలయాళం మాట్లాడతారు. మరి ఈ రెండు రాష్ట్రాలను హిందీ ఎలా కలుపుతుంది..? సాధికారత ఎలా సాధిస్తారు..? కేవలం నాలుగైదు రాష్ట్రాల్లో మాట్లాడే హిందీ భాష...మొత్తం దేశ ప్రజల్ని ఒకటి చేస్తుందని చెప్పడం వింతగా ఉంది. మిగతా భాషల్ని తక్కువ చేసి మాట్లాడడం సరికాదు"
- ఉదయనిధి స్టాలిన్, తమిళనాడు మంత్రి
"இந்தி தான் நாட்டு மக்களை ஒன்றிணைக்கிறது - பிராந்திய மொழிகளுக்கு அதிகாரமளிக்கிறது" என்று வழக்கம் போல தனது இந்தி மொழிப் பாசத்தை ஒன்றிய அமைச்சர் அமித்ஷா பொழிந்துள்ளார். இந்தி படித்தால் முன்னேறலாம் என்ற கூச்சலின் மாற்று வடிவம் தான் இந்தக் கருத்து.
— Udhay (@Udhaystalin) September 14, 2023
தமிழ்நாட்டில் தமிழ் - கேரளாவில்…
బీజేపీ నేతలు వరుస పెట్టి కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. అయినా...ఉదయనిధి మాత్రం తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోలేదు. పైగా పదేపదే ఇంకా కవ్విస్తున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈసారి డైరెక్ట్‌గా బీజేపీనే టార్గెట్ చేశారు. బీజేపీ ఓ విషసర్పం అని మండి పడ్డారు. DMK ఎమ్మెల్యే ఇంట్లో పెళ్లికి వెళ్లిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ప్రతిపక్షమైన AIDMKపైనా విమర్శలు చేశారు. AIDMK పార్టీ చెత్తలాంటిదైతే...అందులోని పాము బీజేపీ అని సెటైర్లు వేశారు. ఇప్పటికే డీఎమ్‌కే ఎంపీ ఎ. రాజా ఇలాంటి వ్యాఖ్యలే చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన నేరుగా ప్రధాని నరేంద్ర మోదీయే విషసర్పం అంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ బీజేపీని విషసర్పంతో పోల్చారు.
Also Read: జ్ఞానవాపి మసీదులో బయటపడ్డ హిందూ వస్తువులను జాగ్రత్తగా ఉంచండి, వారణాసి కోర్టు ఆదేశాలు