X

Independence Day:1947 స్వాతంత్య్ర వేడుకల్లో మహాత్మా గాంధీ ఎందుకు లేరు.. అప్పుడు జరిగిన ఇంట్రస్టింగ్ సంగతులు ఇవే..

భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించింది మహాత్మా గాంధీ. కానీ, ఆయన మెుదటి స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనలేదు.అది ఎందుకో తెలుసా?

FOLLOW US: 

భారత స్వాతంత్య్ర ఉద్యమం అని పేరు చెప్పగానే.. ఠక్కున గుర్తొచ్చే పేరు మహాత్మా గాంధీ. భారతదేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి.. ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఎన్నో ఉద్యమాలు చేశారు. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. మెుదటి వేడుకల్లో ఆయన పాల్గొనలేదు. అప్పుడు దీక్షలోనే ఉన్నారు. అలాంటి.. ఆసక్తికర పది పాయింట్లు ఓ సారి చదవండి.. 

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15న మెుదటి వేడుకల్లో గాంధీ పాల్గొనలేదు. దిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలోని బెంగాల్ లోని నోవాకలీలో ఉన్నారు. అక్కడ హిందూ.. ముస్లింల మధ్య మత ఘర్షణలను జరగకుండా ఉండాలని నిరాహార దీక్ష చేశారు.

Also Read: 1906లో మన జాతీయ జెండా ఎలా ఉండేదో తెలుసా? చూస్తే.. ఆశ్చర్యపోతారు!

ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వస్తుందనే విషయం జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయి పటేల్ కు పక్కాగా ముందే తెలిసింది. వెంటనే మహాత్మాగాంధీకి లేఖ రాశారు. ఆగస్టు 15 మన మొదటి స్వాతంత్య్రం దినోత్సవం అవుతుంది. మీరు కచ్చితంగా ఉండాలి. మీ ఆశీస్సులు అందించాలని కోరారు.

గాంధీ కూడా ఆ లేఖకు సమాధానం పంపారు. బెంగాల్ లోని హిందూ-ముస్లింలు మధ్య గొడవ జరుగుతుంది. వాళ్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ సమయంలో నేను సంబరాలు జరుపుకోలేను అని చెప్పారు. ఈ ఘర్షణలు ఆపేందుకు ప్రాణాలైనా ఇస్తానని లేఖ పంపారు.

Also Read: Independence Day quotes: స్వాతంత్య్ర సమరయోధుల స్పూర్తిదాయక సూక్తులు

జవహర్ లాల్ నెహ్రూ తన చారిత్రక ప్రసంగం ట్రిస్ట్ విత్ డెస్టినీని ఆగస్టు 14న అర్ధరాత్రి వైస్రాయ్ లాంజ్ నుంచి ఇచ్చారు. ఆయన ప్రసంగాన్ని ప్రపంచమంతా విన్నది. కానీ.. మహాత్మా గాంధీ ఆరోజు 9 గంటలకే నిద్రపోయారు.

లార్డ్ మౌంట్‌బాటన్ 1947 ఆగస్టు 15న తన ఆఫీసులో పనిచేశారు. మధ్యాహ్నం నెహ్రూ ఆయనకు తన మంత్రిమండలి సభ్యుల జాబితాను ఇచ్చారు. తర్వాత ఇండియా గేట్ దగ్గర ప్రిన్సెస్ గార్డెన్‌లో బహిరంగ సభలో మాట్లాడారు.

Also Read: జయహో భారత్.. ఈ దేశభక్తి కోట్స్‌తో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి

మనకు తెలిసి.. ప్రతి స్వాతంత్య్రం దినోత్సవం రోజున భారత ప్రధాన మంత్రి ఎర్రకోటపై జెండా ఎగరేస్తారు. 1947 ఆగస్టు 15న మాత్రం అలా జరగలేదు. లోక్‌సభ సెక్రటేరియట్‌లోని పత్రాల ప్రకారం.. 1947 ఆగస్టు 16న నెహ్రూ ఎర్రకోటపై భారత జెండాను ఎగురవేశారు.
భారత అప్పటి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్ ప్రెస్ సెక్రటరీ కాంప్‌బెల్ జాన్సన్ వివరాల ప్రకారం మిత్ర దేశాల సేనల ముందు జపాన్ లొంగిపోయి, 1947 ఆగస్టుకు రెండేళ్లైన సందర్భంగా భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలని నిర్ణయించారు.

ఆగస్టు 15 వరకూ భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించలేదు. దానిని ఆగస్టు 17న రాడ్‌క్లిఫ్ లైన్‌గా ప్రకటించారు. ఆగస్టు 15న భారతదేశానికి విముక్తి లభించింది. అయినా.. దేశానికి అప్పటివరకూ జాతీయ గీతం అంటూ ఏదీ లేదు. జన గణ మణ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లోనే రాసి పెట్టారు. అది 1950లో జాతీయగీతం గౌరవాన్ని పొందినట్లు తెలుస్తోంది.

Also Read: Independence Day Special: కరోనా కారణంగా బయట అడుగు పెట్టే పరిస్థితి లేదంటారా…అయితే ఇంట్లోనే స్వాతంత్య్ర వేడుకలు చేసుకోండిలా

ఆగస్టు 15న భారత్‌తోపాటు మరో మూడు దేశాలు కూడా స్వతంత్ర దినోత్సవాన్ని చేసుకుంటాయి. దక్షిణకొరియా జపాన్ నుంచి 1945 ఆగస్టు 15న స్వతంత్రం పొందింది. బహరీన్‌కు 1971 ఆగస్టు 15న బ్రిటన్ నుంచి విముక్తి దొరికింది. కాంగో 1960 ఆగస్టు 15న ఫ్రాన్స్ నుంచి స్వాతంత్రం పొందింది.

Also Read: Independence Day: రండి.. అంతా కలిసి జాతీయ గీతం పాడదాం.. వాట్ యాన్ ఐడియా..

Tags: Independence Day 2021 Mahatma Gandhi independence day 2021 75th Jawaharlal Nehru 1947 independence day

సంబంధిత కథనాలు

TDP On New Districts: రాజకీయ ప్రయోజనం కోసం రాత్రికి రాత్రి కొత్త జిల్లాలు... సమస్యలకు సమాధానం చెప్పలేక డైవ‌ర్షన్ గేమ్... టీడీపీ ఆరోపణలు

TDP On New Districts: రాజకీయ ప్రయోజనం కోసం రాత్రికి రాత్రి కొత్త జిల్లాలు... సమస్యలకు సమాధానం చెప్పలేక డైవ‌ర్షన్ గేమ్... టీడీపీ ఆరోపణలు

Sudeep Vikrant Rona Postponed: కరోనా వల్ల వాయిదా పడిన మరో పాన్ ఇండియా సినిమా 'విక్రాంత్ రోణ'

Sudeep Vikrant Rona Postponed: కరోనా వల్ల వాయిదా పడిన మరో పాన్ ఇండియా సినిమా 'విక్రాంత్ రోణ'

Covid Vaccine Update: మార్కెట్ విక్రయానికి కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు.. కానీ అక్కడ మాత్రం దొరకవు!

Covid Vaccine Update: మార్కెట్ విక్రయానికి కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు.. కానీ అక్కడ మాత్రం దొరకవు!

Konda Movie: కొండా మూవీతో మళ్లీ తెరపైకి కొండా ఫ్యామిలీ... వరంగల్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు...

Konda Movie: కొండా మూవీతో మళ్లీ తెరపైకి కొండా ఫ్యామిలీ... వరంగల్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు...

AP New Districts: కొత్త జిల్లాలపై ప్రణాళిక విభాగం క్లారిటీ... లోతైన అధ్యయనం చేశామని ప్రకటన...

AP New Districts: కొత్త జిల్లాలపై ప్రణాళిక విభాగం క్లారిటీ... లోతైన అధ్యయనం చేశామని ప్రకటన...
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Stock Market Update: హమ్మయ్యా..! -1400 నుంచి -581కు పుంజుకున్న సెన్సెక్స్‌.. నిఫ్టీదీ అదే దారి!

Stock Market Update: హమ్మయ్యా..! -1400 నుంచి -581కు పుంజుకున్న సెన్సెక్స్‌.. నిఫ్టీదీ అదే దారి!

Balakrishna : రాజకీయాలొద్దు హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలి.. ప్రభుత్వానికి బాలకృష్ణ డిమాండ్ !

Balakrishna :  రాజకీయాలొద్దు హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలి.. ప్రభుత్వానికి బాలకృష్ణ డిమాండ్ !

Shweta Tiwari: 'దేవుడు నా బ్రా కొలతలు తీసుకుంటున్నాడు'... సీరియల్ నటి వ్యాఖ్యలపై మంత్రి సీరియస్... విచారణకు ఆదేశం

Shweta Tiwari: 'దేవుడు నా బ్రా కొలతలు తీసుకుంటున్నాడు'... సీరియల్ నటి వ్యాఖ్యలపై మంత్రి సీరియస్... విచారణకు ఆదేశం

Charanjit Singh Death: హాకీ దిగ్గజం చరణ్‌జిత్ మృతి.. ఒలంపిక్స్‌లో స్వర్ణం సాధించిన జట్టుకు కెప్టెన్!

Charanjit Singh Death: హాకీ దిగ్గజం చరణ్‌జిత్ మృతి.. ఒలంపిక్స్‌లో స్వర్ణం సాధించిన జట్టుకు కెప్టెన్!