అన్వేషించండి

Andhra Pradeh BirdFlu: బర్డ్ ఫ్లూ భయం లేదు - ఉడికించిన గుడ్లు, చికెన్ తినొచ్చు - ఏపీ సర్కార్ కీలక ప్రకటన

Achennaidu: బర్డ్ ఫ్లూ పై ఆందోళన చెందాల్సిన పనిలేదని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. భయం లేకుండా బాగా ఉడికించిన గ్రడ్లను, మాంసాన్ని నిరభ్యంతరంగా తినవచ్చని తెలిపిది.

AP Government has made a key statement on the fear of bird flu:  బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలు భయపడాల్సిన పని లేదని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ బర్డ్   ఫ్లూ నియంత్రణకు పటిష్టమైన చర్యలను చేపట్టిందని ప్రకటించారు.  బర్డ్ ఫ్లూ  సమస్య పై  రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారని అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ జాయింట్ సెక్రటరీతో పాటు బోపాల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆప్ హైసెక్యురిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్ శాస్త్రవేత్తలతో కూడా చర్చించారని తెలిపారు.  కేంద్ర నుండి ఇప్పటికే  పలు బృందాలు రాష్ట్రానికి  వచ్చాయని, కేంద్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ జాయింట్ సెక్రటరీ కూడా శుక్రవారం రాష్ట్రానికి రానున్నారని ఆయన తెలిపారు.

ఎటువంటి భయం లేకుండా చికెన్ తినవచ్చు !    

బర్డ్ ఫ్లూ విషయంలో  ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎటు వంటి భయం లేకుండా  బాగా ఉడికించిన గ్రడ్లను, మాంసాన్ని నిరభ్యంతరంగా  తినవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో పలు మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు వార్తలు, సమాచారం వల్ల ప్రజలు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ప్రజలు బయాందోళనలకు గురయ్యేలా బర్డ్ ప్లూ పై తప్పుడు వార్తలు, సమాచారాన్ని వ్యాప్తి చేసేవారి పై  కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. 

బర్డ్ ఫ్లూ బయటపడిన చోట్ల బయో సెక్యూరిటీ జోన్లు

 ఏలూరు జిల్లా బాదంపూడి, పశ్చిమగోదావరి జిల్లా వేల్పూరు, కానూరు మరియు కృష్ణా జిల్లా గంపలగూడెం  ప్రాంతాల్లోని ఐదు ఫ్రౌల్ట్రీల్లో ఈ వ్యాది సోకినట్లుగా  గుర్తించి ఆయా ప్రాంతాలను బయో సెక్యురిటీ జోన్లుగా ప్రకటించి, అధికారులను, సిబ్బందిని ఆయా ప్రాంతాలకు పంపించి వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలను చేపట్టడం జరిగిందన్నారు.  ఈ బర్డ్ ప్లూ వ్యాప్తి నియంత్ర్రణకై కేంద్ర ప్రభుత్వం కూడా  మార్గదర్శకాలను జారీ చేయడం జరిగిందన్నారు. ఈ మార్గదర్శకాల ప్రకారం వ్యాధి సోకిన ప్రాంతానికి ఒక కిలోమీటరు పరిధిలో రాకపోకలను,  దాణా రవాణాను నియంత్రిస్తున్నామని, ఒక ఫౌల్ట్రీ కూడా లేకుండా చూస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఒకటి నుండి తొమ్మిది కిలోమీటర్ల పరిధిలో ముందస్తు జాగ్రత్తలను కూడా తీసుకుంటున్నామన్నారు. 

ఇంకెక్కడా ఫ్లూ లేదు !

ఇప్పటికి బయటపడిన చోట్ల తప్ప ఇతర ప్రాంతాల్లో ఈ వ్యాధి సోకిన దాఖలాలు ఇప్పటి వరకూ  ఏమీ కనిపించలేదని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, పశు సంవర్థక శాఖ, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని అచ్చెన్న తెలిపారు. సైబీరియన్ వలస పక్షులు రెట్టల వల్ల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ బర్డ్ ప్లూ వ్యాప్తి చెందిందvf రాష్ట్ర పశు సంవర్థక శాఖ సంచాలకులు డా.టి.దామోదర నాయుడు తెలిపారు. ఇప్పటి వరకూ 14 వేల కోళ్లను కాల్చేశామని.. మరో రెండు మూడు ఫౌల్ట్రీలో 1.40 లక్షల కోళ్ల వరకూ ఉన్నాయని, వాటిని కూడా కాల్చేస్తున్నామన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Venezuela : వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
Hyundai Creta నుంచి Tata Sierra వరకు - కొత్త Seltos ముందు బలంగా నిలబడే కారు ఏది?
కొత్త Kia Seltos - ధర, స్పెసిఫికేషన్లలో ఇతర కార్ల కంటే బెటర్‌గా ఉందా?
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Embed widget