Kadapa DTC : తన్నించుకుని మరీ బదిలీ అయ్యాడు - కడప మహిళా బ్రేక్ ఇన్స్‌పెక్టర్‌తో డీటీసీ అసభ్య ప్రవర్తన !
Crime News: మహిళా ఉద్యోగిని వేధించిన కడప డీటీసీని బదిలీ చేశారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఉద్యోగుల్ని వేధిస్తూ చూస్తూ ఉరుకునేది లేదన్నారు.

Kadapa DTC suspended for harassing a female employee : కడప జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన మహిళా ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతున్నట్లుగా కొద్ది రోజులుగా ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఆయన ఓ మహిళా బ్రేక్ ఇన్స్ పెక్టర్ ఇంటికి నేరుగా వెళ్లారు. ఆక్కడ వేధింపులకు గురి చేయడంతో ఆ మహిళ కుటుబంసభ్యులందరూ కలిసి చితక్కొట్టారు. అయితే పరువు పోతుందని చంద్రశేఖర్ రెడ్డి ఎవరికీ తెలియనట్లుగా ఊరుకున్నారు. కానీ ఆ నోటా.. ఈ నోటా అందరికీ తెలియడంతో అవును..మిమ్మల్ని ఆ బ్రేక్ ఇన్స్ పెక్టర్ కొట్టారట కదా అని అందరూ ప్రశ్నించడం ప్రారంభించారు.
చివరికి చంద్రశేఖర్ నిర్వాకం పై అధికారులకు తెలిసింది. మహిళా ఉద్యోగిని పిలిచి ఏం జరిగిందని ఆరా తీశారు. ఆ మహిళా బ్రేక్ ఇన్స్ పెక్టర్ జరిగింది అంతా చెప్పారు. ఆ తర్వాత ఆ అధికారి తీరుపై ఆఫీసులో మహిళా ఉద్యోగుల్ని ప్రశ్నిస్తే చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఆయన చూడటానికి బుద్దిమంతుడిగా ఉంటాడు కానీ.. నీచమైన బుద్దితో మహిళా ఉద్యోగుల్ని టార్చర్ పెడతారని ఆరోపణలు వచ్చాయి. దాంతో అధికారులు రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డికి నివేదిక సమర్పించారు.
మంత్రి రాంప్రసాద్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డిపై బదిలీ వేటు వేసి.. రాష్ట్ర కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. రవాణా శాఖకు కీర్తి తెచ్చేలా విధులు నిర్వహించాలని ఉద్యోగులకు మంత్రి హితవు పలికారు అధికారై ఉండి అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతూ మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు సరికాదని రవాణా శాఖ మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. సదరు అధికారి దుష్ప్రవర్తన దురదృష్టకరమని, ఈ సంఘటనను మంత్రి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై సదరు అధికారిని తక్షణమే విధుల నుండి తొలగించి కేంద్ర కార్యాలయానికీ సరెండర్ చేశామని, సీనియర్ అధికారిని నియమించి సమగ్ర విచారణ చేపట్టి సంబంధిత అధికారిపై శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పని చేస్తున్నా కూటమి ప్రభుత్వం ఇటువంటి దుష్ప్రవర్తనను ఉపేక్షించేది లేదని తెలిపారు. బాధిత మహిళలకు అండగా నిలిచి భరోసా కల్పిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు ఎక్కడ తలెత్తిన ప్రభుత్వం దృష్టికి తెలియపరచాలని తెలిపారు. ఇటువంటి అధికారుల తీరు పట్ల తప్పని సరిగా చర్యలు తీసుకోవడమే కాకుండ, భవిష్యత్ లో మరో అధికారి ఇలాంటి చర్యలకు తావు ఇవ్వకుండా చర్యలు ఉంటాయని, రవాణా అధికార్లు రవాణా అధికారులు శాఖకు కీర్తి తెచ్చేలా విధులు నిర్వహించాలని అధికారులకు మంత్రి సూచన చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

