Viral news: తాగుబోతు పైగా అప్పుల అప్పారావు - భార్య ఇచ్చిన షాక్‌తో ఒంటరైపోయాడు !
Patna: పాట్నాలో ఓ మహిళ పెళ్లి చేసుకుంది. అందులో వింతేమీ లేదు కానీ అప్పటికే ఆమెకు పెళ్లయింది. అక్కడే ఉంది అసలు ట్విస్ట్.

Fed up with Alcoholic Abusive Husband Woman Marries Agent Come Home for Loan Repayment: తాగుబోతు భర్తలను భరించడం ఏ మహిళకైనా కష్టమే. చాలా మంది అలా పడి ఉంటారు కానీ..తన జీవితం ఎందుకు అలా అయిపోవాలని ఓ మహిళ అనుకుంది. అయితే ఆమె ఎవర్ని చూసుకుంటుంది. అందుకే తన ఇంటికి వచ్చే వారిలోనే పెళ్లి కాని ఒకరితో పరిచయం పెంచుకుంది. ఓ మంచి ముహుర్తం చూసుకుని మత్తులో జోగుతున్న భర్తకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపు భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది.
బీహార్ లోని పాట్నాలో నకుల్ శర్మ, ఇంద్రా కుమారి అనే ఇద్దరికి మూడేళ్ల క్రితం పెళ్లి అయింది. ఇంద్రా కుమారి ఎన్నో ఆశలతో మెట్టినింట అడుగు పెట్టింది. అయితే భర్త పచ్చి తాగుబోతు అని కొద్ది రోజులకే తెలిసింది. పనీ పాటా లేకుండా తిరగడం.. అప్పులు చేసి తాగడం అతని హాబీ. మూడేళ్ల పాటు భరించింది. ఇక అతనితో జీవితం తన వల్ల కాదు అనుకుంది. అందుకే తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలని అనుకుంది.
Also Read: తాగినంత లిక్కర్ ఫ్రీ - హ్యాంగోవర్ వస్తే లీవ్ కూడా - ఈ జపాన్ కంపెనీని దేవుడే పెట్టించి ఉంటాడు!
बिहार के जमुई में एक अजीबोगरीब प्रेम कहानी घटी है। शराबी पति से तंग आकर एक महिला ने बैंक कर्मचारी से लोन लिया। लोन की किस्त चुकाते वक्त उसे उससे प्यार हो गया और फिर दोनों ने शादी कर ली। pic.twitter.com/v4P6Pfwd61
— UMESH YADAV 🕉 (@Umesh_Yadav_93) February 13, 2025
ఆ తాగుబోతు భర్త ఎక్కడ ఉన్నాడో కానీ.. మత్తు దిగే సరికి తన భార్యను అప్పు వసూలు కోసం వచ్చే వ్యక్తి తీసుకెళ్లిపోయాడని తెలుసుకుని మరింత ఎక్కువ తాగేసి పడుకుని ఉంటాడు.
Also Read: ప్రభుత్వ ఉద్యోగం రాగానే భర్తను వదిలేసింది - ఆ భర్త ఉద్యోగం పోయేలా చేశాడు - టిట్ ఫర్ టాట్ !
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

