అన్వేషించండి
Advertisement
Budget 2024 Highlights: ఆయుష్మాన్ భారత్ నుంచి ఆదాయపు పన్ను వరకూ - బడ్జెట్ టాప్ హైలైట్స్ ఇవే
Budget 2024 Highlights in Telugu: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ప్రధానాంశాలివే.
Interim Budget 2024 Highlights: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మధ్యంతర బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ పద్దులో ఎక్కువగా మౌలిక వసతులపైనే దృష్టి సారించారు. ఆ తరవాత పేదలు, మహిళలు, యువత లక్ష్యంగా కీలక ప్రకటనలు చేశారు. సంక్షేమ పథకాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. ఆదాయపు పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవని తేల్చి చెప్పారు. రూ.7 లక్షల ఆదాయం వరకూ పన్ను మినహాయింపు ఉంటుందని వెల్లడించారు.
- బడ్జెట్ హైలైట్స్ ఇవే..
- ఆదాయ పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూ.7 లక్షల వరకూ పన్ను మినహాయింపు ఉంటుందని తెలిపారు.
- దేశవ్యాప్తంగా మరి కొన్ని మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం చొరవ చూపుతుందని తెలిపారు.
- పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేసినట్టు వెల్లడించారు. తమ ప్రభుత్వం గవర్నెన్స్, డెవలప్‌మెంట్, పర్‌ఫార్మెన్స్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్టు స్పష్టం చేశారు.
- పంట బీమా కింద 4 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని నిర్మలా సీతారామన్ వివరించారు.
- ఆర్థిక వృద్ధి రేటు పెరగడంతో పాటు ద్రవ్యోల్బణం తగ్గినట్టు తెలిపారు.
- రక్షణ రంగంలో టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచేలా కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించారు.
- దేశవ్యాప్తంగా అర్హులైన కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని కీలక ప్రకటన చేశారు.
- అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకూ ఆయుష్మాన్ భారత్ పథకం వర్తిస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
- మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే కొత్త హౌజింగ్ స్కీమ్‌ని ప్రవేశపెడతామని వివరించారు.
- 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చడమే లక్ష్యం అని కేంద్రం ప్రకటించింది.
- వచ్చే ఐదేళ్లలో భారత్ అనూహ్య రీతిలో ఆర్థిక వృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు నిర్మలా సీతారామన్. ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే భారత్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు.
-
రానున్న ఐదేళ్లలో అర్హులకు 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామని, ఇప్పటికే 3 కోట్ల ఇళ్లు నిర్మించామని తెలిపారు.
-
స్వయం సహాయక బృందాలు మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తున్నాయని వెల్లడించారు. వీటి ద్వారా కోటి మంది మహిళలు లక్షాధికారులయ్యారని తెలిపారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion