Viral: తాగినంత లిక్కర్ ఫ్రీ - హ్యాంగోవర్ వస్తే లీవ్ కూడా - ఈ జపాన్ కంపెనీని దేవుడే పెట్టించి ఉంటాడు!
Booze breaks: పని మధ్యలో టీ తాగడానికి వెళ్తేనే చిరాకుపడే బాసులు ఉంటారు. కానీ మద్యం తాగి రండి అని పంపే ఆఫీసులు ఉంటాయా.. ఎక్కవ తాగేస్తే సెలవు తీసుకోండి అని చెప్పే కంపెనీ ఉంటుందా?

Booze breaks hangover leave Japans IT firm is redefining work culture : తాగి ఆఫీసుకు వెళ్లే వాళ్లను సెక్యూరిటీ వాళ్లు ఆపేస్తారు. వాళ్లు హెచ్‌ఆర్‌కు ఫిర్యాదు చేస్తే .. ఈ మెయిల్‌లోనే సెటిల్మెంట్ కూడా పంపిస్తారు. ఇదంతా సంప్రదాయ కంపెనీలు చేసే పనులు. కానీ జపాన్ లోని ఓ ఐటీ కంపెనీ మాత్రం.. యాభై ఏళ్లు ముందుగా ఆలోచిస్తోంది. కంపెనీలోనే లిక్కర్ ఇస్తామని..తాగినంత తాగొచ్చని ఆఫర్ ఇస్తోంది. ఒక వేళ ఎక్కువ తాగేసి హ్యాంగోవర్ తెచ్చుకుంటే మజ్జిగల్లాంటివి కూడా ఇస్తుంది. అప్పటికీ తగ్గకపోతే లీవ్ పెట్టుకుని రెస్టు తీసుకోవచ్చట. ఏంటి ఇదంతా నిజమేనా అని ఆశ్చర్యపోకండి. పచ్చి నిజం.
జపాన్ లో ట్రస్ట్ రింగ్ అనే ఐటీ కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఉద్యోగులకు ఈ ఆఫర్ ఇచ్చింది. ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. అందరూ తాగేసి సెలవు పెడితే ఎలా అని అనుకోవడం లేదు. అమలు చేస్తోంది. దీంతో ఉద్యోగులు ఈ వెసులుబాటును పక్కాగా ఉపయోగించుకుంటున్నారు. మరి ఈ కంపెనీలో పనులు ఎవరు చేస్తారు.. అందరూ తాగేసి తొంగుంటే.. ట్రస్ట్ రింగ్ కాదు.. రింగా రింగా అనుకోవావల్సిందే కదా అన్న కామెంట్లు వస్తున్నాయి. అయితే కంపెనీ యాజమాన్యం అంత తెలివి తక్కువదా అనే సందేహాలు చాలా మందికి వస్తాయి.
నిజానికి జపాన్ లో పని సంస్కృతి ఎక్కువగా ఉంటుంది. వద్దన్నా పని చేస్తారు . అలా బాగా పని చేసే వారికి ఇతర కంపెనీలు మంచి ఆఫర్లు ఇస్తాయి. ట్రస్ట్ రింగ్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులు వలసపోతున్నారు. ఈ పరిస్థితిని నివారించడం ఎలాగో ఆ కంపెనీకి అర్థం కాలేదు. వారు ఆశిస్తున్నట్లుగా పే హైక్ ఇవ్వలేమని.. కానీ ఆ ఉద్యోగుల్ని తమతోనే ఉంచుకోవాలని అనుకున్నారు . పని మధ్యలో నిద్రపోయే చాన్స్స దగ్గర నుంచి చాలా సౌకర్యాలను ఆలోచించారు.కానీ అవన్నీ అన్ని కంపెనీల్లో ఉండేవే. కొత్తగా మన కంపెనీలో ఏమిద్దామా అని ఆలోచించి ఈ లిక్కర్ పాలసీ తీసుకు వచ్చారు.
ఈ పాలసీ తీసుకు వచ్చిన తర్వాత మద్యం తాగిన ఉద్యోగాలు చక్కగా పడుకుని రిఫ్రెష్డ్ గా ఉద్యోగానికి వస్తున్నరట. అంతే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారు. అదే సమయంలో కంపెనీ నుంచి వెళ్లిపోయే వారి సంఖ్య కూడా తగ్గిపోయిందట. ఇది చాలా మంచి విధామని ట్రస్ట్ రింగ్ సంబర పడిపోతోంది.
అయితే ఇలాంటి ఆఫర్లు మన దేశంలో అసలు వర్కవుట్ కావు . ఎందుకంటే ఉద్యోగాలు రోజూ ఉదయం వచ్చేసి.. తాగేసి.. హ్యాంగోవర్ తీసుకుంటారు. దాంతో ఆ కంపెనీ దివాలా తీస్తుంది. కానీ జపాన్ లో మాత్రం వర్కవుట్ అవుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

