అన్వేషించండి

Bhupalpally News: మేడిగడ్డ ప్రాజెక్ట్‌ అక్రమాలపై కేసు వేసిన వ్యక్తి హత్య- విచారణకు ఒక్కరోజు ముందే మర్డర్‌- రేవంత్ సీరియస్‌- కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ 

Bhupalpally News: మేడిగడ్డ ప్రాజెక్ట్‌లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేసిన వ్యక్తి విచారణకు ఒక్క రోజు ముందు హత్యకు గురయ్యారు. సొంత ప్రాంతంలోనే కాపు కాసిన నలుగురు వ్యక్తులు మర్డ్ చేశారు.

Bhupalpally News: మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ భూపాలపల్లి కోర్టులో కేసు వేసిన లింగమూర్తి అనే వ్యక్తి రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. భూపాలపల్లిలోని రెడ్డి కాలనీలో రాత్రి పదిగంటల సమయంలో దుండగులు కత్తిలతో దాడి చేశారు. ఈ దాడిలో తలకు, పొట్టలో తీవ్ర గాయాలపాలైన లింగమూర్తి ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. 

పథకం ప్రకారమే లింగమూర్తి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మేడిగడ్డలో అక్రమాలు జరిగాయని కేసు వేయడంతోనే కక్ష కట్టారని అంటున్నారు. అందుకే చంపేశారని దీనికి వ్యక్తిగత కక్షలు అనే రంగు పులుముతున్నారని బోరుమంటున్నారు. 

లింగమూర్తి కేసు వేయగా కేసీఆర్, హరీశ్ రావులతోపాటు నిర్మాణ కంపానికి భూపాలపల్లి జిల్లా కోర్టు గతంలో నోటీసులిచ్చింది. ఈ కేసుపై ఇవాళ విచారణ ఉండగా ఒక్క రోజు ముందు లింగమూర్తి హత్యకు గురికావడం రాజకీయంగా దుమారం రేపుతోంది.  

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు మాజీ కౌన్సిలర్‌ నాగవెళ్లి సరళ భర్తే రాజలింగమూర్తి. గతంలో కూడా రెండు సార్లు ఆయనపై హత్యాప్రయత్నం జరిగింది. రెడ్డికాలనీకి వెళ్తున్న టైంలో కాపు కాచిన దుండగులు కత్తులతో దాడి చేసి ప్రాణాలు తీశారు. హత్య జరిగిన తర్వాత ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అత్యంత విలువైన ఎకరా భూమి విషయంలో తగాదా నడుస్తోందని ఆ నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సంజయ్, కొమరయ్యతో చాలా కాాలంగా నడుస్తున్న వివాదంలో పలుమార్లు పోలీస్ స్టేషన్‌లో కూడా పంచాయితీలు జజరిగినట్టు సమాచారం. 

దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి సీరియస్‌గా అయ్యారు. పోలీసుల వద్ద ఆరా తీసి ఏం జరిగిందో తెలుసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు సీఐడీ విచారణకు ఆదేశించే అవకాశం ఉందని సమాచారం. 

టాప్ హెడ్ లైన్స్

KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget