Google And Microsoft AI Centers In Hyderabad : తెలంగాణలో ఒకే రోజు రెండు కీలక ఒప్పందాలు- గూగుల్, మైక్రోసాఫ్ట్ ఏఐ కేంద్రాల ఏర్పాటుకు ఎంవోయు
Telangana News: తెలంగాణలో ఒకే రోజు రెండు కీలక ఒప్పందాలుచేసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గూగుల్, మైక్రోసాఫ్ట్ ఏఐ కేంద్రాల ఏర్పాటుకు ఎంవోయు కుదుర్చుకుంది.

Telangana News: తెలంగాణకు గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ కేంద్రంగా ఏఐ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే రోజు మైక్రోసాఫ్ట్‌తో కూడా తెలంగాణ ప్రభుత్‌వం ఒప్పందం చేసుకుంది.
హైదరాబాద్‌లో ఏఐ కేంద్రం ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో గూగుల్ ఎంవోయూ కుదుర్చుకుంది. టీ హబ్‌లో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సమక్షంలో గూగుల్ సంస్థ ప్రతినిధులు ఒప్పందాలు చేసుకున్నారు. అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. వ్యవసాయం, విద్య, రవాణ రంగం, ప్రభుత్వ డిజిటల్ కార్యకలాపాలకు ఈ గూగుల్ ఏఐ కేంద్రం బాగా సహకరిస్తుందని ఈ సందర్భంగా నేతలు అభిప్రాయపడ్డారు.
Google has entered into a strategic collaboration with the Government of Telangana to harness the power of Artificial Intelligence across key sectors such as agriculture, mobility, education, sustainability, and governance.
— Telangana CMO (@TelanganaCMO) February 13, 2025
The partnership, formalized through a Memorandum of… pic.twitter.com/lmFpniksb0
Also Read: కేసీఆర్ రీ ఎంట్రీకి ఫిబ్రవరి 19న ముహుర్తం - తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం - ఇక సమరమే !
ఇదే రోజు మైక్రోసాఫ్ట్ నూతన భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐ సెంటర్ ఏర్పాటుకు ఆ సంస్థతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. కొత్త మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీని ప్రారంభించుకోవడం మనందరికీ గర్వకారణంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయిగా అభివర్ణించారు. మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందని తెలిపారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకుందని గుర్తు చేశారు.
"హైదరాబాద్ నుంచి గ్లోబల్ ఇన్నోవేషన్, ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయి. ఇది యువతకు మరింత సాధికారత కల్పిస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను." అని రేవంత్ కామెంట్స్ చేశారు.
భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే.
మైక్రోసాఫ్ట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏఐ ఫౌండేషన్ అకాడమీతో కూడిన ADVANTA(I) GE TELANGANA ను ప్రారంభించడంలో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ భాగస్వామ్యంతో తెలంగాణ, మైక్రోసాఫ్ట్ 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెట్టడంతోపాటు గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించనున్నాయి.
ఈ పెట్టుబడి స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతం చేయడంతోపాటు మెంటార్షిప్, ఏఐ టూల్స్, గ్లోబల్ నెట్వర్క్ యాక్సెస్ ఇస్తుందన్నారు సీఎం. మా ప్రభుత్వ సహకారంతో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేస్తుందని గర్వంగా చెబుతున్నా అని అన్నారు.
ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ గచ్చీబౌలీలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన కొత్త క్యాంపస్ భవనాన్ని ముఖ్యమంత్రి @revanth_anumula గారు ప్రారంభించారు. 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన ప్రమాణాలతో నిర్మించిన ఈ భవనంలో 2,500 మంది ఉద్యోగులు పనిచేయడానికి… pic.twitter.com/sYAig9LYq7
— Telangana CMO (@TelanganaCMO) February 13, 2025
Also Read: మంచు మోహన్ బాబుకు భారీ ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
ఇప్పుడు ప్రారంభించిన సెంటర్ ఏఐ నాలెడ్జ్ హబ్ సహా క్లౌడ్ ఆధారిత ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుందన్నారు సీఎం. తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ లీడర్ షిప్ టీమ్‌కు రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. ఆవిష్కరణల పట్ల మీ నిబద్ధత మా తెలంగాణ రైజింగ్ విజన్‌కు తోడవుతుందని అభిప్రాయపడ్డారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

