HPV Vaccine: సర్వికల్ క్యాన్సర్‌కు టీకాలు రెడీ, వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా క్యాంపెయినింగ్
HPV Vaccine: వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా సర్వికల్ క్యాన్సర్‌ను అరికట్టే వ్యాక్సిన్ క్యాంపెయినింగ్‌ను చేపట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

Cervical Cancer Vaccine in India:
వచ్చే ఏడాది ఏప్రిల్‌లో..
మహిళలు ఎదుర్కొంటున్న అనారోగ్యాల్లో కామన్‌గా కనిపించేది..సర్వికల్ క్యాన్సర్. సరైన చికిత్స అందుబాటులో లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వీరందరి సమస్యకు పరిష్కారం చూపనుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే...ఈ జబ్బుకి వ్యాక్సిన్‌ను కనుగొనగా...వచ్చే ఏడాది ఏప్రిల్-మే నాటికి ఈ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. 9-14 ఏళ్ల మధ్యలో ఉన్న అమ్మాయిలకు ఈ వ్యాక్సిన్ అందించనున్నారు. దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది ప్రత్యేకంగా క్యాంపెయినింగ్ నిర్వహించి...టీకాలు అందజేయ నున్నారు. National Technical Advisory Group on Vaccination (NTAGI) ఛైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా...దీనిపై స్పందించారు. వీలైనంత త్వరగా దేశవ్యాప్తంగా టీకాలు అందించాలని చూస్తున్నట్టు వెల్లడించారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ Cervavac టీకాను తయారు చేసింది. ఒక్కో డోస్ ధర రూ.200-400 వరకూ ఉండనుంది. దీంతో పాటు సర్వికల్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ వ్యాక్సిన్ ఒక్కో డోస్ ధర రూ.2,500-3,300 వరకూ ఉండనుంది. ఇప్పటికే కొనసాగుతున్న ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్లతో పాటు ఈ సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్లనూ అందించ నున్నారు. అందుకే..9-14 ఏళ్ల బాలికలకు వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది కేంద్రం. సిక్కింలో GAVI వ్యాక్సిన్‌ను 97% మంది బాలికలకు అందించారు. రోగనిరోధక శక్తిని పెంచే వ్యాక్సిన్ ఇది. ఇకపై అందుబాటులోకి వచ్చే సర్వికల్ క్యాన్సర్ టీకాలనూ ఇదే స్థాయిలో అందరికీ అందజేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ విషయంలో సిక్కింను ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తోంది. ప్రతి పాఠశాలలోని బాలికలకు ఈ టీకా అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని వెల్లడించింది. కొవిడ్ విషయంలో ఎలాగైతే వ్యాక్సినేషన్ క్యాంపెయిన్‌లు నిర్వహించారో...అదే విధంగా ఈ టీకాలనూ అందించాలని తెలిపింది.
ప్రపంచ దేశాలకూ ఎగుమతి..
సర్వికల్ క్యాన్సర్‌కు చెక్ చెప్పే Quadrivalent Human Papillomavirus vaccine ను ఢిల్లీలో లాంచ్ చేశారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఈ టీకాను తయారు చేసింది. సెర్వావాక్ (CERVAVAC)గా పిలుచుకునే ఈ వ్యాక్సిన్‌ను పూర్తి దేశీయంగా రూపొందించారు. మొదట భారత్‌లోని మహిళలకు అందించి, తరవాత ప్రపంచ దేశాలకూ ఎగుమతి చేయనున్నారు. మొత్తం 200 మిలియన్ డోస్‌లు తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పింది సీరమ్ సంస్థ. ఈ ఏడాది జులైలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) మార్కెట్ ఆథరైజేషన్‌కు అనుమతినిచ్చింది. ఆ తరవాతే దీన్ని దేశీయంగా తయారు చేశారు. ఈ టీకాతో సర్వికల్ క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయొచ్చని ధీమాగా చెబుతోంది సీరమ్ ఇన్‌స్టిట్యూట్. భారత్‌లో మహిళలకు రొమ్ము క్యాన్సర్ తరవాత ఎక్కువగా సోకుతున్న వ్యాధి సర్వికల్ క్యాన్సర్. ఈ టీకాకి సెర్వావాక్ అని పేరు పెట్టారు.కొవిడ్ టీకా తరహాలోనే ఈ వ్యాక్సిన్‌ను కూడా రెండు, మూడు డోసులుగా తీసుకోవాలి. ఈ డోసుల మధ్య గ్యాప్ కూడా ఉండాలి అంటోంది సీరమ్. అన్ని డోసులూ తీసుకోకపోతే సర్వికల్ క్యాన్సర్ నుంచి పూర్తి రక్షణ లభిస్తుందని చెప్పలేమని సీరమ్ సంస్థ స్పష్టం చేస్తోంది.
Also Read: Iran Protesters Jailed: నిరసనలు చేసినందుకు 400 మందికి జైలు శిక్ష
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

