అన్వేషించండి

ఆలయంలో లెబనాన్ క్రైస్తవ యువతి అర్చకత్వం, హిందూ ధర్మానికే జీవితం అంకితం

Christian woman Priestess: లెబనాన్‌కి చెందిన ఓ క్రైస్తవ యువతి హిందూ ఆలయంలో అర్చకత్వం చేస్తోంది.

Lebanon Woman Priestess:

ఆలయంలో క్రైస్తవ యువతి..

"అర్చకత్వం పురుషులే చేయాలి..స్త్రీలు ఆ వృత్తికి పనికి రారు"  ఇదంతా పాత మాట. ఇప్పుడు ఆడవాళ్లు కూడా అర్చకత్వం చేస్తున్నారు. ఈ మధ్యే తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేకంగా ఇందుకోసం ఓ కోర్స్ కూడా పెట్టి ఇద్దరు యువతులను అపాయింట్ చేసింది. అప్పట్లో ఇది చాలా ఆసక్తికర చర్చకు దారి తీసింది. అదే ఆసక్తికరం అనుకుంటే..ఇప్పుడు అంతకన్నా ఇంట్రెస్టింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. కోయంబత్తూర్‌లోని ఈశా యోగా సెంటర్‌లోని (Isha Yoga Centre) లింగా భైరవి ఆలయంలో ఓ మహిళ అర్చకత్వం చేస్తోంది. ఇది కొంత వరకూ ఆశ్చర్యమే. కానీ...ఇంకో సర్‌ప్రైజ్‌ కూడా ఉంది. ఆమె ఓ క్రిస్టియన్. పైగా...ఇండియన్ కూడా కాదు. లెబనాన్‌కి చెందిన మహిళ ఇక్కడికి వచ్చి ఆలయంలో అర్చకత్వం చేస్తోంది. ఆమె అసలు పేరుతో కన్నా భైరాగిని మా హనీన్ (Bhairagini Maa Hanine)గానే అందరికీ పరిచమయైంది. లక్షల రూపాయల జీతమున్న ఉద్యోగాన్ని కాదనుకుని మరీ ఇలా దైవ సన్నిధిలోనే జీవితాన్ని గడపాలనుకుని ఈ నిర్ణయం తీసుకుంది. అనుకున్న వెంటనే ఈశా యోగా సెంటర్‌లో చేరిపోయింది. అప్పటి నుంచి భైరవి ఆలయంలో  సేవలు అందిస్తోంది. ఎరుపు చీర కట్టుకుని, బొట్టు పెట్టుకుని నిజమైన హిందువులా వేషాన్ని మార్చుకుంది. భక్తులను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంది. లెబనాన్‌లో ఓ సంస్థలో క్రియేటివ్ ఆర్ట్‌ డైరెక్టర్‌గా పని చేసింది ఈ యువతి. వయసు పాతికేళ్లే. కానీ దైవభక్తి చాలా ఎక్కువ. అందుకే విలాసవంతమైన జీవితాన్ని కాదనుకుని మరీ ఇలా ఈశా యోగా సెంటర్‌లో చేరింది. మరి ఎందుకీ నిర్ణయం తీసుకున్నారని ఎవరైనా అడిగితే...ఇదిగో ఇలా సమాధానం చెబుతోంది..

"నేను లెబనాన్‌ నుంచి వచ్చాను. గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ చేశాను. ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో క్రియేటివ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశాను. కానీ..ఈ ఈశా యోగా సెంటర్ గురించి తెలిశాక 2009లో ఫుల్‌టైమ్ వాలంటీర్‌గా చేరిపోయాను. దాదాపు 14 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాను. నాకు ఇక్కడికి వచ్చినప్పుడు భక్తి, యోగా గురించి ఏమీ తెలియదు. ఆ సమయంలోనే నా స్నేహితురాలు చనిపోయింది. చాలా ప్రశ్నలు నా మనసులో మెదిలాయి. ఆ ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రయత్నించాను. అప్పుడే ఈశా యోగా సెంటర్‌లో ఇన్నర్ ఇంజనీరింగ్‌ కోర్స్ చేశాను. వెంటనే లెబనాన్‌కి వెళ్లి ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేశాను. ఇక్కడ ఇలా ఉండడం నాకు చాలా సంతృప్తినిస్తోంది"

- భైరాగిని మా హనీన్

జీవితం అంకితం..

ఈశా యోగా సెంటర్‌లో కోర్స్ చేసిన తరవాత తనకు ఎంతో ప్రశాంతత వచ్చిందని, అందుకే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నానని చెబుతోంది ఈ యువతి. కొన్నేళ్ల క్రితం సద్గురుతో (Isha Sadhguru) కలిసి భైరాగి మా ని దర్శించుకున్నానని, అప్పటి నుంచి జీవితం మారిపోయిందని వివరిస్తోంది. ఆ దేవత రంగు ఎరుపు అని, అందుకే తాను ఎప్పుడూ ఎర్ర చీర కట్టుకుని ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. ఇప్పటికీ తాను క్రైస్తవురాలినేనని, కాకపోతే హిందూ ధర్మం గురించి కూడా తెలుసుకోవాలన్న ఆసక్తి ఉందని అంటోంది. తన జీవితాన్ని ఇలాగే అంకితం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేసింది. 

Also Read: ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి, ఢిల్లీలో దారుణంగా పడిపోయిన ఎయిర్ క్వాలిటీ

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
Lookback 2024: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
Lookback 2024: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
VRS For Wife: విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!
విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Embed widget