అన్వేషించండి

Donald Trump: అదానీకి ట్రంప్ సూపర్ గుడ్ న్యూస్ - ఆ కేసుల విచారణలన్నీ నిలిపివేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్

Gautam Adani case : అమెరికా నుంచి అదానీకి చల్లని కబురు వచ్చింది. విదేశీ అవినీతి పద్ధతుల చట్టం కింద విచారణలను నిలిపివేస్తూ డోనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.

Donald Trump halts US enforcement of law banning overseas bribes: అమెరికాలో నమోదైన కేసుతో అనేక సమస్యలు ఎదుర్కొన్న అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్ అదానీకి ట్రంప్ ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తో రిలీఫ్ కల్పించారు. విదేశీ సంస్థలకు సంబంధించి లంచం ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికన్లపై విచారణను నిలిపివేయాలని న్యాయ శాఖను ఆదేశిస్తూ  కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వుల కారణంగా ఫారిన్ కరపక్షన్ ప్రాక్టిసెస్స యాక్ట్ (FCPA) అమలు నిలిచిపోయింది. కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేయాలని అటార్నీ జనరల్ ను ట్రంప్ ఆదేశించారు.                    
 
అదానీ గ్రూప్ FCPA చట్టాన్ని ఉల్లంఘించిందా లేదా అనే దానిపై అమెరికా న్యాయ శాఖ పరిశీలన జరుపుతోంది. ట్రంప్ ఉత్తర్వుల వల్ల అదానీపై కేసు బలహీనపడుతుందని అమెరికా న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ , ఇతర సీనియర్ అదానీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్‌లు భారత్ లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలకు లంచాలు ఇచ్చి అధిక ధరకు విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారు. ఇందు కోసం 265 మిలియన్ డాలర్లు లంచం ఇచ్చినట్లుగా తేల్చారు. అదే సమయంలో కంపెనీ  భారీగా లాభాలు వస్తాయని చెప్పి అమెరికా కంపెనీల నుంచి పెట్టుబడిని సేకరించింది. ఇది అమెరికా ఫెడరల్ సెక్యూరిటీస్ చట్టం ప్రకారం మోసం అని గుర్తించి కేసులు పెట్టారు.                   

అదానీ గ్రీన్ ఒడిశా,  ఆంధ్రప్రదేశ్,  తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ , జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకుంది. ఆ సమయంలో ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు ఇచ్చారని యూఎస్ ఎఫ్‌బీఐ తెలిపింది. ఏపీ సీఎం జగన్‌కు అందులో పెద్ద మత్తంలో లంచాలు అందినట్లుగా ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిని ఆయన ఖండించారు. తమ ప్రభుత్వం అదానీతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదన్నారు. లంచాల వ్యవహారం అంతా ఇండియాలో జరిగింది. అధిక ధరలకు ఒప్పందాలు చేసుకుని వాటిని చూపించి ఇక్కడ లాభాలు పొందారని కేసు అందుకే అమెరికాలో కేసులను నమ్మెదించే అవకాశం ఉంది.  కార్యనిర్వాహక ఉత్తర్వు ప్రకారం , FCPA కింద  కొత్త మార్గదర్శకాలను జారీ చేసే వరకు విచారణ నిలిచిపోనుంది.                      

ట్రంప్ చేసిన పని మంచా కాదా అన్న విషయం పక్కన పెడితే అదాని గ్రూపునకు ఇది మంచి విషయం అనుకోవచ్చు.  అమెరికా కేసు వల్ల అదానీ గ్రూపు షేర్ వాల్యూ చాలా పడిపోయింది. ఇప్పుడు ఆయనకు గుడ్ న్యూస్ అందడం వల్ల మేలు జరిగే అవకాశం ఉంది. గతంలో హిండెన్ బెర్గ్ వల్ల కూడా ఆయన భారీగా నష్టపోయారు. ఆ సంస్థను కూడా మూసివేశారు.         

Also Read: సునామీ వచ్చినప్పుడు కాపాడారు - 20 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడి పెళ్లి చేశారు - మనసున్న మారాజు ఈ ఐఏఎస్ ఆఫీసర్ !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
Vijayasai Reddy CID:  విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
Voter Card: ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
Betting apps case: బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారికి మరో షాక్ - ఈడీ కూడా రంగంలోకి !
బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారికి మరో షాక్ - ఈడీ కూడా రంగంలోకి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Return to Earth | భగవద్గీత గణేశుడి విగ్రహం..సునీతా విలియమ్స్ ధైర్యం వెనుక కొండంత అండCase Filed Against Influencers in Betting App Case | ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ?MS Dhoni Add With Sandeep Reddy Vanga | ధోనితో యానిమల్ రీ క్రియేట్ చేసిన VanGOD | ABP DesamSunita Williams Return to Earth Un Docking Success | స్పేస్ స్టేషన్ నుంచి బయల్దేరిన సునీత | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
Vijayasai Reddy CID:  విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
Voter Card: ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
Betting apps case: బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారికి మరో షాక్ - ఈడీ కూడా రంగంలోకి !
బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారికి మరో షాక్ - ఈడీ కూడా రంగంలోకి !
SC Classification Bill: ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం - రిజర్వేషన్లు పెంచుతామని సీఎం రేవంత్ హామీ
ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం - రిజర్వేషన్లు పెంచుతామని సీఎం రేవంత్ హామీ
YS Sharmila : వైఎస్ఆర్ పేరు తీసేయడంపై షర్మిల ఆగ్రహం - ఎన్టీఆర్ విజయవాడ అని పేరు పెట్టుకోవచ్చుగా అని విమర్శలు
వైఎస్ఆర్ పేరు తీసేయడంపై షర్మిల ఆగ్రహం - ఎన్టీఆర్ విజయవాడ అని పేరు పెట్టుకోవచ్చుగా అని విమర్శలు
Harish Rao News: ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంది - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంది - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Seema Haider:  ఆడపిల్లకు జన్మనచ్చిన సీమా హైదర్- శుభాకాంక్షలు చెబుతున్న నెటిజన్లు
ఆడపిల్లకు జన్మనచ్చిన సీమా హైదర్- శుభాకాంక్షలు చెబుతున్న నెటిజన్లు
Embed widget