Rajasthan News: ప్రభుత్వ ఉద్యోగం రాగానే భర్తను వదిలేసింది - ఆ భర్త ఉద్యోగం పోయేలా చేశాడు - టిట్ ఫర్ టాట్ !
Wife And husband: తనకు ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందని ఓ భార్య తన భర్తను వదిలేసింది. ఆ భార్య నిరాశపడకుండా ఆమె ఉద్యోగాన్ని ఊడగొట్టించాడు.

Rajasthan woman dumps husband after getting govt job then comes husbands sweet revenge: భార్యభర్తల మధ్య బంధం డబ్బుకు అతీతమైనది. కానీ డబ్బుతో కొలుచుకుంటే మాత్రం ఎక్కువ కాలం కలసి ఉండలేరు. కొన్ని కొన్ని సార్లు విచిత్రమైన కేసులు వెలుగులోకి వస్తూ ఉంటాయి. అలాంటిదే ఇది.
భార్య ఉద్యోగం కోసం కష్టపడిన భార్య
రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాలో మనీష్, మీనా భార్య భర్తలు, మనీష్ పెద్దగా చదువుకోలేదు. మీనా కొద్దిగా చదువుకుంది. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం చేయాలని కోరిక. అందుకే తన అర్హతకు తగ్గ ఉద్యోగాల కోసం ఆమె ప్రయత్నించారు. భార్య కోసం మనీష్ కూడా గట్టిగా ప్రయత్నించారు. ఇద్దరి కృషి ఫలించి మీనాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. రైల్వేలో ఉద్యోగం రావడంతో ఆమె సంతోషపడింది.
ఉద్యోగం రాగానే భర్త నిరుద్యోగి అని వదిలేసిన భార్య
అయితే ఇక్కడో ట్విస్ట్ చోటు చేసుకుంది . అదేమిటంటే మీనాకు ఉద్యోగం వచ్చేలా చేసిన.. మనీష్ నిరుద్యోగిగానే ఉన్నాడు. దాంతో తాను గవర్నమెంట్ ఉద్యోగినని.. తన భర్త నిరుద్యోగి అని.. ఆతనితో కలిసి ఉండాల్సిన అవసరం లేదనుకుంది. వదిలేసి వెళ్లిపోయింది. ఈ పరిణామంతో మనీష్ షాక్‌కు గురయ్యాడు. అయితే కుమిలిపోలేదు. తాను చేయాలనుకున్నది చేశాడు. ఏం చేయాలనుకున్నాడు అంటే.. తనను వదిలేసిన బార్యను మళ్లీ నిరుద్యోగిగా చేయాలనుకున్నాడు. చేశాడు కూడా.
నిజం చెప్పి భార్య ఉద్యోగాన్ని ఊడగొట్టించిన భర్త
మీనా సక్రమ పద్దతిలో ఉద్యోగం సంపాదించలేదని ఆమెకు బదులుగా మరొకరితో పరీక్ష రాయించి ఉద్యోగం తెచ్చుకుందని రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన రైల్వే అధికారులు అది నిజమేనని తేల్చి ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. అసలు మనీషే.. మీనాకు అలా వేరే మహిళను ఎగ్జామ్ రాయడానికి పెట్టి మీనాకు ఉద్యోగం వచ్చేలా ఖర్చు చేసారు. ఇద్దరూ కలిసి ఈ ఉద్యోగం కోసం చేయకూడని స్కామ్ చేశారు. అంతా తేలిసి కూడా ఆ భార్య.. తన భర్తను వదిలిసి వెళ్లిపోయింది.
ఇప్పుుడు మళ్లీ ఇద్దరూ నిరుద్యోగులే
ఇప్పుడు మీనా నిరుద్యోగి. ఇకా చెప్పాలంటే ఆమె రైల్వేను మోసం చేసినందుకు కేసులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. తన భ ర్త నిరుద్యోగి అని హేళన చేసి.. ఆమె వెళ్లిపోయింది. ఆ భర్త తన భార్యను మళ్లీ నిరుద్యోగిగా నిలబెట్టాడు. మొత్తానికి ఇద్దరూ ఇద్దరే అని సోషల్ మీడియాలో నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
Also Read: తాగినంత లిక్కర్ ఫ్రీ - హ్యాంగోవర్ వస్తే లీవ్ కూడా - ఈ జపాన్ కంపెనీని దేవుడే పెట్టించి ఉంటాడు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

