Telangana News: గేదెపై లోనుకు గేటు జప్తు- ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం
Telangana News: గేదె కోసం తీసుకున్న లోను చెల్లించలేదని గేటును జప్తు చేశారు బ్యాంకు అధికారులు. దీనిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు.

Telangana News: జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలో బ్యాంకు అధికారుల చర్య వివాదాస్పదమవుతోంది. గేదెలు కొనేందుకు తీసుకున్న అప్పు ఈఎంఐ చెల్లించలేదని ఇంటి గేటును బ్యాంకు అధికారులు జప్తు చేశారు. దీనిపై బీఆర్‌ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రేవంత్ రెడ్డి ఇంటికి అలా వెళ్లగలరా అని నిలదీస్తోంది.
ఏడునూతల గ్రామంలో మహిళలు గ్రూపుగా ఏర్పడి గేదెలు కొనుగోలు చేశారు. విజయ డెయిరీ ఆధ్వర్యంలో డీసీసీబీ స్టేషన్‌ఘన్‌పూర్ బ్రాంచ్ నుంచి గేదెల కోసం 2021లో లోన్ తీసుకున్నారు. ఒక్కొక్కరు రూ.87వేల చొప్పున అప్పు తీసుకున్నారు. ఈ లోన్‌కు నెలకు నాలుగు వేల రూపాయలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంది.
కొన్ని నెలలు బాగానే ఈఎంఐ చెల్లించారు. కానీ గేదెలు పాలు ఇవ్వడం మానేయడంతో ఈఎంఐలు చెల్లించలేకపోయారు. దీనిపై స్పందించిన బ్యాంకు మహిళలకు నోటీసులు పంపించింది. ఈ నోటీసులకు స్పందించిన కొందరు డబ్బులు చెల్లించారు. చెల్లించలేని వాళ్లను డిఫాల్టర్‌లుగా తేల్చారు.
Also Read: కేసీఆర్ రీ ఎంట్రీకి ఫిబ్రవరి 19న ముహుర్తం - తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం - ఇక సమరమే !
లోన్ ఇంకా చెల్లించని మద్దెబోయిన కళమ్మ ఇంటికి వచ్చిన బ్యాంకు అధికారులు ఇంటి గేట్లు తీసుకెళ్లిపోయారు. అలా గేట్లు తీసి ట్రాక్టర్‌లో వేయడం వైరల్‌గా మారింది.
దీనిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. లోన్‌లు కట్టకపోతే ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో ఇలాంటి దుస్థితి ప్రజలకు వచ్చిందని కామెంట్స్ చేశారు. రెండు లక్షల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. మాట తప్పిన సీఎం పై చర్యలు తీసుకునే ధైర్యం అధికారులకు ఉందా అని నిలదీశారు. రేవంత్‌పై ఇలా దౌర్జన్యం చేయగలరా అని కామెంట్స్ చేశారు.
Also Read: తెలంగాణలో ఒకే రోజు రెండు కీలక ఒప్పందాలు- గూగుల్, మైక్రోసాఫ్ట్ ఏఐ కేంద్రాల ఏర్పాటుకు ఎంవోయు
అధికారులు, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రజలు, రైతులు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నార. కచ్చితంగా కాంగ్రెస్ నాయకులను తమ ఇంటి గేటు కూడా తాకనివ్వబోరని వార్నింగ్ ఇచ్చారు.
"రుణం కట్టలేదని.. ఇంత దారుణమా ?
నాటి కాంగ్రెస్ పాలనలో..
అన్నదాతలు అప్పు కట్టలేదని..
ఆడబిడ్డల పుస్తెలు లాక్కెళ్లే దుస్థితి..
రైతుల ఇళ్ల దర్వజాలు తీసుకెళ్లే పరిస్థితి..
కరెంట్ మోటర్లు, స్టార్టర్లు తీసుకెళ్లే దైన్యస్థితి..
స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..
మళ్లీ ఆనాటి దృశ్యాలు కళ్లముందుకు తెచ్చింది..
కష్టాల్లో ఉన్న పాడి రైతు లోన్ కట్టలేదని..
ఏకంగా ఇంటికి ఉన్న గేటును ఎత్తుకెళతారా ?
మరి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని..
మాటతప్పిన ముఖ్యమంత్రిపై చర్య తీసుకునే ధైర్యముందా ?
రుణం తీర్చలేదని రైతుపై చూపిన ప్రతాపాన్ని..
రుణమాఫీ చేయని రేవంత్ పై చూపించగలరా ?
పేద రైతుకు ఒక న్యాయం..
పదవిలో ఉన్న వారికి మరో న్యాయమా..??
గుర్తుపెట్టుకోండి..
రైతులు అంతా గమనిస్తున్నారు..
ఇలాంటి ఘోరాలను చూస్తూ ఊరుకోరు..
కాంగ్రెస్ నేతల్ని ఇంటి గేటు కూడా తొక్కనియ్యరు !!"
రుణం కట్టలేదని.. ఇంత దారుణమా ?
— KTR (@KTRBRS) February 13, 2025
నాటి కాంగ్రెస్ పాలనలో..
అన్నదాతలు అప్పు కట్టలేదని..
ఆడబిడ్డల పుస్తెలు లాక్కెళ్లే దుస్థితి..
రైతుల ఇళ్ల దర్వజాలు తీసుకెళ్లే పరిస్థితి..
కరెంట్ మోటర్లు, స్టార్టర్లు తీసుకెళ్లే దైన్యస్థితి..
స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..
మళ్లీ… pic.twitter.com/NzJlFk7zA9
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

