Independence Day: రండి.. అంతా కలిసి జాతీయ గీతం పాడదాం.. వాట్ యాన్ ఐడియా..
మన భారతీయులందరి కోసం కేంద్రం ఒక వినూత్న ఐడియాతో ముందుకొచ్చింది. దీని పేరు 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'. ఇందులో మన జాతీయ గీతాన్ని పాడి, వీడియో రూపంలో రికార్డు చేసి పంపాల్సి ఉంటుంది.
స్వాతంత్య్ర దినోత్సవానికి ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. మనది భిన్నత్వంలో ఏకత్వమున్న దేశం. మతాలు ఎన్నైనా.. కులాలు వేరైనా మనమంతా భారతీయులం. ఒలింపిక్స్‌లో మనవాళ్లు గోల్డ్ మెడల్ తీసుకునేటప్పుడు.. ప్రపంచ వేదికల మీద మన జాతీయ గీతం వింటుంటే ప్రతి ఒక్క భారతీయుడికి తెలియకుండానే మనసు ఉప్పొంగుతుంది. ఇదిరా మన భారతదేశం అనిపిస్తుంది.
Let the #Rashtragaan unite us! 🇮🇳
— MyGovIndia (@mygovindia) August 10, 2021
Upload your video singing the National Anthem on https://t.co/2sWGDO38cO and catch a glimpse of yourself being shown live along with millions of fellow countrymen, on 15th August 2021. #AmritMahotsav @PMOIndia @MinOfCultureGoI @bindasbhidu pic.twitter.com/9xWrf29st2
మన భారతీయులందరి కోసం కేంద్రం ఒక వినూత్న ఐడియాతో ముందుకొచ్చింది. దీని పేరు 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'. ఇందులో జాతీయ గీతాన్ని పాడి, వీడియో రూపంలో రికార్డు చేసి పంపాల్సి ఉంటుంది. ఇందులో ఎంపికైన ఉత్తమ గీతాలను పంద్రాగస్టు రోజున రిలీజ్ చేస్తామని కేంద్రం తెలిపింది. అంతే కాదు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సర్టిఫికేట్ కూడా ఇస్తారు.
ఈ కార్యక్రమానికి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖాండు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.
#AzadiKaAmritMahotsav
— Anurag Thakur (@ianuragthakur) August 9, 2021
India’s🇮🇳 #Tokyo2020 Olympic Medalists sang the #RashtraGaan.
You too can join this initiative by recording yourself singing our national anthem & uploading it on https://t.co/7zWsOfZuBI! pic.twitter.com/wLw5gpcDSR
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖాండు ట్వీట్..
Join the nation in singing #NationalAnthem.
— Pema Khandu པདྨ་མཁའ་འགྲོ་། (@PemaKhanduBJP) August 11, 2021
Record your video & upload it on https://t.co/kMmTURDJhp and win a chance to get featured in a new song by India's top lyricist & composer.
Top 100 videos will be selected to be launched across various medias.#AzadiKaAmritMahotsav pic.twitter.com/0fOcEjG9aL
MyGov ఇండియా అధికారిక యూట్యూబ్ పేజీలో దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. దీనికి 'లెట్ అజ్ సింగ్ ద నేషనల్ ఆంథమ్' అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్‌లో ఎలా పార్టిసిపేట్ చేయాలో కూడా ఇందులో వివరించారు. rashtragaan.in వెబ్‌సైట్ ద్వారా వీడియోలను రికార్డు చేసి పంపాలి.
వీటిలో నుంచి బెస్ట్ 100 వీడియోలను సెలక్ట్ చేస్తారు. వీటన్నింటినీ కలిపి ఒక పాటలా కంపైల్ చేస్తారు. ఈ పాటను టీవీ, రేడియో, యూట్యూబ్ సహా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో పంద్రాగస్టు రోజున విడుదల చేస్తామని కేంద్రం అధికారిక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ కారణంగా చాలా మంది పంద్రాగస్టు వేడుకలను వర్చువల్‌గానే జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం వినూత్న రీతిలో కాంటెస్ట్ తీసుకొచ్చింది.
అధికారిక వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎలా రికార్డ్ చేయాలి?
- rashtragaan.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- ఇందులో ఇంగ్లిష్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే.. తెలుగు సహా 12 రాష్ట్రీయ భాషలు కనిపిస్తాయి.
- భాషను ఎంచుకుని.. ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
- ఇక్కడ పూర్తి పేరు, వయసు, రాష్ట్రం వివరాలను నమోదు చేసుకుని.. లెట్స్ సింగ్ ఆప్షన్‌ను నొక్కాలి.
- ఇక్కడ మనకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో రికార్డు ఆప్షన్ ఎంచుకోవాలి.
- మన జాతీయ గీతాన్ని పాడి రికార్డు చేయాలి.
- రికార్డు చేశాక అప్‌లోడ్ బటన్ నొక్కాలి.
- మనకు నచ్చకపోతే రీస్టార్ట్ బటన్ ద్వారా మరోసారి రికార్డు చేసుకునే అవకాశం కూడా ఉంది.
- పార్టిసిపేట్ చేసినందుకు సర్టిఫికేట్ వస్తుంది. దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీడియోను పంచుకున్నారు.
As we commemorate 75 years of freedom, let us come together to celebrate the spirit of India 🇮🇳.
— Biplab Kumar Deb (@BjpBiplab) August 10, 2021
I have uploaded my recording of the #RashtraGaan in https://t.co/n19VJnNd2I as a part of the #AzadiKaAmritMahotsav, have you? pic.twitter.com/CFMrfe1bRx