Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death: ఇంట్లో బంగారం బ్యాంకులో తాకట్టు పెడితేనే చాలా నామూషీగా ఫీల్ అవుతారు. అలాంటి దేశం బంగారాన్ని విదేశాలకు తాకట్టు పెట్టిన మన్మోహన్ సింగ్ సంస్కరణ వాది ఎలా అయ్యారు?
Manmohan Singh Death: దేశ ఆర్థిక సరళీకరణ పితామహుడిగా చెప్పుకునే మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం (డిసెంబర్ 26) మరణించారు. 92 ఏళ్ల వయసులో ఆయన ఎయిమ్స్‌లో తుది శ్వాస విడిచారు. 1991 సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థ చరిత్రలో ఒక మలుపుగా చెబుతారు. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో అప్పటి ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ సాహసోపేతమైన నిర్ణయం దేశ దిశను మార్చేసింది. భారతదేశాన్ని రక్షించడానికి RBIకి చెందిన 44 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టి చరిత్ర సృష్టించారు.
నిజానికి 1991లో భారతదేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు కేవలం 1.2 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఈ నిల్వ కేవలం మూడు వారాల దిగుమతులకే సరిపోతుంది. గల్ఫ్ యుద్ధం ముడి చమురు ధరల పెరుగుదలకు దారితీసింది. ఇది భారతదేశంపై దిగుమతుల ఒత్తిడిని మరింత పెంచింది. భారతదేశం వివిధ అంతర్జాతీయ సంస్థల నుంచి భారీ రుణాలు తీసుకుంది. దాని కోసం తిరిగి చెల్లించడానికి విదేశీ మారకద్రవ్యం నిండుకున్నాయి.
బంగారం తాకట్టు పెట్టాలని నిర్ణయం
1980ల విధానాలు భారతదేశాన్ని అప్పుల్లోకి, అధిక ఆర్థిక లోటులోకి నెట్టాయి. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలో ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్ 67 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టింది. ఈ బంగారాన్ని స్విట్జర్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు పంపారు.
ఈ నిర్ణయంతో మలుపు తిరిగిన ఆర్థిక వ్యవస్థ
ఈ నిర్ణయం వెనుక ఉద్దేశ్యం చాలా గొప్పది. ఇది భారతదేశానికి $600 మిలియన్ల రుణాన్ని పొందేందుకు సహాయపడింది. ఈ డబ్బును విదేశీ అప్పులు చెల్లించడానికి, దిగుమతులు నిర్వహించడానికి ఉపయోగించారు. బంగారాన్ని తాకట్టు పెట్టడం అవమానకరమైన పరిస్థితిగా పరిగణించారు. ఎందుకంటే బంగారం భారతదేశం ఆర్థిక శ్రేయస్సు, సాంస్కృతిక చిహ్నం. ఈ నిర్ణయం ప్రజలతోపాటు రాజకీయ నాయకుల్లో విమర్శలు ఎదుర్కొంది. ఇది కఠినమైన చర్య అయినప్పటికీ, ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి సహాయపడింది.
Also Read: పొలిటికల్ 'పండిట్' మన మన్మోహన్ సింగ్ - దేశ గతిని మార్చిన ఆర్థికవేత్త
ఆర్థిక సంస్కరణల ప్రారంభం
బంగారాన్ని తాకట్టు పెట్టిన తర్వాత, డాక్టర్ మన్మోహన్ సింగ్ 1991లో భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ఆర్థిక సరళీకరణ ప్రక్రియ ప్రారంభించారు. ప్రపంచ పెట్టుబడులు, పోటీకి భారత మార్కెట్లు ద్వారాలు తెరిచాయి. లైసెన్స్ రాజ్ రద్దు చేశారు. విదేశీ కంపెనీలు భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు అనుమతించారు. దిగుమతి-ఎగుమతి నియమాలు సరళీకృతం చేశారు. ఆ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందింది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న ప్రపంచశక్తిగా చూడటం ప్రారంభించింది.
డా. మన్మోహన్ సింగ్ సహకారం తీసుకున్న ఈ నిర్ణయం ఆయనను భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా నిలబెట్టింది. బంగారాన్ని తనఖా పెట్టడం భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. దేశ ఆర్థిక వ్యవస్థను పతనం నుంచి రక్షించిన చేదు, సాహసోపేతమైన నిర్ణయం, మన్మోహన్ సింగ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్లనే భారతదేశం నేడు బలమైన, స్థిరమైన ఆర్థిక శక్తిగా మారింది.
Also Read: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత