అన్వేషించండి

KCR Re Entry: కేసీఆర్ రీ ఎంట్రీకి ఫిబ్రవరి 19న ముహుర్తం - తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం - ఇక సమరమే !

Telangana: 19వ తేదీన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారు. ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యచరణ ఖరారు చేసుకునే అవకాశం ఉంది.

KCR calls wide scale meeting of BRS On the 19th:  భారత రాష్ట్ర సమితి  చీఫ్ కేసీఆర్ మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అయ్యేందుకు  రెడీ అయ్యారు. ఈ నెల 19 వ తేదీన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రకార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. ఈ మేరకు  పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కె.టి.రామారావు కు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అధినేత ఆదేశాల మేరకు...ఈనెల 19 వ తేదీన మధ్యాహ్నం 1 గంటనుండి హైద్రాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో పార్టీ విస్త్రృత స్థాయి సమావేశం జరగనున్నది. 

ప్రత్యేక కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు          

అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన  పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్థుత మరియు మాజీ... ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పోరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు,డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు...పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలతో కూడిన విస్తృతస్థాయి సమీక్షా సమావేశం జరుగుతుందని కేటీఆర్ తెలిపారు. ఈ నెల 19 న  నిర్వహించే ప్రత్యేక సమావేశంలో, బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృతస్థాయిలో చర్చించారు.          

ప్రభుత్వపై పోరాటానికి యాక్షన్ ప్లాన్           

రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలమీద ప్రధానంగా చర్చ జరగున్నది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అనుగుణంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేపట్టవలసిన కార్యాచరణ పై సమగ్ర చర్చ జరగనుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించుకుంటూ, తమ హక్కులను తాము కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ నాయకత్వం కార్యకర్తలు శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు విధానాల పై  ఈ విస్తృతస్థాయి సమీక్షా సమావేశంలో చర్చించనున్నారని కేటిఆర్ తెలిపారు.  సమగ్ర చర్చ జరిపి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే కీలక సమావేశం కాబట్టి ఆహ్వానితులందరూ హాజరుకావాలని కెటిఆర్  సూచించారు.                    

ఇక కేసీఆర్ యాక్టివ్ అవుతారా ?             

పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు.  పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఎప్పుడైనా పార్టీ నేతలు వస్తే వారితో సమావేశమై.. త్వరలోనే  కార్యాచరణ అమలు చేస్తారమని.. ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిద్దామని సూచించేవారు. ఇప్పుడు సమయం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఓ భారీ బహిరంగసభను నిర్వహించాలని కేసీఆర్ అనుకుంటున్నారు . ఆ తేదీని కూడా ఖరారు చేసే అవకాశం ఉంది.     

Also Read: మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు

 

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay: పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
Ashada Bonalu: పాతబస్తీలో అంబరాన్నంటిన బోనాల జాతర.. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
పాతబస్తీలో అంబరాన్నంటిన బోనాల జాతర.. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget