Independence Day quotes: స్వాతంత్య్ర సమరయోధుల స్పూర్తిదాయక సూక్తులు
మన స్వాతంత్ర్య సమరయోధులు చెప్పిన ఈ స్ఫూర్తిదాయ సూక్తులను అందరితో పంచుకుందామా!
ఎన్నో పోరాటాలు.. ప్రాణాత్యాగాలతో సాధించుకున్న స్వాతంత్ర్యం ఇది. ఎందరో మహానుభావులు తమ స్ఫూర్తిదాయక నినాదాలతో యావత్ దేశాన్ని ఉద్యమం వైపుకు నడిపించారు. వారి సూక్తులు వింటే మీలో కూడా ఉద్దేజం కలుగుతుంది. రోమాలు నిక్కబొడుచుకుంటాయి.
⦿ ఇంక్విలాబ్ జిందాబాద్
- భగత్ సింగ్
⦿ మనుషులను చంపగలరేమో..
వారి ఆదర్శాలను చంపలేరు.
- భగత్ సింగ్
⦿ దేశం కోసం చనిపోయేవారు ఎల్లకాలం బతికే ఉంటారు.
- భగత్ సింగ్
⦿ విప్లవం కలహాలతో కలవలేదు.
బాంబులు, తుపాకులు విప్లవం చేయలేవు.
విప్లవం అనే కత్తికి మీ ఆలోచనలతో పదును పెట్టండి.
- భగత్ సింగ్
⦿ తిరుగుబాటు విప్లవం కాదు.
అది ముగింపునకు దారి తీయవచ్చు.
- భగత్ సింగ్
⦿ కనికరం లేని విమర్శలు, స్వతంత్ర ఆలోచనలు..
విప్లవానికి అవసరమైన రెండు విశిష్ట లక్షణాలు.
- భగత్ సింగ్
⦿ వారు నన్ను చంపవచ్చు.
కానీ నా ఆలోచనలను చంపలేరు.
నా శరీరాన్ని దహించగలరు.
కానీ నా ఆత్మను దహించలేరు.
- భగత్ సింగ్
⦿ జీవితాన్ని ప్రేమిస్తాం,
మరణాన్ని ప్రేమిస్తాం,
మేం మరణించి,
ఎర్రపూల వనంలో పూలై పూస్తాం,
ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం,
నిప్పురవ్వల మీద నిదురిస్తాం.
- భగత్ సింగ్
⦿ నువ్వు నాకు నీ రక్తాన్ని అందివ్వు,
నేను నీకు స్వాతంత్య్రం ఇస్తాను.
- సుభాష్ చంద్ర బోస్
⦿ ఇతరుల మెదళ్లను సైతం పనిచేయించేవాడే మేధావి.
- సుభాష్ చంద్రబోస్
⦿ స్వేచ్ఛలోని ఆనందాన్ని..
స్వాతంత్ర్యపు ప్రశాంతిని కోరుకుంటున్నారా?
వాటికి నువ్వు బాధ, త్యాగం చెల్లించాలి.
- నేతాజీ సుభాష్ చంద్రబోస్
⦿ దేశం కోసం చావడాని సిద్ధంగా లేనివారికి..
దేశంలో బ్రతికే హక్కు ఉండదు!
- నేతాజీ సుభాష్ చంద్రబోస్
⦿ సిద్ధాంతం కోసం ప్రాణాన్ని కోల్పోవచ్చు.
ఆ సిద్ధాంతం.. ఆ వ్యక్తి మరణం తర్వాత ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతుంది.
ఎందరికో మేలు చేస్తుంది.
- నేతాజీ సుభాష్ చంద్రబోస్
Also Read: జయహో భారత్.. ఈ దేశభక్తి కోట్స్‌తో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి
⦿ స్వేచ్ఛ నా జన్మహక్కు.
అది నేను తప్పక పొందుతాను.
- బాల గంగాధర్ తిలక్
⦿ సమస్యలు ఎదురయ్యేవి.. వనరులు లేదా సామర్థ్యం లేకపోవడం వల్ల కాదు,
సంకల్పం లేకపోవడం వల్ల.
- బాల గంగాధర్ తిలక్
⦿ దేవుడు అంటరానితనం పాటిస్తే..
నేను అతన్ని దేవుడు అని పిలవను.
- బాల గంగాధర్ తిలక్
⦿ జీవితమంటే పేకాట. సరైన కార్డును ఎంచుకోవడం మన చేతిలో ఉండదు.
కానీ చేతిలో ఉన్న కార్డులతో బాగా ఆడటం మన విజయాన్ని నిర్ణయిస్తుంది.
- బాల గంగాధర్
⦿ విజయం ద్వారా తృప్తి లభించదు.
పూర్తి ప్రయత్నమే సంపూర్ణ విజయం.
- మహాత్మా గాంధీ
⦿ ఎంత గొప్పగా జీవించావనేది నీ చేతులు చెప్పాలి.
ఎంత గొప్పగా మరణించావనేది ఇతరులు చెప్పాలి.
- మహాత్మా గాంధీ
⦿ ఈ ప్రపంచంలో నువ్వు ఆశించే మార్పు.. మొదట నీతోనే మొదలవ్వాలి.
- మహాత్మా గాంధీ
⦿ అహింసకు మించిన ఆయుధం లేదు.
- మహాత్మా గాంధీ
⦿ ఆత్మాభిమానం, గౌరవాల్ని వేరెవరో పరిరక్షించరు.
మనల్ని మనమే వాటిని కాపాడుకోవాలి.
- మహాత్మా గాంధీ
⦿ మేధావులు మాట్లాడుతారు.. మూర్ఖులైతే వాదిస్తారు.
- మహాత్మా గాంధీ
⦿ ప్రజలు చేతిలో ఆయుధాలు.. ఓటు, సత్యాగ్రహం!
- మహాత్మా గాంధీ
⦿ బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు.
క్షమించడానికి ఎంతో ధైర్యం కావాలి.
- మహాత్మా గాంధీ